స్వామి వివేకానంద చికాగో విశ్వమత మహాసభల్లో పాల్గొని 125 వసంతాలు నిండిన సందర్భంగా రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌ కేంద్రాలు సెప్టెంబర్‌ 2018 నుండి సెప్టెంబర్‌ 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా స్మారకోత్స వాలను నిర్వహించనున్నాయి. ఈ చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకొని ‘శ్రీరామకృష్ణ ప్రభ’ 2018 సెప్టెంబర్‌ సంచిక నుండి2019 సెప్టెంబర్‌ సంచిక వరకు ప్రత్యేక వ్యాసాలను అందిస్తుంది.

విశ్వజనీన మతం : స్వామి వివేకానంద విశ్వమత మహాసభలో విశ్వజనీన మతంపై తన భావాలను ఇలా తెలియజేశారు:

“విశ్వజనీన మతం అంటూ ఒకటుండాలి అంటే అది ఒక ప్రదేశానికీ, సమయానికి పరిమితమవ్వనిదై ఉండాలి. అది భగవంతునివలె అనంతమైనదై ఉండాలి. ఆ మతం ప్రసరింపజేసే దివ్యకిరణాలు కృష్ణుడు, ఏసుక్రిస్తు అనుయాయులపైననేగాక పాపాత్ములూ, మహాత్ముల పైన సమంగా ప్రసరించాలి. అదొక బ్రాహ్మణత్వపు లేక బౌద్ధ, కైస్తవ, మహమ్మదీయ మతంగాకాక వాటన్నిటిని సమన్వయ పరిచెదిగా ఉండాలి. అది ఎంతో బెదార్యబుద్ధితో, సౌజన్యంతో తన అనంత హస్తాలను చాపి ప్రతి వ్యక్తిని తనలో ఇముడ్చుకోగలగాలి.

వ్యక్తుల మధ్య భేదాలు గమనించకుండా అత్యున్నత గుణసంపదలతో ఉన్న మానవుని నుండి, పశుస్థాయిలో ఉన్న మానవుని వరకు ఆ మతం సమన్యానం కల్పించగలగాలి. అది హింసకూ, అనాగరికతకూ, అసహనానికీ తావివ్వని మతంగా ఉండాలి. అంతేకాదు ప్రతి పురుషుడు, ప్రతి ప్రీలోని దివ్యత్వాన్ని గుర్తించేదిగా ఉండాలి. ఆ మతం యొక్క లక్ష్యం అంతా మానవాళి తమ నిజతత్వాన్నీ, దివ్యత్వాన్నీ అనుభూతం చెందేందుకు తోద్పడడంపైనే కేంద్రీకృతమై ఉండాలి”.

మనం ఏమి చేయగలం! : ఇప్పటివరకూ చర్చించిన విషయాలన్ని గ్రహించిన తరువాత ద్వేషం, భయం పూర్తిగా నెలకొని ఉన్న ప్రస్తుత ప్రపంచంలో అటువంటి మత సమన్వయం తీసుకురావడానికి మనం ఏమిచేయ గలమో పరిశీలిద్దాం.

మొట్టమొదట – వివిధ మతాలకు సంబంధించిన వారందరినీ ఒకే ఐక్యవేదికపైకి తీసుకురావాలి. అంతేకాదు, అది అందరిలో ఒక సరైన అవగాహనను కల్పించి, సమన్వయ చైతన్యానికి దారితీయాలి.

అది ఎటువంటి అవగాహనై ఉండాలి? ప్రప్రథమంగా ప్రతి వ్యక్తీ మత స్వేచ్చను సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఎవరూ ఆ స్వేచ్చకు అంతరాయం కలిగించకూడదు. అది వారి వ్యక్తిగత విషయం. ఆ విధంగా చూసినప్పుడు ఒకే కుటుంబంలో భర్త ఒక మతానికీ, భార్య మరొక మతానికీ చెందినవారై ఉండవచ్చు. ఐనాసరే, ఆ కుటుంబంలో పరిపూర్ణ శాంతి నెలకొని ఉండాలి. ఇదె దృక్పథాన్ని విశ్వవ్యాప్తం చేస్తే, శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద ఆశించిన మత సమన్వయచిత్రం మనముందు సాక్షాత్మరిస్తుంది. ప్రతివ్యక్తికి ఒక మతశాఖ ఉండాలని స్వామీజీ ప్రకటించారు. ఈ భువిలోని ప్రతిదేశ రాజ్యాంగంలోనూ సంపూర్ణ మత స్వేచ్చ కచ్చితంగా చోటుచేసుకోవాలి. ఐతే ఈ స్వేచ్చ ఇతరుల స్వేచ్చను హరించేదిగా ఉందకూడదు.

మతం – విజ్ఞానశాస్త్రం : ప్రపంచంలోని ప్రతి దేశానికి ఈ సమన్వయ మత సిద్దాంతాన్ని తీసుకెళ్ళాలి. శతాబ్దాల తరబడి ఉన్న మత విశ్వానాలు తొలగిపోవడం చాలా కష్టమెకానీ, మానవ సంబంధ విషయాలలో ఏమాత్రం హెతుబద్ధతా, విజ్ఞానశాస్త్రపు భావనలూ ఉన్నా మత స్వెచ్చ నిరాకరింపబడదు. ఆ విధంగా కానట్లయితే, విజ్ఞానశాస్త్రం ఈ ప్రపంచంలోని భోగ భాగ్యాలను మరింత సుఖవంతంగా అనుభవించడానికీ, ఆనందించడానికీ కావలసిన సాంకేతిక ప్రక్రియలనూ, యంత్రసామగినీ సృష్టించడానికి మాత్రమె పరిమితమవుతుంది. అంతేగాక, ప్రపంచాన్నంతటినీ నాశనం చేయడానికి మరింత సమర్థవంతమైన పద్ధతులను కనిపెట్టడానికి కూడా ఉపకరించే ప్రమాదం ఉంది.

మతం-సాంఘిక జీవనం: సాంఘిక జీవనానికి, మతానికీ అసలు సంబంధమేలేకుండా చేస్తే, నాంస్కృతిక హెచ్చుతగ్గులన్నీ వాటంతటవె సమసిపోతాయి. ఇటువంటి వాదనలలో కొంతవరకూ నిజం ఉంది. కానీ మతం ద్వారా కలిగే సాంస్కృతిక ప్రయోజనాలను వదులుకోకుండా, మతంతో కూదిన సంఘాన్ని నిర్మించడం సాధ్యం కాదా? ప్రపంచంలోని అన్ని దేశాలలో జరిపిన సాంఘిక ప్రయోగాలన్నిటికన్నా ఈ ప్రయోగం మిన్నగా నిలుస్తుంది.

మతం ఆధ్యాత్మకరించబడాలి: మానవజీవితం ఆధ్యాత్మిక పరిణామానికి, ఎదుగుదలకీ గల ఒక మహత్తర అవకాశం అన్న వేదబుషుల భావాన్ని ఆధునిక పద్ధతిలో వ్యక్తికరించ గలగాలి. క్షుప్తంగా చెప్పాలంటే, మతం ఆధ్యాత్మీకరించబడాలి. అంతేగానీ దానిని సాంఘీకరణ చేయడంగానీ, రాజకీయం చేయడంగానీ జరగకూడదు. అటువంటి విప్లవానికి ప్రపంచం సిద్ధంగా ఉందా? శ్రీరామకృష్ణ, వివేకానందులు మతం విషయంలో అటువంటి విప్లవం రావాలని ఆశించారు. కానీ మనం ఇంకా దానికి సంసిద్ధంగా లేమని అనిపిస్తున్నది. మానవాళి. ఈ విషయాన్ని ఒక సవాలుగా స్వీకరించ దానికి సిద్ధమై, మానవ సంఘపు దృష్టిలో అవసరమైన మార్పులు తేగలిగినప్పుడే భువిపై ద్వేషంలేని, భయంలేని, పోటీతత్వంలేని, రక్తపాతంలేని స్వర్ణయుగం ఆవిర్భవిస్తుంది.

ఐతే, మతాన్ని రాజకీయాల నుండి విడదీస్తే, మత అనుయాయుల అభిరుచీ, ఉత్సాహం తగ్గిపోతాయని కొంతమంది వాదించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, అటువంటి సమస్యలన్నీ రాజకీయాల ఆధారంగానే పరిష్కరింపబడాలి తప్ప, వాటిలోకి మతాన్ని జొప్పించి, తప్పుడు వ్యాఖ్యానాలు చేయకూడదు.

మతం కలుషితం అయింటి అంటే అది స్వార్ధం, అజ్ఞానాల వల్లన. మతమే కలుషితమైతే, మానవాళి అభివృద్దికి తావే ఉండదు. కలుషిత మైన, పతనం చెందిన మతం మానవాళిని పశుత్వం నుండి దివ్యత్వం వైపు మరల్చలేదు. పశుప్రాయంగా అన్న మనిషిని నిజమైగ మానవత్వం దిశగా, అక్కడి నుండి దివ్యత్వం దిశగా మరల్చి గలగడంలోనే మతం యొక్క నిజప్రయోజనం దాగివుంది.

మతసందేహాలు – న్యాయపరిమవ్మారాలు : మత సందేహపు పరిష్కారానికి న్యాయపరమైన విధానాల గురించి మరొక్మమాట – దానిని గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే సద్దుణాలు కలిగిన వ్యక్తికే, నిజమైన మతం అబ్బుతుంది. న్యాయశాస్త్రం కూడా ఒక నాంఘిక వ్యవస్థ కాబట్టి అది సంఘంలో ఉత్పన్నమయ్యె సమస్యలను పరిష్కరించడానికి మాత్రమె అవసరమవు తుంది తప్ప మత సమస్యల పరిష్మారానికి అది ఉపయోగపడదు. అందుచేత మతాన్ని సరియైన దృక్పథంతో అవగాహన చెసుకొని ఆచరించాలి.

వివేకానంద కలలుగన్న విశ్వజనీన మతాన్ని 21వ శతాబ్దంలోనైనా చూడగలమా?

(*పరమపూజ్య స్వామి స్మరణానందజీ మహరాజ్‌ ప్రస్తుత రామకృష్ణ సంఘ సర్వాధ్యక్షులు)

తెలుగు సేత : దాక్టర్‌ పన్నాల శ్యామసుందరమూర్తి