పవిత్రత, ప్రసన్నత, ప్రేమతత్త్వం, దయాగుణం, జ్ఞానశక్తి, తపశ్శక్తి, మాహాత్మ్యం – ఇవన్నీ ‘భగ’  అనె పదానికి అర్ధం.  కాబట్టి ఈ లక్షణాలున్నవారిని ‘భగవంతుడు’ అని అంటాం. యుగాలు మారినా, తరాలు తరలినా, శతాబ్దాలు మరలినా ఉత్తమ గుణాలున్న మహాత్ములు, మాహాత్యం గల మహాపురుషులు జగద్వంద్యులై విలసిల్లుతారు, మానవాళి హృదయంలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకొని పూజలందుకుంటారు.

లోకారాధ్యులైన మహాత్ములు పురాణకాలం నాటి వారు కావచ్చు, నవీన కాలానికి చెందినవారైనా కావచ్చు. భగవల్లక్షణా లున్న వారెవరైనా సదా, సర్వత్రా పూజనీయులే! విఘ్నాలను తొలగించే దైవంగా ప్రథమ పూజలు అందుకొంటున్న విఘ్నేశ్వరుడు పురాణకాలానికి చెందిన దైవమైతే, భారతజాతి ప్రతిష్ట పతనావస్థకు చేరుకొన్న తరుణంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన ప్రథమ సన్వాాసిగా కీర్తిశిఖ రాలందుకొన్న వివేకానంద నవయుగ వైతాళికుడు.

వినాయకుని సుందర రూవాన్ని వర్ణిస్తూ పిల్లలు ‘తుందము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెందుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందవోసమున్‌ కొందొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జలై యుందెది పొర్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్సెదన్‌’ అని వాడుతూ విద్యాప్రదాతను వేడుకుంటారు.

అలాగే విశ్వమత మహాసభల్లో పాల్గొన్న న్వామి వివేకానందను దర్శించిన అనిబిసెంట్‌ ఆయన రీవికి అబ్బురపడి స్వామీజీని ఇలా అభివర్టించింది: “అతడు భానుతేజ ప్రభాసమానుదై ప్రజ్వ రిల్లుతున్నాడు. ఆయనలో మృగరాజ ధీరత్వం ప్రస్ఫుటమవుతోంది. అందరినీ సమ్మోహపరిచే రీవి, తీక్షణమైన వీక్షణాలు ఆయనవి. అమృత వాక్కులను జాలువారే పెదవులు ఆయనవి. ఆయన పోరాట పటిమ గల సన్వాాసి. ప్రతిభాపాటవాలతో ప్రజలను వైతన్యవంతం చేయగల వ్యక్తిగా వివేకానంద భాసించారు”.

జనని… జన్మభూమి: శ్రీరామకృష్ణులు, వినాయకుని మాతృభక్తిని ఇలా వివరించారు: “ఒకసారి పార్వతీదేవి ఆసీనురాలై ఉండగా వినాయకుడు, కుమారస్వామి వచ్చారు. కుమారులిద్దరికి పార్వతీదేవి మెదలో ఉన్న రత్నాలహారాన్ని చూసి, దాన్ని పొందాలనే ఆశ కలిగింది. అప్పుడు ఆమె కుమారులిద్దరి ఉద్దేశాన్ని గ్రహించి వారితో ‘కుమారులారా! మీలో ఎవరైతే ముందుగా ఈ భూమండలాన్ని చుట్టి వస్తారో వారికి నా మెడలోని రత్నాలహారాన్ని బహుమతిగా ఇస్తాను’ అని చెప్పింది. తల్లి చెప్పిన మాట విన్న వెంటనె ప్రపంచాన్ని చుట్టిరావడానికి కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు.

వినాయకుడు మాత్రం ‘బ్రహ్మాండాలన్నీ తన తల్లి పార్వతీదేవిలోనే ఇమిడి ఉన్నాయనీ, ఆ బ్రహ్మాండ నాయకికి ప్రదక్షిణ  చేస్తే ప్రపంచమంతా ప్రదక్షిణ చేసినట్లై’ అని భావించి, పార్వతీదేవికి ప్రదక్షిణ చేసి పాదాభివందనాలు అర్పించాడు.

తనయుడి భక్తి విశ్వాసాలకు మెచ్చి పార్వతీదేవి తన మెడలోని రత్నాలహారాన్ని వినాయకుడికి బహుమతిగా ఇచ్చింది. ఇంతలో నెమలి వాహనం పై విశ్వమంతటా పరిభ్రమించి వచ్చిన కుమార స్వామికి తల్లి పెట్టిన పరీక్షలోని అంతరార్థం అవగతమైంది.”

న్వామి వివేకానంద నిర్వికల్ప సమాధి అనుభూతులనూ, స్వీయముక్తినీ త్యజించి భారతజాతి ఉద్ధరణ కోసం, భారతదేశ స్థితిగతులను తెలుసుకోవడం కోసం దేశమంతా పర్యటించారు.

వినాయకుడు తల్లి పార్వతీదేవికి ప్రదక్షిణ చేసి తల్లి పట్ల తన భక్తి విశ్వాసాలను ప్రదర్శించాడు. అలాగే వివేకానంద భారతదేశమంతా పర్యటించి (భారతమాతకు ప్రదక్షిణ చేసి) తన మాతృదేశభక్తిని చాటారు. పార్వతీదేవి వినాయకుని మాతృభక్తికి మెచ్చి తన మెడలోని రత్నాలహారాన్ని కానుకగా ఇస్తే స్వామీజీ మాతృదేశభక్తికి ప్రీతి చెంది రత్నగర్భ అయిన భారతమాత తన హృదయస్థానంలో సుస్థిర న్థానాన్నిచ్చింది.

స్వామీజీ భారతదేశంతో ఎంతగా తాదాత్యం చెందారో తెలియజేస్తూ సోదరి నివెదిత, ‘వివెకానందే భారతదేశం! భారతదేశమే వివేకానంద! భారతదేశం ఆయన ఆత్మ. ఆయనె భారతదేశం అయ్యారు’ అని కీర్తించారు. స్వామీజీయే స్వయంగా ‘నెను సాంద్రీకృత భారతం’ అని తనను తాను అభివర్ణించుకున్నారు. దీన్నిబట్టి స్వామీజీ దేశభక్తి ఎంత మహోన్నతమైందో అర్ధం చేసుకోవచ్చు.

వినాయకుడు మాతృభక్తినీ, వివేకానంద  దేశభక్తినీ ప్రదర్శించి, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’– జనని, జన్మభూమి స్వర్గం కన్నా మిన్ను అన్న మహోన్నత సత్యాన్ని ఆచరణాత్మకం చేసి లోకారాధ్యులయ్యారు.

దివ్యపురుషుల ధీశక్తి: పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని గ్రంథస్థం చెయడానికి వ్యాసమహర్షి వినాయకుడి సహాయాన్ని అర్ధించాడు. అందుకు వినాయకుడు సమ్మతించాడు. ‘నేను చెప్పిన విషయాన్ని మరోసారి అదగకుండా నిరాఘాటంగా వ్రాయాలి’ అని వ్యాసుడు షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు సమ్మతిస్తూనే, ‘నేను నిరాటంకంగా వ్రాస్తాను కానీ మీరు ఎక్కడా ఆపకుండా చెప్పాలి’ అని వ్యాసుడికి కూడా ఓ షరతు పెట్టాడు. ‘మరి, నేను చెప్పిన దాన్ని అర్ధం చేసుకొని వ్రాయాలిసుమా’! అని వ్యాసుడు కూడా ఇంకో షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. వ్యాస భగవానుడు ధారా ప్రవాహంగా భారత గాథను చెబుతూ ఉంటెే, దాన్ని అర్ధం చేసుకొని లిఖించిన వినాయకుని ధీశక్తి అనంతం, అనిర్వచనీయం.

స్వామి వివేకానంద అద్భుత ఏకాగ్రతాశక్తి గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. అందులో రందింటిని తెలుసుకుందాం.

స్వామీజీ గదిలో ‘ఎన్‌నైక్షోపెడియా ఆఫ్‌ బ్రీటానికా’ సంపుటాలను చూసిన ఒక శిష్యుడు ‘ఇవన్నీ చదవడానికి ఒక జీవిత కాలం సరిపోదు’ అని అన్నాడు. అప్పుడు స్వామీజీ ‘నేను పది సంపుటాలు చదివాను. వాటిలో నీకు ఇష్టమొచ్చిన ప్రశ్నను అడుగు’ అని అన్నారు. ఆ శిష్యుడు అదిగిన ప్రశ్నలన్నింటికి స్వామీజీ సరైన సమాధానమిచ్చారు. దాంతో, స్వామీజీ మేధాశక్తికి అతడు ఆశ్చర్యపోయాడు.

అలాగే ఒకసారి ఓ పాశ్చాత్య శిష్యుడు గోల్స్‌ ఆట ఆడుతుందడడం చూసి, ఆ ఆట గురించి వివరాలు అడిగారు స్వామీజీ. అతడు ‘కర్రతో బంతిని దూరంగా ఉన్న రంధ్రంలో పడేలా కొట్టాలి. ఈ ఆటలో ఎంతో నైపుణ్యం ఉన్నవారు కూడా ఎన్నోసార్లు ప్రయత్నిస్తేగాని బంతిని రంధ్రంలో పడేలా కొట్టలెరు’ అని అన్నాడు. అప్పుడు స్వామీజీ, ‘నేను ఒక్క ప్రయత్నంలోనే బంతి రంధ్రంలో పడేలా కొడతాను’ అని అన్నారు. అందుకు ఆ శిష్యుడు ‘అలాచేస్తే మీకు పది డాలర్లు ఇస్తాన’ని చెప్పాడు.

స్వామీజీ కర్రను చేత పట్టుకుని ఏకాగ్రతతో రంధ్రాన్ని చూస్తూ బంతిని కొట్టారు. బంతి సరిగ్గా రంధ్రంలో వెళ్ళి పడింది. అందరూ ఆశ్చర్యంతో ‘స్వామీజీ! ఈ ఆట గురించి ఏమీ తెలియని మీకు మొదటి ప్రయత్నంలోనే ఇది ఎలా సాధ్యమైంది’? అని ప్రశ్నించారు. ‘మానసిక ఏకాగ్రతే అందుకు కారణం’ అని అన్నారు స్వామీజీ.

విద్యలోనైనా, క్రీడల్లోనైనా, మరే రంగంలోనైనా నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఏకాగ్రత ముఖ్యమని నిరూపించారు స్వామీజీ. అందుకే ‘విద్యల సారం ఏకాగ్రతే’ అని ఆయన అన్నారు. ప్రొఫెసర్‌ విలియం హేస్టి, స్వామీజీ మేధాశక్తిని శ్లాఘిస్తూ, ‘నరేంద్రనాథ్‌ మహామెధావి. నేను జర్మనీ లాంటి ఎన్నో దేశాలను సందర్శించాను. కానీ నరేంద్రుని లాంటి ప్రతిభ గల వ్యక్తి ఒక్కరు కూడా తారసపడలేదు’ అని అన్నారు.

గణరాజ…  యతిరాజ: నిజమైన నాయకుడికి కార్యదక్షత, ధీశక్తితో పాటు పవిత్రత, ప్రసన్నత, సహనం, దయాగుణం మొదలైన లక్షణాలుండాలి. శుక్త్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే

తెల్లని వస్త్రాలను ధరించేవాడు (పవిత్రతా స్వరూపుడు), శశివర్ణం (నిర్మలాకారుడు), ప్రసన్న  వదనం కలవాడు (శాంత స్వరూపుడు), విఘ్నాలను తొలగించే (దయార్ద్ర హృదయుడు) వినాయకుణ్ణి ధ్యానిస్తున్నాను’ అని ప్రార్ధిస్తాం. వినాయకు డిలో ఈ దివ్యగుణాలన్నీ ఉండడం వల్ల పరమేశ్వరుడు అతల్బి గణాలకు నాయకుడిగా నియమించాడు. అందుకే వినాయకుణ్ణి గణనాయక, గణాధిప, గణనాథ, గణరాజ అని సంబోధిస్తాం.

దీన జనుల తాపాలను హరించే యతిరాజైన వివేకానందను

నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయె |
సచ్చిత్‌ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే

‘మహర్షి వివేకానందా! సచ్చిదానంద స్వరూపా! తాపాలను హరించె యతిరాజా! నీకు వందనాలు!’ అని ప్రార్థిస్తాం.

స్వామీజీలో నిజమైన నాయకుడి లక్షణాలన్నీ ఉండడం వల్లనె శ్రీరామకృష్ణులు మహాసమాధికి ముందు నరేంద్రుణ్ణి పిలిచి ‘చూడు నరేన్‌! నువ్వు బుద్ధిశాలివి, ప్రతిభావంతుడివి. అందువల్ల వీరందరి (మిగతా శిష్యుల) బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు వారిని ప్రేమతో ముందుండి నడిపించు’ అని చెప్పారు. ఆ విధంగా శ్రీరామకృష్ణులే, స్వామీజీని భవిష్యత్తులో ఆవిర్భ వించబోయే రామకృష్ణ సంఘానికి నాయకునిగా నియమించారు.

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుబ్సీ, తాపాలను హరించే వివేకానందుణ్సీ పూజిద్దాం. మనలో కూడా పవిత్రత, ప్రసన్నత, ధీశక్తి, కార్యదక్షతలు సెంపొందేలా ఆశీర్వదించాల్సిందిగా ఆ దివ్యపురుషులను ప్రార్థిద్దాం.