‘న గృహం గృహ మిత్యాహుః గృహిణీ గృహముచ్యతే – ఇంటిని గృహం అనరు, ఇల్లాలినె గృహం అంటారు’ అని ఒక సంస్కృత కవి చెప్పాడు. ఇది ఎంతో సత్యం. చలి నుండి, వేడిమి నుండి నిన్ను కాపాడే ఇంటి విలువను, దానికి ఆధారంగా ఉన్న స్తంభాలను బట్టి నిర్ణయించకూడదు. ఇంటికి నిజమైన ఆధారం, కెంద్రస్త్థానమైన ఇల్లాలిని బట్టే నిర్ణయించాలి. ఈ ప్రమాణాన్ని బట్టి చూస్తె అమెరికన్ల గృహాలు, లోకంలోని ఏ గృహాలకూ తీసిపోవు.

అమెరికన్ల గృహాల గురించి నెనెన్నో కథలు విన్నాను. అక్కది వారికున్న స్వేచ్చ విచ్చలవిడిగా తిరిగే స్థితిలోకి దిగజారుస్తున్నదనీ, ప్రీత్వంలేని ప్రీలు స్వాతంత్ర్యం పేరుతో కుటుంబంలోని సుఖశాంతులను నశింపచెసి, ఒళ్ళు తెలియని శివంతో గంతులు వెస్తున్నారసీ… ఇలాంటివె అనెక విషయాలు విన్నాను. అమెరికన్ల గృహజీవనం ఏ విధంగా ఉంటుందో, నేను ఒక సంవత్సరం స్వానుభవంతో చూశాక ఈ కట్టుకథలన్నీ ఎంత నిరాధారమైనవో గ్రహించాను. ఓ అమెరికన్‌ మాతలారా! మీ రుణం తీర్చుకోవడానికి నాకు నూరు జన్మలైనా చాలవు.

స్నేహితులు లేరు, దబ్బు లేదు, పేరుప్రతిష్టలు లేవు, పాండిత్యమా లేదు, తోడు లేదు. ఫకీరునై నిస్సహాయుళ్లై ఉన్నాను. దాదాపుగా దిక్కులెని స్థితిలో ఉన్నాను. అలాంటి సమయంలో అమెరికన్‌ స్రీలు నాకు సహాయులయ్యారు. సీడ నిచ్చారు. అన్నపానాలొసగారు. తమ ఇళ్ళకు ఆహ్వానించి తమ సోదరునిలా, తమ కుమారునిలా నన్ను ఆదరించారు. ఈ భయంకరుడిని, ఈ కైస్తవేతరుడిని వదలిపెట్టమని వారి మతగురువులు ప్రోద్పలం చేశారు. ‘ఈ విదేశీయుడు తెలియని వాడు. ఇతని శీలం ఎలాంటిదో తెలియదు. అందువల్ల ఇతగాణ్ణి చెరదీయొద్దు’ అని వారి మిత్రులు నిత్యం వారికి చెప్పేవారు. అయినా ఆ మహాతల్లులు నాకు అండగా నిలిచారు. నెనెలాంటివాణ్ళొ, నా శీలమెలాంటిదో వారు బాగా పరిశీలించగలిగారు. క ౦ నిర్మలంగా ఉంటేనే కదా ప్రతిబింబం స్వచ్చంగా కనిపిస్తుంది.

అమెరికాలోని ఎన్నో చక్కని కుటుంబాలను నేను తిలకించాను.. నిర్మలమైన శీలం గలిగి నన్ను పుత్రవాత్సల్యంతో చూసిన తల్లుల నెందరినో చూశాను. చక్కని సంస్కృతి, ఉత్తమమైన విద్య, మహోన్నతమైన వారమార్ధిక సంపద కలిగి హిమాలయాలలోని మంచులా అత్యంత స్వచ్చమైన, నిర్మల మనస్ములైన కన్నియలను, కుమార్తెలను ఎందరినో చూశాను. ఈ విధంగా ఉన్నప్పుడు – అమెరికా గంధర్వాంగనలతో, స్వైరవిహారిణులతో నిండి ఉందని చెప్పవచ్చా? అన్ని చోట్లా మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. నిజమే! కానీ ఒక దేశంలోని బలహీనులనూ, దుర్దనులనూ లెక్కలోకి తీసుకొని, ఆ దేశం మంచి చెడులు నిర్ణయించరాదు. కారణం వారు ప్రవాహంలో కొట్టుకుపోయే చెత్తచెదారం లాంటివారు. దేశం విలువ ఆ దేశంలోని ఉదాత్త చరితులను, వినిర్మలులను, వావనాత్ములను బట్టి నిర్ణయించాలి. వారే జాతీయ జీవనవాహిని ఎంత నిర్మలంగా, అనర్గళంగా ప్రవహించడాన్ని సూచిస్తారు. దాన్నిబట్టి వారి జీవన స్వభావాన్ని అంచనా వేయాలి.