స్వామి వివేకానంద పాశ్చాత్య శాలలోనూ, భారతదేశం లోనూ అవలంబించిన విధానాలను గమనిస్తే, ఆయనకు రెండు రకాల కార్యాచరణ ప్రణాళికలు ఉన్నాయా? అని అనిపిస్తుంది. అలాగే, ప్రాంతీయంగా పనితీరు అమలులోను భేదం కనిపిస్తుంది కానీ రెంటిలో అంతర్లినమైన ధ్యేయం మాత్రం ఒక్కటే! అది ప్రతి మనిషిలో నిద్రాణమైవున్న ఆధ్యాత్మికతను మేల్కొల్పడమే!! దీనిలో ధనిక, బీద అన్న తేడా లేదు, లింగ ఖేదం లేదు. ఏ వర్గానికి చెందినవారికైనా, ఎ ప్రాంతాలకు చెందినవారికైనా – ఒక్కటే దివ్యసందేశం. గురువైన శ్రీరామకృష్ణులు సకల ప్రాణులలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించిన తీరుపై వివేకానందునికి గల స్పష్టమైన అవగాహనే ఈ మహోన్నత ఆధ్యాత్మిక మేలుకొలుపునకు మూలం.

1897 జనవరిలో పాశ్చాత్యదేశాల నుండి తిరిగి భారత దేశానికి వచ్చిన స్వామీజీ తన ప్రణాళికల అమలుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. ఆయన ఒక పక్క ‘రామకృష్ణ మిషన్‌’ స్థాపనలో తల మునకలై ఉంటూనే, స్వామి అఖండానందని కరువు ప్రాంత పీడితులకు సేవలు అందించడానికి ముర్షీద్రాబాద్‌ పంపారు. స్వామీజీ పాశ్చాత్య దేశాల నుండి రాక పూర్వమే, 1894లో రాజస్థాన్‌లోని దరిద్ర నారాయణుల సేవకు వెళ్ళవలసినదిగా న్వామి. అఖండానందను ఉత్సాహ పరిచారు. ఇవి కేవలం సాంఘిక సంక్షేమ కార్యాలుగా ఆయన భావించలేదు. ఒక కర్తవ్యపరమైన ఆరాధనగా భావించారు. ఒకానొక ఉత్తరంలో స్వామీజీ ఇలా తెలిపారు: “ఈ కాషాయ వస్ర్తాలు భోగాలను అనుభవించడానికి కాదు. ఇవి వీరత్వాన్ని చూపే ధ్వజానికి చిహ్నం. పేదవారు, నిరక్షరాస్యులు, అజ్ఞానులు, బాధితులు… వీరందరినీ నీ దైవంగా భావించు. వీరికి సేవ చేయడంలోనే ఉన్నతమైన మతం దాగి ఉందని గ్రహించు”.

భారతదేశంలో ఏ సేవ చేయడానికైనా మతం ముందుగా నిలుస్తుందని స్వామీజీ గ్రహించారు. పైపైన సంస్కరణల వల్ల ప్రయోజనం లేదనీ, కూకటివేళ్ళ నుండి కదలిక రావాలన్నా, దీనజనోద్ధరణ చేయాలన్నా మతమే పునాది అని భావించారు. కాషాయం ధరించిన సన్వ్యాసులు జప, తపాలే కాక, సంస్కరణల నిమిత్తం నడుం బిగించి జనం మధ్యకు వస్తే, అది జనావళిలో సామాజిక విప్రవం తేగలదనీ, సామాన్యులలో సైతం చైతన్యం వస్తుందనీ భావించారు. ‘జీవునిలో దేవుని’ చూడగలిగిన తన గురుదేవులైన శ్రీరామకృష్ణుల విధానాన్ని ప్రజల్లోకి ఒక ఆధ్యాత్మిక సాధనగా తీసుకువెళ్ళాలని స్వామీజీ తహతహలాడారు. అది కేవలం త్రికరణశుద్ధిగా ప్రయత్నించినప్పుడే సాధ్యమవుతుందనీ, సాధకులను ఆ విషయం అర్ధం అయ్యే న్థాయికి తీసుకువెళ్ళాలనీ ఆకాంక్షించారు. ఈ రకమైన సామాజిక స్పృహతో కూడిన సాధన అవసరమని స్వామీజీ భావించారు.

స్వామీజీ అనుయాయులందరూ ఆయన ఆశయం కోసం ఎలాంటి కష్టతరమైన, కఠిన కార్యమైనా వెనుదీయక పూర్తి చెసే వారు. ఈ క్రింద తెలిపిన ఉదాహరణలు అందుకు మచ్చుతునకలు.

వారణాసిలో, 1900 సంవత్సరంలో స్వామీజీ సందేశానికి ప్రభావితులైన కొంతమంది ఉత్సాహవంతులైన యువకులు, ఒక బృందంగా ఏర్పడి, స్వామీజీ ఆశయాలను గురించి చర్చించే వారు. అందులో ఒకరైన చారుచంద్ర దాస్‌ (కాలాంతరంలో స్వామి శుభానంద) బెంగాలీ మాసపత్రిక ‘ఉద్పోధన్‌’లో స్వామీజీ వ్రాసిన ‘ఒక స్నేహితుని కొరకు’ అనే కవిత చదివి, అందులో ఉన్న క్రింది వాక్యాలను చూసి కదిలిపోయాడు.

“ఈ విశ్వమందున్న అతి పెద్ద బ్రాణి నుండి,
అదిగో ఆ కనబదే కీటకం వరక్క,
మనకు కనివించని నూక్ష్యమైన అణు వర్యంతం,
ఆ ప్రేమమయుడు, భగవంతుడు సర్వత్రా వ్వావించి ఉన్నాడు.
ఓ న్నేపొతుడా! నీ దేహము, మనను, ఆత్మ
వాటి వాదాల చెంత సమర్చించి,
నీ ముందే. వివిధ
రూపొలలో ఉన్న ఆయన
సర్వజ్ఞతను గుర్తించు.

(మే 1న ‘రామకృష్ణ మిషన్‌’ సంస్థాపన దినోత్సవం)
కనబడే సజీవతను కాదని, వేరెక్సుడో
ఆయన ఉన్నాదనుకోకు.
ఈ భేదభావం లేక ఆయన ఉనికిని నర్వత్రా
గుర్తించిన వాదే ఉత్తమశ్రేణి భక్తుడు”

ఈ పై కవితను చదివిన ఆయన ఉత్తేబితుడై, ఉత్సుకతను ఆపుకోలేక యామి నిరంజన్‌ మజుందార్‌ వద్దకు పరిగెత్తుకెళ్ళి చూపించాడు. ఆ మరునాడే, మజుందార్‌కు ఒక నిస్సహాయ వృద్ధ ప్రీ, దుమ్ముతో నిండి ఉన్న శరీరంతో, మరణానికి  చేరువలో ఉందా అన్నట్లు కనిపించగా, ఆయన వెంటనే స్వామీజీ కవితా వాక్యాలు ఒక్కసారి మననం చేసుకుని, ఆ వృద్ధ స్త్రీని చేరదీసి, భోజనం పెట్టించి, స్నేహితుల సహాయంతో వైద్య సదుపాయం కల్పించాడు.

ఈ సంఘటన అనంతరం మజుందార్‌, చారుచంద్ర, కేదార్‌ నాథ్‌ (స్వామి అచలానందు), ఇంకా కొద్దిమంది మిత్రులు కలిసి ఒక ఉద్యమంలా, కాశీ పురవీధుల్లో నిస్సహాయస్థితిలో ఉన్నవారిని వెదకి మరీ పట్టుకుని, వారికి తగిన సహాయం చేయసాగారు. కొద్ది కాలంలోనే వారి ఆచరణలకు రూపం కల్పించి, “పేదల సహాయక సమాజం” అన్న పేరున ఒక సంస్థను పేదల కోసం సాపించారు. అందులో రోగుల వసతులతో ఉంచి, కర్తవ్యోన్మ్నుఖు లయ్యారు.

చారుచంద్ర, అతని స్నేహితులు తమ హృదయాన్నీ, ఆత్మనూ ఈ కార్యంలో సంపూర్ణంగా ఉంచడం వల్లనే, ఇది అంతా సాధ్యపడింది. స్వామీజీ ఫిబ్రవరి 1902లో  వారణాసి వచ్చినప్పుడు, వీరి సేవా కార్యక్రమాలు చూసి చాలా ఆనందపడ్డారు. వీరందరికీ ఉపదేశం చేసి, వీరి సంస్థకు తగిన నిధులు సమకూర్చాల్సిందిగా అధికారులకు వినరిపత్రం సమర్పించారు. శ్రీరామకృష్ణులు తనకు చెప్పిన సందేశాన్ని వీరికి ఇలా తెలిపారు:

“సేవతో మిళితమైన ఆధ్యాత్మిక సాధన, సర్వజీవ హృదయాంతరవాసి అయిన ఆ భగవంతుని గుర్తించడంలో ఎంతగానో తోద్పడుతుంది. సేవ చేసే సమయంలో కనికరం ఉండాలి. వారి మీద తాము ఎంతో అధికులమనే అహంభావం కానీ, ఆ అహం వల్ల కలిగిన జాలి కానీ చూపరాదు. ఈ విశ్వంలో జాలి పడేందుకు దేవనికి మాత్రమే హక్కు ఉంది. ఎందుకంటే, జీవుల సాధక బాధలు తొలగించగలవాడు ఆయనొక్కడే కనుక. మీ లక్ష్యం సేవ మాత్రమే కావాలి. మీరు చేసే పనిలో భగవంతుజ్ణి గుర్తిస్తూ చేయండి. ఈ సేవకి రంగులు పులమకుండా జాగరూకతతో చేయాలి. మీ సంస్థకు ‘సేవాశ్రమం’ అనే పేరు పెట్టండి”.

ఆ విధంగానే చారుచంద్ర, అతని స్నేహితులు ముందుగా ‘రామకృష్ణ సేవాశ్రమం’ అని, కాలాంతరంలో ‘రామకృష్ణ మిషన్‌ సేవాశ్రమం’ అనే పేరునూ స్థిరపరిచారు. స్వామి అచలానందగా మారిన కేదార్‌నాథ్‌, తన వృద్ధాప్యంలో అక్కదే ఉంటూ, ఆనాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, యువసన్న్యాసులను ఉత్తేజపరిచేవారు.

సేవాశమంలో సేవలందిస్తున్న ఒక సన్వ్యాసి ఈ క్రింది సంఘటనను తెలియజేశారు. ‘నేను కొత్తగా చేరిన ఓ యువ సన్వ్యాసిని తీసుకుని, కేదార్‌ బాబాను చూడడానికి వెళ్ళాను. మమ్మల్ని చూడగానే ఆయన, ‘ఈ రోజు ఎంత మంది నారాయణులు వచ్చారు? వారికి మీరు ఎలా సేవలను అందించారు? అని అడిగారు. నేను చేతులు జోడించి, ‘మహరాజ! నలుగురు నారాయణులు ఈ రోజున వచ్చారు’.