సోదరులారా! అందరం కష్టపడి పనిచేద్దాం. నిద్రకు ఇది సమయం కాదు. ఆదిలోనే పెద్ద ప్రణాళికలు వేయకండి. నిదానంగా ఆరంభఖించండి. కాలికింద భూమ్‌ గట్టిదనం చూసుకోండి. ఆ తర్వాత అడుగు వేయండి. పైపైకి సాగండి. సుదీర్హ నిశి గదడచిపోతోంది. ప్రభాతం ఆసన్నమవుతున్నది. 3రటం లేచింది; ఈ తరంగ ఉద్దృతాన్ని ఏదీ ఆపలేదు.

మన కృషి మీదనే భావిభారతోదయం ఆధారపడి ఉన్నది. భారతమాత వేచివున్నది. కాకపోతే ఇప్పుడామె నిద్రలో ఉన్నది. కాబట్టి, భవిష్యత్తులో మహోత్కష్ట దేశంగా రూపుదిద్దుకోవాలంటే, వ్యవస్థను పటిష్టం చేయడంలోనూ, శక్తిని సమీకరించడంలోనూ, సంకల్పాలను సంఘటితపరచడంలోనూ ఉన్నది అసలు కీలకం. నా మనోవీధిలో ఇప్పటికే అద్భుతమైన బుగ్వేద సంహిత ఒకటి ప్రభవిస్తోంది. “సర్వులూ ఏక మనస్ములై ఉండండి. మీరందరూ ఏకాభిప్రాయంతో మనండి” అని. ఎక మనస్సులై ఉండడంలోనే సంఘం యొక్క రహస్యం ఉన్నది. ఇదే అసలు రహస్యం. సంకల్పబలాలను సమీకృతం చేసి, అన్నిటినీ ఒకే కేంద్రపరిధిలోకి తీసుకొనిరావాలి.

సుదీర్హ నిశి గడచిపోతున్నట్లున్నది. తీవ్రంగా సలుపు తుండే ఇకృట్లు అంతమొందుతున్నట్లు కనిపిస్తున్నది. శవప్రాయమైన దేహం లేస్తున్నట్లున్నది. మనవైపాొక పిలుపు వస్తున్నది. భూతకాలంలోని అంధకారంలోకి తొంగి  చూడడానికి కూడా చరిత్ర, సంప్రదాయం భీతిపడేతావు నుండి వినవస్తున్నది ఆ వాణి. హిమవన్నగోన్నత విజ్ఞానంలో, ప్రేమలో, శ్రమలో ప్రతిఫలిస్తున్న మన భారతదేశం నుండి, మాతృభూమి నుంది వెలువడుతున్నది ఆ లలితారావం. మృదువుగా, స్పుటంగా, పొల్లులేని వాక్కులతో వినవస్తున్న ఈ స్వనం నానాటికీ ధ్వనిని పుంజుకొంటున్నది. నిద్రితులు మేల్కొంటున్నారు. హిమవన్నగ పవనాలవల ఇది నశించిన ఎముకలకు, కండరాలకు నవజీవనం కొనితెస్తున్నది. నిదురమత్తు వదలిపోతున్నది.

రైతుల కుటీరాల నుండి, నాగలి చేతబూని నవభారతాన్ని ఉద్భవించనివ్వంది – బెస్తవారి గుడిసెల నుండి, చెప్పులు కుట్టెవారి నుండి, విధులు ఊడద్చెవారి నుంది మేల్కొంటుంది నవభారతం. ప్రతి చిన్న దుకాణంలో, ఫ్యాక్టరీలలో, అంగళ్ళలో, చిన్న బజారులలో నుండి జాగృతి ఉద్దపితమవుతుంది. కొందచదియలలో, అడవులలో, చెట్ల గుబురులలో ప్రభవిస్తుంది, వెల్లివిరుస్తుంది ఈ నవచైతన్యం.

భూతకాలం నాటి అస్థిపంజరాలలారా! మీ కళ్ళ ముందున్న వారు మీ వారసులే! భావి భారతదేశమే! మీరు దాచుకొన్న నిధి నిక్షేప పేటికలను, ఆభరణ అంగుళలీయకాలను వారి ముందు నాధ్యమైనంత శీఘ్రంగా కుమ్మరించండి. మీరు అంతర్జానమై పోయి కంటికి కనిపించవద్దు. చెవులు రిక్కించి వినండి. మీరు మాయమైన మరుక్షణం భారత నవాభ్యుదయ నాందిఘోష వింటారు. లక్ష మేఘగర్జ్దనల గళమై అది జగత్తులో ప్రతిధ్వనిస్తుంది, మార్మోగుతుంది.

నవ వైతన్యం పుంజుకొని, కనీ వినీ ఎరుగని తేజోవిరాజమానయై, అమర సింహాసనాసీనయైన మన ఈ మాతృభూమిని వీక్షించండి. లెవండి, మెల్మొని ఆమెను దర్శించండి!