పరబ్రహ్మ పరతత్త్వంలో స్త్రీ, పురుష భేదం లేదు. వ్యావహారిక క్షేత్రంలోనే మనకిది గోచరిస్తుంది మనస్సు అంతర్ముఖమయ్యేకొద్దీ ఈ భేదభావం అదృశ్యమవుతుంది. మనస్సు ఎప్పుడైతే అఖండ అవ్యయబ్రహ్మంలో పూర్తిగా లీనమవుతుందో అప్పుడు ఈమె ప్రీ ఇతడు పురుషుడు అనేటటు వంటి భావాలు ఉందనే ఉండవు. మేము దీన్ని శ్రీరామకృష్ణుల జీవితంలో ప్రత్యక్షంగా దర్శించాం. కాబట్టి బాహ్యంగా స్త్రీ పురుషులలో ఖేదం కనిపిస్తున్నా వారి యథార్థ స్వభావంలో ఎలాంటి భేదం లేదు. కాబట్టి పురుషుడు బ్రహ్మజ్ఞాని కాగలిగితే, ప్రీకి మాత్రం అదే జ్ఞానం ఎందుకు కలుగకూడదు?

జీవులందరిలో ఒకే ఆత్మ ఉన్నదని వేదాంతం చెబుతుండగా ఈ దేశంలో ప్రీ పురుషుల మధ్య అంత తారతమ్యం ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవడం కష్టంగా ఉంది. మీరెప్పుడూ స్త్రీలను విమర్శిస్తారు, వారి ఉన్నతికై మీరు చేసిందేమిటో చెప్పండి. స్మృతులు మొదలైనవి రాసి కఠిన నియమాలతో ప్రీలను బంధించి వారిని ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చివేశారు పురుషులు. జగజ్జనని ప్రతిరూపాలైన స్త్రీలను ఉద్ధరించకపోతే మీరు పైకి రావడానికి మార్దం ఏదైనా ఉందని తలస్తున్నారా?

స్త్రీలను తగురీతి గౌరవించిన ఇతర జాతులెంతో గొప్పతనాన్ని సాధించాయి. స్త్రీలను గౌరవించని దేశం ఏదీ గొప్పది కాలేదు. భవిష్యత్తులో కూడా గొప్పది కాబోదు.

“ఏ గృహాలలో ప్ర్తీలు గౌరవ మర్యాదలతో చూడబడతారో ఆ కుటుంబాలను దేవతలు ఆశీర్వదిస్తారు” అని మనువు చెప్పాడు. స్త్రీలను ఎంతగా ఆదరించాలో అంతగా పాశ్చాత్య పురుషులు వారిని ఆదరిస్తారు. అందువల్లనే వాశ్చాత్యులు అంతటి సంపదలతోను, అంతటి స్వాతంత్ర్యంతోను, అంతటి విజ్ఞానంతోను, అంతటి శక్తితోను అలరారుతున్నారు. అయితే మనం బానిసలుగా, దుఃఖీతులుగా, నిర్దవులుగా ఎందుకు ఉన్నాం? జవాబు సుస్పష్టంగా అవగతమవుతుంది.

భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి చిన్న శక్తి అని స్త్రీలు ఆ శక్తి యొక్య ప్రతిరూపాలు అని భావించేవాడు నిజమైన ‘శక్తి ఆరాధకుడు’.

మగపిల్లలను గూర్చి ఎంత జాగరూకత వహిస్తున్నామో అంత జాగరూకత ఆడపిల్లల విషయంలోను చూపుతూ, వారిని పోషిస్తూ విద్యావంతులను చేయాలి. ముప్పై సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం వాటించిన తర్వాత ఏ ప్రకారంగా కుమారులకు వివాహం చేస్తున్నామో, అదేవిధంగా కుమార్తెలు కూడా బ్రహ్మచర్యం వాటించి, విద్వాభ్యాసం చెసేటట్లు తల్లితండ్రులు చూడాలి.

ప్రపంచంలో ఉన్న ప్రీలందరికన్నా హైందవప్రీలు ఎంతో ఆధ్యాత్మికత కలవాళ్ళు, మతానురక్తులు. మనం ఈ సద్దుణాలను పదిలపరచి ప్రిల బుద్ద్ధిబలాన్ని పెంపొందించ గలిగితే భావి హైందవప్రీ ప్రపంచానికి ఆదర్భప్త్రీ కాగలదు.