స్వామి వివేకానంద మద్రాసు పర్యటనలో ఉన్నప్పుడు చాలా మంది యువకులు ఆయన భావాల పట్ల ఆకర్షితు లయ్యారు. ప్రతీ రోజు సముద్ర తీరంలో (మెరీనా బీచ్‌) పచార్లు చేయడం స్వామీజీకి, వారి శిష్యులకు అలవాటై పోయింది. ఒకసారి వి.సుబ్రహ్మణ్యం అయ్యర్‌తో కలిసి స్వామీజీ సముద్రతీరానికి వ్యాహ్యాళికి వెళ్ళారు. అకస్మాత్తుగా స్వామీజీ, అయ్యర్‌ను “నీకు మల్లయుద్ధం తెలుసా” అని అడిగారు. “తెలుసు” అని అయ్యర్‌ జవాబు ఇవ్వగానే, “సరే అయితే రా, ఒక పట్టు పడదాం” అన్నారు స్వామీజీ.

ఇద్దరూ మల్లయుద్ధం చేసిన తరువాత స్వామీజీ కండబలం చూసి అయ్యర్‌, “ప్పీర్రు పహిల్వాన్‌ స్వామీజీ” అన్నాడు. మూర్తీభవించిన బలమే స్వామి వివేకానంద. వారి నోటి నుండి జాలువారే ప్రతీ మాట ఒక బలగుళిక, ఒక మహామంత్రం. “మీరు బలంగా ఉన్నారా? బలమైన వారమని అనుకొంటున్నారా?” ఇది స్వామి వివేకానంద మానవాళికి వెసే ప్రశ్న ఈ ప్రపంచంలోని రుగ్మతలకు బలమే సరైన మందు. ‘Strength is life and weakness is death – బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే సంతోషం, శాశ్వతం, అమృత జీవనం. బలహీనతే ఎడతెగని ప్రయాస, దుఖుం; బలహీనతే మరణం’ అని ఒక మహత్తర యథార్దాన్ని లోకానికి చాటారు స్వామి వివేకానంద.

స్వామీజీ బోధించింది జాతిని బలవంతులు కమ్మని. బలవంతులంటే కండబలం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం కాదు. తమ మీద తమకు నమ్మకం, ఆత్మనిగ్రహం కలిగివుండి, ఇతరుల కోసం పరితపించడం ద్వారానే బలవంతులు కావాలి. అయితే స్వామీజీ ప్రతీ వ్యక్తికీ బాహుబలం (Physical strength)తో పాటు బుద్ధిబలం (Intellectual strength), ఆత్మబలం (Spiritual strength) కూడా ఉండాలంటారు. మనిషి చాలా పనులు చేయాలని సంకల్పించి చిలుక పలుకులు పలుకుతాడు. కానీ చేయాలని అనుకోవడం, వాటిని చేయకపోవడం- ఇది ఒక అలవాటుగా మారింది. దానికి కారణం బాహుబలం లేకపోవడమే. అందుచేత స్వామీజీ యువతను బాహుబలాన్ని మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. అయితే శారీరక బలాన్ని మానసిక స్థెర్యాన్ని నిర్మాణాత్మక పనులకు ఉపయోగించాలే తప్ప ఇతరులకు నష్టాన్ని, కప్పాన్ని కలిగించే పనులకు ఉపయోగించకూడదు. బాహుబలం అంటే ఒక మల్లయోధుడు కానక్కర్లేదు. కష్టపడి పనిచేసేటంత కండబలం ఉంటే చాలు. ఒక బలహీనుడు మరొక బలహీనుడికి సహాయం చేయలేడు. అందుచేత స్వామి వివేకానంద ‘Be and make – నువ్వు తయారయ్యి ఎదుటి వాదిని తయారుచెయ్యి’. Be strong and make others strong. Be good, do good and make others good. Be a useful citizen and then make others also useful citizens – నువ్వు బలంగా ఉండి ఇతరులను బలవంతులుగా చేయాలి. నువ్వు సౌశీల్యుడిగానూ, పరోపకారిగానూ ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి; నువ్వు ఉపయుక్త పౌరుడిగా ఉంటూ ఇతరులను ఉపయుక్త పౌరులుగా తయారు చేయాలి అని అంటారు.

ఒక కళాశాల విద్యార్థి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనాలని సంకల్పించాడు. అయితే తనకున్న బలహీన శరీరాన్ని చూసుకొని కలత చెందాడు. ఒక బలహీనుడు దేశం కోసం త్యాగం చేయ లేడనుకొన్నాడు. అప్పుడు వ్యాయామశాలకు వెళ్ళి కందబలాన్ని పెంచి, న్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికాడు. ఆ స్వాతంత్ర్య ఉద్యమనాయకుడే బాలగంగాధర్‌ తిలక్‌. అందుకే స్వామీజీ ‘ఇనుప కండరాలు, ఉక్కునరాలు గల యువకులు దేశానికి అవసరం‘ అంటారు. శారీరక బలానికి ప్రాముఖ్యతనివ్వడం కూడా జీవన నావకు కావల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికీ, ఆత్మబలం సంపాదించుకోవడానికే. ఉపనిషత్తులలో శరీర మాద్యం ఖలు ధర్శ సౌధనం – జీవితంలో ఏది సాధించాలన్నా శరీరం అవసరం అని చెప్పబడింది. శారీరకంగా బలంగా లేకపోతే ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతీ వ్రాభవాన్ని అర్ధం చేసుకోవడం కష్టమన్నది స్వామీజీ ఉద్దేశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే యువకులు బలవంతులుగా మారిన తరువాతే వారికి ఆధ్యాత్మికత గురించి బోధించాలన్నారు. మీరు బలవంతులు కండి. ఇదే నేను మీకిచ్చే సలహా. బలహీనులుగా ఉండి భగవద్గీత పారాయణం చెయ్యటం కన్నా ఫుట్‌బాల్‌ ఆట ఆడి బలాన్ని పొందటం మూలంగా మీరు స్వర్గానికి దగ్గరవుతారు’ అంటారు న్వామి వివేకానంద.

దృధశరీరం కలవారు మాత్రమే ఇంద్రియనిగ్రహం వలన ఏర్పడే తాకిడిని భరించగలరు. మీ ఆరోగ్యం, శరీరం దృఢత్వం గూర్చి భావన చేయాలి. శరీరమే కదా మనకున్న పరికరం. శరీరం వజ్రంలా దృఢంగా ఉన్నట్లు, శరీరంతోనే భవసాగరాన్ని దాటివేస్తామని భావించుకోవాలి. ‘నువ్వు దృధంగా ఉన్నా’వని శరీరానికి చెప్పండి. ‘నువ్వు బలమైనదాన’వని మనస్సును ప్రేరేపించండి. అనంత ధైర్యాన్ని అపార విశ్వాసాన్ని కలిగి ఉండండి అంటారు స్వామీజీ.

ఇక బుద్ధి బలాన్ని సాంకేతిక, విజ్ఞాన, ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రగతిని సాధించడానికి ఉపయోగించాలి. దీనితో పాటు జీవితాశయ సాధనలో ఆ బుద్ధిబలాన్ని ఉపయోగించకపోతే దాన్ని సక్రమ పద్ధతిలో ఉపయోగించనటల్ల. ఉన్నత లక్ష్య సాధనకై తీసుకున్న దృథనిర్ణయాలు పిల్లగాలుల్లాంటి అవరోధాలకు వీగిపోకూడదు. రైట్‌ సోదరులు విమానం కనిపెట్ట డానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘గాలిలో ఎగిరే గాలి కంటె తేలికైన వస్తువును కనిపెట్టడం సాధ్యమా?’ అంటూ ప్రచురించింది. కానీ ఆ వార్త రైట్‌సోదరుల నిశ్చయాత్మక బుద్ధిని ఏ మాత్రం చలించనివ్వలేదు. ఇలాంటి మేలు కలిగించే దృధసంకల్పాలు ప్రయోజనకారులు కాగలవు. తీసుకున్న దృధనిర్ణయాలకు కట్టుబడి ఉండాలంటే బుద్ధిబలం అత్యవసరం.

బుద్ధి, మనస్సుకు సంబంధించిన ఉపకరణమే (faculty). అందుచేత దాన్ని చక్కబరిచే ప్రయత్నం అత్యవసరం. యోగవాసిష్టం ఈ విధంగా చెబుతుంది: ‘అంతా మనస్సులోనే ఉంది. దాన్ని చక్కబెడితే దృశ్యప్రపంచమంతా చక్కబడుతుంది’. అలాంటి మనస్సుకు అహర్నిశం ఇచ్చే ఆహారంలో జాగ్రత్త వహించాలి. ఇంద్రియ విషయక సంబంధమైన ప్రసార మాధ్యమాలు, అళ్లీల అంతర్జాలం లాంటి ఏ మాత్రం పసలేని భావజాలానికి దూరంగా ఉండాలి. ఇవి వ్యక్తిని మానసికంగా బలహీనపరిచి ఆదర్శం నుంచి దిగజారు స్తాయి. అయితే మనస్సుకున్న అపరిమిత శక్తుల నామర్ధ్యం నిర్వీర్యం కాకుండా దానిని నీయంటత్రించడం నేర్చుకోవాలి. అందుచేత స్వామీజీ ‘మిమ్మల్ని శారీరకంగా గానీ, మానసికంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ బలహీనపరిచే దేనినైనా విషంలా విడిచి పెట్టండి‘ అంటారు. మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే మన సంకల్పశక్తి దృథధంగా ఉంటుంది. ‘సంకల్పశక్తిని తుచ్చమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగించాలి’ అంటారు స్వామి వివేకానంద.

ఈనాడు శారీరకంగా దృఢంగా ఉంటున్నప్పటికీ చిన్న చిన్న ఆందోళనలకు గురై జీవితం బుగ్గిపాలు చేసుకొనే యువత శాతం రోజురోజుకీ పెరుగు తుందంటే కారణం మానసిక బలం లోపమే అని చెప్పాలి. మానసిక బలాన్ని బుద్ధి బలాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. స్ఫూర్తిని నింపే పుస్తకాలు చదవాలి. మనస్సులో ఉన్నతమైన ఆలోచనలను చేయాలి. ఉన్నతమైన విషయాలు చెప్పే వారి సాంగత్యం చేయాలి.

ఇక మూడవది ఆత్మబలం. జీవితంలో ఎదురయ్యే విషమపరిస్థితులకు ఎదురొ్ద నిలబడే ధైర్యం కేవలం ఆత్మబలం మాత్రమే ప్రసాదిస్తుంది. గంగను భూమి మీదకు తీసుకు రావడానికి మూడు తరాలు పట్టింది. అనుమ్మాన్‌రాజు కఠోర తపస్పాధనలు, ఆయన కుమారుడు దిలీపుడి తీవ తపస్సు కూడా గంగను తీసుకురాలేకపోయాయి. చివరిగా భగీరథుడు తన ఆత్మబలం (ఆధ్యాత్మికబలం)తో పాటు భగవంతుని కృప వల్ల గంగను భూమ్మీదకు తీసుకురాగలిగాడు. నూనె లేకపోతే దీపం వెలుగదు. అదేవిధంగా భగవంతుడు లేకపోతే మానవుడు లేడు అంటారు శ్రీరామకృష్ణులు; అగ్ని లేకపోతే క్రొవ్యొత్తిని వెలిగించలేము. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితం లేకపోతే మనిషి జీవించలేడు అంటాడు బుద్దుడు. ఆధ్యాత్మికత అంటే అడవులకు వెళ్ళి తపస్సు చేయనక్కర్లేదు. ఉన్నతంగా జీవించడానికీ, మన మానసిక స్థాయిని అంచనా వేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధనామయ జీవితం ఎంతగానో సహకరిస్తుంది. ఏకాగ్రతను ఇస్తుంది. ప్రతీ వ్యక్తి ఆత్మబలాన్ని సంపాదించడానికి జపం, ధ్యానం, ప్రార్ధనలకై కనీస సమయాన్ని వెచ్చించాలి. ఇవి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని తట్టి లేపుతాయి.

బాహుబలం, బుద్ధిబలం, ఆత్మబలంతో మనిషి పరిపూర్ణతను సంతరించుకొంటాడు. ఈనాటి యువతరం శారీరక,  మానసిక, ఆత్మబలంతో కూడిన వ్యక్తిత్వం పొందే దిశగా అలవాట్లను అలవరచుకుంటే జీవితంలో పరిపూర్ణతను సాధిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ మూడు బలాల పట్ల శ్రద్ధ వహిస్తే పరిపూర్ణతకు పరమౌషధాలు మన చెంతన ఉన్నట్లె!