మన పూర్వీకులు ఇతర జాతులవారిలాగే ఇంద్రియ గోచరమైన బాహ్యప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకోవడానికై మొట్టమొదట ప్రయత్నించారు. అద్భుతమైన తమ మేధాబలంతో లోకమంతా శాశ్వతంగా గర్వింపదగిన గొప్ప లౌకికకార్యాలను ఆ క్షేత్రంలో కూడా సాధించి ఉండేవాళ్ళు. కానీ, అంతకన్నా ఉత్తమమైన వేద రహస్యాలను కనుగొనడం కోసం వాటిని విడిచిపెట్టారు. అశాశ్వతము, శోకతప్తము అయిన ఈ మర్యలోక రహస్యాలను కనుగొనడం కన్నా మార్పులేనివాడు, ఆనందమయుడు, నిత్యుడు, అనంతుడు అయిన భగవంతుని గురించిన జ్ఞానం అన్నిటికన్నా మ హోత్కష్టమైనదని మన పూర్వీకుల ఉద్దేశం.

మనకు అన్నవస్తాలనూ; తోటిమానవులను వశం చేసుకొనే శక్తినీ బలవంతులు, బలహీనులపైన అధికారం చూపే యుక్తినీ నేర్ప శాన్హాన్ని కనుగొనాలని మన మహర్షులు కోరుకొనివుంటి సాధించివుందేవార్! కానీ ఈశ్వరకృపవల్ల అంతకన్నా మిక్కిలి ఉత్తమమైనది, ఉన్నతమైనది, శాశ్వతానందప్రదమైనది అయిన ఆత్మతత్త్వరహన్యాన్ని మన మహర్షులు కనుగొన్నారు. ఆధ్యాత్మికత మన జాతీయ స్వభావమైపోయేవరకూ, అది మనలో సారూవ్యాన్ని పొందేవరకూ, అది మన సహజ లక్షణమైపోయేవరకూ విడిచిపెట్టలేదు. అదే మన భారతజాతి విశిష్ట లక్షణం. దాన్ని ఎవరూ తాకలేరు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మన జాతి ఆయువుపట్టు. అది సురక్షితంగా ఉన్నంతకాలం ఈ జాతిని ధ్వంసం చేయగలశక్తి ఈ జగత్తులో ఎవరికీ లేదు.

మన పిత్రార్జిత సంపదలన్నింటిలోకీ శ్రేషఘప్రమమైన ఆధ్యాత్మికధర్మాన్ని మనం అవలంబీస్తున్నంతకాలం లాకికములైన అన్ని బాధలు, అన్ని దుఃఖాలు మనకు ఎలాంటి హాని కలుగబేయలేవు. మనం ప్రహ్లాదుని లాగా ఆ అగ్నిజ్వాలల నుండి సురక్షితంగా బయటపదగలం.

ఈ పుణ్యభూమిలో పునాది, వెన్నెముక, జీవకేంద్రం మతం ఒక్కటె. భారతదేశంలో ఆధ్యాత్మికత కేంద్రమవుతుంది, జాతీయజీవన గానానికి ముఖ్య విషయమవుతుంది. ఇతరులు రాజకీయాలను గూర్చి ప్రసంగించినా, వర్తకంవల్ల తమకు వచ్చిపడే ధనరాసుల్ని లెక్కించుకొని మురిసిపోయినా, వ్యాపారమూలంగా తమకు చేకూరిన అధికార వ్యాప్తిని గూర్చి గర్వించినా, ఐహిక స్వాతంత్ర సంపదను గూర్చి ప్రగల్బాలు పలికినా ఇవి భారతీయునికి అర్ధంకావు. అర్ధం చేసుకోవడానికి అతడు ప్రయత్నించడు. కానీ వేదాంతం, మతం, భగవంతుడు, జీవుడు, బ్రహ్మం, మోక్షం మొదలైన వాటినిగూర్చి ప్రశ్నిస్తే ఇతర దేశాల్లో తత్పకోవిదులని పేరుగాంచిన చాలామంది కంటే మన దేశంలోని మామూలు సిద్యగాడికి కూడా ఎక్కువ తెలిసి ఉంటుంది అని నేను కచ్చితంగా చెప్పగలను.