కార్యసాఫల్యానికి ముఖ్యంగా కావలసిన లక్షణాలు – దీక్ష మనోనిగ్రహం, ధైర్యం, త్యాగం, బుద్ధికుశలత, వినయం. ఈ సుగుణాలన్నీ సంపూర్ణంగా ఉన్న వ్యక్తే నిజమైన ఆదర్శవంతుడు.

మరి అలాంటి ఆదర్శవంతుడు ఎవరు? భారత యువతరం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు స్వామి వివేకానంద ఇచ్చిన సమాధానం ఇది: “ఇప్పుడు మీరు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోండి. శ్రీరామ కార్యార్ధం తన ప్రాణాలను సైతం త్యజించడానికి వెనుకాదని ధైర్యశాలి; న్వామి కార్యమే తప్ప అన్యమైన తలంపు లేని ఏక నిష్టాగరిష్టుడు; బాహ్యాకర్షణలకు చలించని మనోని[గ్రహ సంపన్నుడు; అవరోధాలను సమయస్ఫూర్తితో అధిగమించే ధీశాలి; కార్యసాధన కోసం స్వీయసుఖాలను త్యజించిన త్యాగశీలి; ఆత్మస్తుతి పట్ల విముఖత చూపిన వినయశీలి. ఇలాంటి అత్యుత్తమ సుగుణ సంపన్నుడైన హనుమంతుడే ఇవాళ మనకు ఆదర్శప్రాయుడు”.

‘ఆంజనేయుడే భారతీయ యువతరానికి ఆదర్శప్రాయుడు’ అన్న స్వామి వివేకానందలో కూడా ఆంజనేయుని వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా మనం దర్శించవచ్చు.

దైవకార్యంలో ధీర పురుషులు: రామకార్య నిర్వహణలో ఆంజనేయస్వామి, రామకృష్ణ కార్యనిర్వహణలో వివేకానంద స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే తమ కార్యసాధనకు శ్రీరాముడు, హనుమంతుణ్ణీ; శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్త్సీ మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? వారిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

సీత్రాన్వ్నేషణ చేస్తూ శ్రీరాముడు, లక్ష్మణ సమేతంగా వెళుతుండగా కిష్కింధలో మారువేషంలో ఎదురుగా వచ్చిన హనుమంతునితో మొదటి సమావెశం జరిగింది. అతడితో కొద్ది సేపు సంభాషణ జరపగానే శ్రీరాముడు, లక్ష్మణునితో ‘సోదరా! ఇతడు నవ వ్యాకరణాలనూ చదివిన జ్ఞాన సంపన్నుడు. సాక్షాత్తూ సరస్వతీ స్వరూపుడు. ఇతడు సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్ధుడు’ అని హనుమంతునిలోని విశిష్ట లక్షణాన్ని తెలియజేశాడు.

దక్షిణీశ్వరంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో సంభాషిస్తుందగా నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. అదే శ్రీరామకృష్ణ, నరేంద్రుల ప్రథమ సమాగమం. నరేంద్రుణ్ణి చూడగానే అతణ్ణి ఒక పాట పాడమన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడి మధుర గానాన్ని ఆస్వాదించిన శ్రీరామకృష్ణులు అతని వైపు తదేకంగా చూస్తూ ‘ఇతడు ధ్యానసిద్దుడు, భోగాసక్తి లేని పరిశుద్దుడు, ఇతనిపై సరస్వతీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది’ అని అన్నారు.

హనుమంతుడు తన శక్తియుక్తులతో సీతాన్వేషణ కార్యాన్ని సాధించగలదని శ్రీరాముడు; నరేంద్రుడు తన ధీశక్తితో భారత జూతిని మేల్కొల్పగల సమర్భుదని శ్రీరామకృష్ణులు వారి ప్రథమ సమావేశంలోనే గ్రహించారు. అందువల్లనే దైవకార్యంలో ఈ ధీరపురుషులు ప్రధాన పాత్రను పోషించి ధన్యచరితులయ్యారు.

విరామమెరుగని విశేష కృషి: ఆంజనేయుడు సీతాన్వేషణకై సముద్రాన్ని లంఘించి, ముందుకు సాగిపోతున్నప్పుడు మైనాకుడు (స్వర్ద్వమయ పర్వతం) సముద్రం నుంచి వైకి వచ్చి హనుమంతుణ్ణి తన ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆపైన మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించాల్సిందంటూ కోరాడు. కానీ హనుమంతుడు ‘నేను విశ్రమించడానికి ఇది సమయం కాదు. శ్రీరామకార్యం నెరవేర్చడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మైనాకుని ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగిపోయాడు.

చికాగో సర్వమత మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగానికి ప్రభావితులైన కోటీశ్వరులు చాలామంది ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడ్డారు. అలాంటి వారిలో ఒక కోటీశ్వరుని కుమార్తె, స్వామీజీ దగ్గరకు వచ్చి ‘స్వామీజీ! నాకున్న సకల సిరిసంపదలనూ మీకు అర్పించుకుంటాను. మీరు నాతోపాటే ఉండిపోండి. దయచేసి నా ప్రతిపాదనను అంగీకరించండి’ అని ప్రాధేయపడింది. కానీ స్వామీజీ తన స్వీయ సుఖభోగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. భారతజాతి దుఃఖ నివారణే తన ధ్యేయమని మరచిపోలేదు.

సుఖమయ జీవితం గదపదానికి అనుకూల పరిస్థితులు ఆహ్వానించినప్పటికీ తమ కర్తవ్య నిర్వహణకే అంకితమైన కార్యదీక్షాపరులు – హనుమంతుడు, వివేకానందుడు.

అవరోధాలకు అందని అతీతశక్తి: మైనాకుని ఆతిథ్యాన్ని హనుమంతుడు తిరస్కరించి కర్తవ్యసాధనలో ముందుకు సాగిపోతుండగా భారీకాయుడైన హనుమంతుణ్ణి సురస చూసింది. ‘ఈ రోజు నాకు పుష్టిగా భోజనం చేసే అదృష్టం దక్కింది’ అనుకుంటూ అతీకో మింగడానికి పెద్దగా నోరు తెరిచింది. హనుమంతుడు తన బుద్ధికుశలతను ప్రదర్శించి సూక్ష్మ రూపధారి అయ్యాడు. సురస కోరల నుండి తప్పించుకుని ప్రచండ వేగంతో ముందుకు సాగిపోయాడు.

సర్వమత మహాసభల్లో స్వామీజీ ప్రసంగం పూర్తయిన వెంటనే వందలాది యువతులు కరచాలనం చేయడానికి స్వామీజీని చుట్టుముట్టారు. ఇదంతా గమనిస్తున్న మిసెస్‌ బ్లాజెట్‌ తనలో తాను ‘ఓ కుమారా! ఈ ప్రీల దాడి (ఆకర్షణల) నుండి తప్పించుకోగలిగితే నువ్వు నిజంగా భగవంతుడవే’ అని అనుకుంది. స్వామీజీ అసాధారణ మనోనిగ్రహశక్తికి అబ్బురపడిన ఆమె కాలాంతరంలో ‘స్వామీజీ ఈ భువిపై వెలసిన దైవం’ అని జోసఫిన్‌ మెక్షౌడ్‌తో తన స్మృతులను పంచుకుంది.

హనుమంతుడు తన ధీశక్తితో సురస కోరల నుండి తప్పించు కుంటే, స్వామీజీ తన మనోనిగ్రహశక్తితో మోహ వలయాన్ని ఛేదించారు. అలా ఇద్దరూ తమ కార్యనిర్వహణలో ముందుకు సాగిన అతీంద్రియశక్తి సంపన్నులు.

అభయం ధీరుల ఆయుధం: మైనాకుడు, సురసల బారి నుంది తప్పించుకుని హనుమంతుడు ఆకాశమార్షాన ముందుకు సాగిపోతుంటే మరో అడ్డంకి వచ్చింది. సింహిక అనే రాక్షసి హనుమంతుడి నీదను పట్టుకుని క్రిందకు లాగి, హతమార్చ దానికి ప్రయత్నించింది. అప్పుడు హనుమంతుడు, తన బాహుబలాన్ని ప్రయోగించి సీంహికను సంహరించాడు. అభివృద్ధి పథంలో సాగేవారిని అధఃపాతాళానికి తొక్కేయాలనే అసూయా రాక్షసే సింహిక.

స్వామీజీ కీర్తిప్రతిష్టలకు అసూయ చెందిన కైస్తవమత ప్రచారకులు స్వామీజీ మీద ఎన్నో అపనిందలు మోపారు. హిందూమతం గురించి దుష్ప్రచారం చేశారు. అసూయాగ్నిత్రో రగిలిపోతున్న క్రైస్తవ మత ప్రచారకుల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, “మీరు నిజమైన కైస్తవులు కారు. మీరు నిజంగా జీవించి ఉండాలంటే ఏసుక్రీస్తును ఆశ్రయించండి. క్రీస్తు లేని రాజవాసం కన్నా క్రీస్తుతో కలసి పూరిగుడిసెలో జీవించడం మిన్న ఇతర మతాలను అగౌరవపరిచినవారి మతం వినాశనమవక తప్పదు” అని స్వామీజీ క్రైస్తవ మత సభలోనే ధైర్యంగా గర్జించారు. స్వామీజీ ధైర్యసాహసాలతో కూడిన తీవ్రప్రతిఘటనకు భయపడిన మత ప్రచారకులు అప్పటి నుండి స్వామీజీనీ, హిందూమతాన్నీ విమర్శించడం మానుకున్నారు.

కార్యనిర్వహణలో తన పురోగమనానికి అద్దు వచ్చిన సింహికను హనుమంతుడు, తన అభివృద్ధిని చూసి అసూయ చెందిన క్రైస్తవ మత ప్రచారకులును స్వామీజీ ధైర్యంగా ప్రతిఘటించిన తీరు వారి అద్భుత సాహసానికి నిదర్శనం.

వినయం విజయ భూషణం: హనుమంతుడు లంకా ప్రవేశం చేసినప్పుడు మొదట విభీషణుణ్ణి చూడడానికి వెళ్ళాడు. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుణ్ణి చూడగానే విభీషణుడు ‘నీవెవరు? నీ పేరేమిటి?’ అని ప్రశ్నించాడు. అందుకు హనుమంతుడు ‘ఈ అల్పజీవి గురించి తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? రామనామాన్ని స్మరించడం వల్ల అనంత ప్రయోజనం చేకూరుతుంది’ అని ఆత్మస్తుతికి ప్రాధాన్యమివ్వ కుండా శ్రీరాముని మాహాత్యాాన్ని చాటాడు.

స్వామీజీ విషయానికొస్తే, ఆయన ప్రాచ్య పాశ్చాత్యాలలో సనాతనధర్మ ప్రచారం చేసి, ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. కానీ ఆయన ఎన్నడూ ఆత్మస్తుతి చేసుకోలేదు. పైగా తన విజయాలకు కారణం గురుదేవులైన శ్రీరామకృష్ణులే అని కీర్తిస్తూ, “నేను ఏమైనా సాధించి ఉంటే, ప్రపంచానికి ఉపయోగకరమైన ఒక్క మాటైనా నా నోటి నుండి వెలువడి ఉంటే అదంతా నాది కాదు, గురుదేవులదే. కానీ నా నోటి నుండి శాపాలు వెలువడితే, నా హృదయం నుండి ద్వేషం పార్పితే అదంతా నాదే కానీ గురుదేవులది కాదు. శ్రీరామకృష్ణులు తలచుకుంటే తమ పాద ధూళి నుండి నా లాంటి వివేకానందుల్ని వెయ్యి మందిని సృష్టించగలరు” అని గురుదేవుల పట్ల తన వినమతను ప్రకటించిన వినయశీలి వివేకానంద.

ఆంజనేయ స్వామి, వివేకానంద స్వామి తమ కార్య నిర్వహణలో అత్యంత ప్రతిభను ప్రదర్శించారు. కానీ కార్యసాఫల్యానికి కారణం తమ ఆరాధ్య దైవమే అని వినమంగా చాటారు. కార్య నిర్వహణలో శక్తియుక్తుల్నీ ధైర్యసాహసాల్నీ, వినయవిధేయతల్నీ ప్రదర్శించిన రామదూత హనుమాన్‌, రామకృష్ణదాస న్వామి వివేకానందలను ఆదర్శంగా తీసుకొందాం. ఈ అల్లకల్లోల ప్రపంచ సాగరాన్ని దాటి, విజయ తీరాన్ని చేరడానికి ప్రయత్నిద్దాం.