భారతీయ ఆధ్యాత్మిక సంపద కోసం ప్రపంచ దేశాలన్నీ నిరిక్షిస్తున్నాయి. దశాజ్ఞాల పర్యంతం మన దేశం దైన్యస్థితిని, పతనావస్థను చవిచూస్తున్నప్పటికి మన ప్రాచీనుల నుండి వారసత్వంగా సంక్రమించిన అద్భుత ఆధ్యాత్మిక నిధులను మాత్రం సంరక్షించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం ఇతర దెశాలకు వెళ్ళి వారి నుండి మనకు అవసరమైన శాస్త్రవిజ్ఞానాన్ని భౌతిక సంపత్తిని స్వీకరించి, అందుకు బదులుగా వాదికి మన అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానసంపదను ప్రదానం చేయాలి. సదా మనం విద్యార్థులుగానేె ఉండం, గురువులుగా కూడా ఉండగలుగుతాం. సమత లేకుండా మైత్రి పొసగదు; ఒకరు ఎల్లప్పుడూ గురువుగా చెలామణి అవుతూ ఉంటే మరొకరు సదా అతడికి పాదాక్రాంతుడయ్యెటప్పుడు సమత ప్రసక్తే ఉండదు. ఆంగ్రేయునితో గాని, అమెదికా దెశస్టునితోగాని సమాన స్థాయిలో మనం వ్యవహరించగోరితే మనం వారికి బోధించడమూ, వారి నుండి నెర్చుకోవడమూ రెండూ చెయ్యాలి. ఎన్నో శతాబ్దాల నుండి మన వద్ద నిల్వవున్న ఆధ్యాత్మిక జ్ఞానరాళిని ప్రపంచానికి పంచాల్సివుంది.

మనం బాహ్యప్రకృతిపై విజయం సాధించే మెళకువలను ఐరోపా వారి నుండి నెర్చుకోవాలి; అంతరిక ప్రకృతిపై విజయనాధనల కీలకాంశాలను ఐరోపావారు మన నుండి నేర్చుకోవాలి. అలాంటప్పుడు హిందువులనీ, యూరోపియన్‌లనీ విడివిడి జాతులు ఉండవు. బాహ్య ప్రకృతిని, అంతరిక ప్రకృతిని జయించిన ఆదర్శవంతమైన మానవజాతి ఒక్కటె విరాజిల్లుతుంది. మానవాళిలో ఒక దశను మనం పెంపొందింపజేస్తే, వారు మరో దశను పెంపొందించారు. ఈ రెండు దశల సంయోగమే మన లక్ష్యం కావాలి.

జీవితం అంటే ఏమిటి? అభివృద్ది లేక వికాసం లేక ప్రమ. కనుక ప్రేమమయమె జీవితం, ఇదే జీవనసూత్రం. స్వార్ధమె మరణం. ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్యమే. ఇతరులకు మంచి చేయడమే జీవితం, హానిచేయదడమే మరణం.

నాయనలారా! భీతి చెందకండి. మిన్ను విరిగి మీద పడుతుందని భయపడవద్దు. వేచి ఉండండి! ధనం వల్ల ప్రయోజనం లేదు. పెరుప్రతిష్టలు, విద్వత్తు కూడా నిష్ప్రయోజనాలే! మనకు కావలసింది చిత్తశుద్దిగల మనుష్యులు, అటువంటి వారు ఎంత ఎక్కువమంది లభిస్తే అంత మంచిది. దుర్భెద్యమైన కష్టాలనె గోడలను సైతం ఛేదించగలిగేది శీలం మాత్రమే.

మహత్శార్యాలు సాధించడానికే జన్మించామనే విశ్వాసంతో మెలగండి, నా సాహస బాలల్లారా! కుక్కపిల్లల మొరుగులకు భయపడకండి, అశనివాతాలకు (పిడుగులకు) కూడా వెరవవద్దు. స్థిరంగా నిలబడి కార్యోన్ముఖులుకండి!