విద్య కావాలి, విద్యే కావాలి, విద్య మాత్రమే కావాలి! ఐరోపాలోని అనేక నగరాలలో పర్యటించి, అక్కడ పేద ప్రజలకు సైతం ఉన్నటువంటి విద్య, సౌకర్యాలు పరిశీలించి, మన దెశ ప్రజల స్థితి మనస్సులో మెదలి నెను కన్నిరు కార్చెవాడను. తేడా ఎందుచేత వచ్చింది అని ప్రశ్నించుకుంటే, విద్య వల్ల అన్న సమాధానం నాకు తోచింది.

ఎనుకబదిన తరగతుల వారికి మనం చేయవలసిన ఏక్రాక సహాయం ఏమిటంటే, వారికి విద్యను అందించడం, లోకంలో జరిగేవాటి గురించి వారికి తెలిసేలా చేయడం. అప్పుడు వారి ఉన్నతికి వారే పాటుపడతారు. ప్రతి స్కీ ప్రతి పురుషుడు ఎవరి విముక్తికి వారే హటలు వేసుకొంటారు. వారికి విద్యను అందించడమే మన కర్తవ్యం. వారికి కావలసింది ఆ ఒక్క సహాయం మాత్రమే!

మన దేశంలోని సామాన్య ప్రజలందరినీ చెరుకోవడమే నా పథకం. ఆదర్వాలనన్నిటినీ మామూలు ప్రజానీకానికి తెలియపరచాలి. వారిని నిదానంగా మేల్కొల్పాలి. వారు సమున్నతిని సాధించేవరకు కృషిచేయాలి.

పేదల కోసం ఒకవేళ యావద్దెశమంతా పాఠశాలలు ప్రారంభించామనుకోండి. ఐనప్పటికీ వారందరికీ విద్య నందించలేం. అసలది ఎలా సాధ్యమవుతుంది? నాలుగేళ్ళ పిల్లవాడు కూడా నాగలి పుచ్చుకొని పొలానికిపోతాడు, ఫ్యాక్టరీలో పనికైనా వెళతాడు. మన బడికి రావడం కంటే అదే మంచిదనుకుంటాడు. ‘మహమ్మదు దగ్గరికి కొండ రాదు గనుక, కొండ దగ్గరకు మహమ్మదు వెళ్ళాలి’ అనేది సామెత. మరి విద్యయే ఇంటింటికీ ఎందుకు వెళ్ళరాదని అంటాను నేను. నాగలి దున్నెవాని కొడుకు చదువుకోవడానికి రాలేకపోతే నాగలి వున్నచోటుకే మనం వెళ్ళాలి, అలాగే, ఫ్యాక్టరిలోనైనా సరే వెళ్ళి కలుసుకోవాలి.

దేశంలో ఒక మూల నుండి మరొక మూలకు పర్యటించడం; ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి పర్యటించడం; నోమరులుగా తయారవడం మీకెంతమాత్రం మంచిదికాదని ప్రజలకు చెప్పడం – ఇవే మీ కర్తవ్యాలు. వారి నిజస్థితి ఏమిటో వారికి అవగతమయ్యెటట్లు చెప్పి, ‘ఓ సోదరులారా! మేల్కొనండి, మరెంతకాలం నిద్రపోతూ ఉంటారు!’ అని హెచ్చరించండి. వారున్నషస్థితిని ఎలా మెరుగు పరచుకోవాలో సూచించండి. వారికి అర్ధమయ్యే భాషలో జీవితావసరాలను గురించి, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం మొదలైన విషయాల గురించి వివరించండి.

ప్రజలకు కొంత సాంకేతిక విద్య లభిస్తే మంచిది. దాని వల్ల వారికి జీవనోపాధి లభిస్తుంది. అప్పుడు ఎవరో సాయం చేయాలని కూర్చొని ఎదడవకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. జీవనపోరాటాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధపరచని చదువులు, శీలసంపన్నతను పెంచని చదువులు, దాతృత్వ లక్షణాన్ని బహిర్దతం చేయని చదువులు ఎందుకు? శీలసంపదను రూపొందించేటువంటి, గుందె నిబ్బరాన్ని పెంచేటువంటి, మెధాజ్ఞానాన్ని విస్సృతపరచేటు వంటి, స్వయంతశక్తిని కలిగించేటువంటి విద్యే నేడు మనకు కావాల్సింది.