‘మన భారతదేశ యువతరానికి స్వామి వివేకానందుల రచనలు, ఉపన్యాసాలు అత్యంత స్పూర్తినీ, ప్రేరణనూ ఇచ్చి వారిలో దేశభక్తినీ, ఆత్మశక్తినీ జాగ్భతం చేసి ముందుకు నడిపిస్తాయని భావించి స్వామీజీ జన్మదినమైన – జనవరి 12ను ‘జాతీయ యువజన దినోత్సవం’గా ప్రకటిస్తున్నాం’ అని 1985వ సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వివరించారు. కానీ చాలా మంది యువతకు ఈ విషయం తెలియదు! రామకృష్ణ మిషన్‌, మరికొన్ని ఇతర సంస్థలు తప్ప, జాతీయ యువజన దినోత్సవాన్ని ఎవరూ జరుపుకోవడం లేదు! ఇది ఎంతో శోచనీయం!

ఎందుకు న్వామి వివేకానంద యువతకు ఆదర్శం? కేవలం ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరాల యువకునిగానే స్వామీజీ 39 యుగాలేమిటి, సూర్య చంద్రులుందేటంత వరకూ మానవాళికి మేలు చేసే జ్ఞానసంపదనూ, ప్రేరణాశక్తినీ ప్రసాదించి వెళ్ళారు! 30 ఏళ్ళ వయస్సులో 1898 సెప్టెంబరు 11వ తేదీన అమెరికా లోని చికాగో మహానగరంలో ‘విశ్వమత మహాసభిలో ఏడు వేల మంది వ్రేష్ట మేధావులు, ఆచార్యులు, మత పెద్దల ముందు ‘Sisters and brothers of America – అమెరికా సోదరీ సోదరులారా!’ అనే సంబోధనతోనే విశ్వమానవ హృదయాంత రంగాలను పులకాంకితులను చేసిన ఘనత వివేకానందులది. అలా వివేకానంద విజయ యాత్ర, జ్ఞానదాన జైత్రయాత్ర 1902 జూలై 4న బేలూరు మఠంలో సాధువులు, బ్రహ్మచారులకు ఉపనిషత్తులలోని ఆత్మజ్ఞాన తత్త్వాలను వివరించే వరకూ కొన సాగింది. కేవలం 9 ఎళ్ళ లోనే 1,500 సంవత్సరాలకు కావలసి నంత సందేశాన్ని ప్రసాదించి వెళ్ళిన నవ యువ వేదాంత కేసరి, భారత ఆధ్యాత్మ సింహం, హైందవ రుంరూమారుతం స్వామి వివేకానంద. మన యువతకు ఆయన ఆదర్శవంతుడు కాదా?

గురుదేవులయిన శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం స్వామీజీ 1890లో పరివ్రాజక సన్వా్యాసిగా భారతదెశ పాదయాత్ర ప్రారంభించారు. భారతీయ నిరుపేదల కప్టాలనూ, కన్నీళ్ళనూ ప్రత్యక్షంగా దర్శించారు. రాజుల, మహారాజుల, సంపన్నుల భోగాలను, కరడు గట్టిన స్వార్ధపరుల జీవితాలనూ వీక్షించారు. అంటరానితనం, అజ్ఞానం, విదేశీ పాలకులకు దాసత్వం, ఆకలి, నిరక్షరాస్యతల విలయ  తాందవం ప్రత్యక్షంగా చూసి విలవిలలాడారు. భారతదేశ ఆఖరి దక్షిణాగ్రం కన్యాకుమారికి చేరుకుని అమ్మవారి దర్శనం పొంది సముద్రమధ్యంలోని ‘శ్రీపాదశిల’ పై మూడు రోజులు ‘భారతదేశం’పై ధ్యానించారు. ఇలా ఒక యువ సన్వాాసి స్వీయమోక్షం, ఇష్టదైవ దర్శనం కోసం కాక తన మాతృదేశ పురోగతి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం ధ్యానం చేయడం ప్రపంచ చరిత్రలో మరెక్కడా, ఎన్నడూ జరుగలేదు! స్వార్ధ ప్రయోజనాల కోసం, తుచ్చ సుఖభోగాల కోసం మాతృదేశ ప్రజాధనాన్ని ‘స్వాహా’ చెస్తున్న ఈ రోజుల్లో భారతీయుల కష్టాలను చూసి కలత చెందిన ఈ యువ సన్వాాసి భారత యువతకు ఆదర్శవంతుడు కాదా?

‘…Your country needs Heroes; Be Heroes’ అని ఓ లేఖలో తమ శిష్యులకు అమెరికా నుండి వ్రాశారు స్వామీజీ. శ్రీరామకృష్ణుల ఆదేశం,  శ్రీశారదామాత ఆశీస్సులతో అమెరికాలోని చికాగో నగరంలో జరుగబోయే ‘విశ్వమత మహాసభిలకు 1893, మె ౩1న ప్రయాణమయ్యారు స్వామీజీ. నెలల తరబడి సముద్ర ప్రయాణం. జూలైలో చికాగో చేరుకున్నాక తెలిసింది – మహాసభలు సెప్టెంబరులో ప్రారంభమవుతాయని. చేతిలో ఉన్న ధనం అంతంత మాత్రమే! ఎవరూ పరిచయం లేరు… ఈ కొత్త వింత కాషాయరంగు దుస్తుల మనిషిని విచిత్రంగా చూస్తూన్న అమెరికన్లు… తలపాగా లాగారు కొందరు, వెకిలిగా నవ్వారు కొందరు, రాళ్ళు రువ్వారు తుంటరి పిల్లలు. తల దాచుకోవడానికి ఒక ఇల్లు లేదు. ఆకలితో ఎన్నోసార్లు భిక్షమడగడానికి ప్రయత్నించారు. ముఖం మీదే వాకిళ్ళు దభిలుమని మూసేశారు. నల్లజాతివాడు అని అవమానించి రాత్రులు తలదాచుకోవడానికి లాడ్జీలలో గది ఇవ్వలేదు! ఆకలి, అలసటతో సొమ్మసిల్లి ఫుట్‌పాత్‌ మీద పడిపోయారు ఓ రోజు! రైలు గూద్చు పెట్టెలో చలికి వణుకుతూ రాత్రికి తల దాచుకున్నారు మరో రోజు!

ఇలా ఎన్ని కవ్టాలు, కడగండ్లు, అవమానాలు, అవహేళనలు ఎదురైనా వివేకానందుని ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ప్రచండ సంకల్పం చెక్కుచెదరలేదు! మొక్కవోని ధైర్యసాహసాలతో, దైవంపై అచంచల విశ్వాసం, శరణాగతితో ఈ యువ సన్వాసి అదుగు ముందుకే వేశాడు కానీ వెనుకంజ వేయలేదు, వెనుతిరిగి చూడలేదు!

చిన్న మాటలకే అలిగే యువతీ యువకులు; తల్లితండ్రులు అదిగింది ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకొనే విద్యార్థులు; పరీక్షల్లో తప్పితే మరణమే శరణ్యమనుకునే దుర్చల మనస్కులు; తండ్రి క్రమశిక్షణను బోధిస్తే ఇల్లు విడిచి పారిపోయే విద్యార్థులు – ఈ బలహీన మనస్సులు, దుర్చల హృదయులకు బలమే జీవనం. బలహీనతే మరణం… ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగు’. ఆత్మవిశ్వాసమున్న కొద్దిమంది ధీరుల చరిత్రే ప్రపంచ చరిత్ర – ఇలాంటి అగ్ని మంత్రాలు, ధీరవచనాలతో ప్రేరణనూ, స్ఫూర్తినీ ఒసగే వివేకానంద స్వామి యువతరానికి ఆదర్శవంతుడు కాదా?

ఈ రోజు యువతీ యువకులలో, విద్యార్థులలో ళ్‌ ఒక దౌర్చల్యం ప్రవేశించింది. అది సినిమా హీరో, హీరోయిన్లనూ, ఫ్యాషన్‌ స్టార్లనూ ‘రోల్‌ మోడల్‌’గా చేసుకొని, వారిని గుడ్డిగా అనుకరించడం, అనుసరించడం! నేటి యువతీయువకులు, అలా తయారుకావడానికి బాధ్యతా రహితులైన తల్లితండ్రులూ తమ వంతు పాత్ర వఐోషిస్తున్నారు. నటనను వృత్తిగా స్వీకరించిన వారు నటులు మాత్రమే! నటులుగా వారి స్టానాన్సీీ గౌరవాన్నీ వారికి ఇవ్వాలి. అంతేకానీ ఆ నటుల్ని అనుకరిస్తూ జీవితాలను పాడు చేసుకోకూడదు.

సమాజంలో దాక్టర్‌కూ, ఇంజనీర్‌కూ, లాయర్‌కూ, ప్రాఫెసర్‌కూ ఎలా ఒక స్థానం ఉందో అదే స్ధానం ఒక యాక్టర్‌కూ ఉండాలి! కానీ ఆ నటులను అనుకరించే మోహం నుండి మన యువతరం ఎంత త్వరగా బయట పడితే మన దేశానికి అంత మంచిది!

ఒక మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌లో వెయ్యింతలు దేశభక్తిని పెంచి, ‘మహాత్నా గాంధీ’గా మలచిన వివేకానందే మన యువతకు ఆదర్శం.

సుభాష్‌ చంద్ర జోసలో ధైర్యసాహసాల్నీ దేశభక్తిని నూరిపోసి 30 వేల మందితో యువ ‘ఆజాద్‌ హిందు ఫౌజొ’ను స్వాతంత్రసమరం కోసం నడిపింపజేసి ‘నేతాజీ’గా చేసిన వివేకానందస్వామే మన యువకులకు ‘కమాండర్‌ ఇన్‌ చీఫ్‌’.

జెమ్‌షెద్‌జీ టాటా గుండెల్లో ఆత్మశక్తి తూటాలను పేల్చి ‘నవభారత పారిశ్రామికనెత’గా తీర్చిదిద్దిన వివేకానందుడే మన దేశానికి ఆదర్శనేత.

ఆత్మహత్యకు పూనుకున్న అన్నా హజారేకు ఆదర్శ సమాజ సేవకునిగా మారడానికి ప్రేరణనిచ్చిన మహోన్నత దేశప్రేమి స్వామీజీయే దేశానికి నిజమైన ఆదర్శప్రాయుడు.

కాలు లేని అమ్మాయి ‘అరుణిమా సిన్హా’ ఎవరెస్ట్‌ పర్వతం అధిరోహించేందుకు ఆత్మబలం, సాహస స్పూర్తీ ప్రసాదించిన వివేకానందుదడే మన జాతికి నిజమైన ఆదర్శవంతుడు.

కొండలు, గుహలు, అరణ్యాలు, హిమాలయాలకే పరిమితమైన సన్వ్వాసులు, యతులకు ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న మహామంత్రంతో ‘నిరుపేదల సేవలోనే నిర్వాణ సుఖం’ ఉందని నిరూపించిన వివేకానందుదే నిజమైన ఆదర్శవంతుడు.

కాబట్టి, నేటి యువతరం నిజ జీవితంలో నిజమైన  వీరులూ, శూరులూ, ధీరులూ కావాలంటే జ్ఞానతేజం, శక్తిపుంజం, స్ఫూర్తికేంద్రమైన – స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి!