మాసాంతం వచ్చేసింది. వినీత్‌, వికాస్‌లు మళ్ళీ కలుసుకున్నారు. చిన్ననాడు పాఠశాలలో ఉన్నప్పుడు తమకు వివేకానందుడి రచనలను పరిచయం చేసిన ఉపాధ్యాయుడిని కలుసుకున్నారు.

వినీత్‌: నమస్కారం మాష్టారూ! మీరు స్కూలులో మాకు వివేకానందుడి బోధనల గురించి విశదీకరిస్తుండేవారు. మీరు ఆనాడు ఇచ్చిన ప్రేరణ వల్ల స్వామీజీ గురించి ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్న ఆసక్తి మాలో పెరిగింది.

మాష్టారు; నాయనా! చాలా సంతోషం. చిన్న వయస్సులో నేను మీకు ఆ మహావ్యక్తిని పరిచయం చేస్తే తరువాత మీరు ఇంకా విపులంగా ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. ఆ ఆశతోనే నేను వివేకానందుడి గురించి ఎక్కువగా చెబుతుందడేవాడిని. కనీసం మీ ఇద్దరూ ఈ జ్ఞానఖని రచనలను చదవడానికి పూనుకోవడం ముదావహం.

వినీత్‌: బహుపార్వ్వాలున్న స్వామీజీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలనుకోవడం సాహసమేమో అనిపిస్తుంది మాష్టారు!

మాషహ్హారు: స్వామీజీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్ధంచేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రచనలను చదివి, అర్ధమైన వాటిని ఆచరణలో పెట్టడమే మనం చేయవలసింది. కాబట్టి మీరిరువురూ మనస్సును ఆ ఉన్నత భావాలతో పరిపుష్టం చేసుకుంటూ, మీకు చేతనైనంత కార్యరూపంలో పెట్టండి. అదే మీరు ఆ మహామనీషికి అర్పించే మహోన్నతమైన నివాళి.

వికాస్‌: ‘ప్రపంచంలో ఉన్న బాధలను చూసిన తరువాత స్వామీజీ హృదయం అగ్ని పర్వతంలా బద్దలైంది. ఆ హృదయాగ్ని పర్వతం నుండి వెల్లువలా ప్రవహించినదే ఆయన భావ లావా ప్రవాహం’ – స్వామీజీని చదివిన తర్వాత మాకు కలిగిన భావన ఇది మావారు!

మాష్టారు: ఆ! చక్కగా అర్ధంచేసుకున్నావు వికాస్‌. సిస్మోగ్రాఫ్‌ ఏ విధంగా భూకంపాల తీవ్రతను కొలుస్తుందో, అలా మానవాళి దుఃఖఫప్రకంపన తీవ్రతను కొలిచిన సిస్మోగ్రాఫ్‌ స్వామీజీ హృదయం. అంత చక్కగా కొలవగలిగింది కాబల్టీ సుడిగాలిలా పనిచేసి 39 ఏళ్ళకే శరీరాన్ని అవతల పారేశారు.

వినీత్‌: అందుకేనేమో మహాపురుషులందరూ అంత తక్కువ కాలం జీవిస్తారు. మహాపురుషుల హృదయ కవాటాలు అతి సున్నితంగా ఉంటాయి. మనిషి దుఃఖ తీవ్రతకు విపరీతంగా స్పందించే ఆ హృదయ కవాటాలకు తేలికగా చిల్లులు పడతాయి. రక్తాన్ని స్రవించి, స్రవించి ఆ హృదయం తొందరగా ఆగిపోతుంది. కానీ వారు భౌతిక శరీరాన్ని త్యజించినా, వారి భావాలు ప్రభాత సూర్యకాంతిలా వ్యాపించి మానవాళి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాయి. స్వామీజీ ఒకసారి సోదరి నివేదితతో ‘నీకు తెలియదా గొప్పవాళ్ళ హృదయాలు ఎంత సున్నితంగా ఉంటాయో?’ అని అంటారు.

వికాస్‌: వివేకానందుడు ఎందుకు అంత పిన్నవయస్సులోనే దేహాన్ని చాలించారన్నది చాలామందికి ఉన్న సందేహం. ఈ మధ్య వివేకానందుడి మరణం గురించి మన పత్రికలలో కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. ‘బలమే జీవనం. బలహీనతే మరణమ’ని బోధించిన వ్యక్తి యుక్తవయస్సులో అనారోగ్యానికి గురై మరణించాడని వ్రాస్తున్నారు. మరికొందరు అంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకా కొద్దికాలం జీవించివుంటే మరింత లోకకల్యాణం జరిగేది అని భావిస్తున్నారు.

వినీత్‌: చాలామంది ఈ మధ్య వివేకానందను కొంచెం అధ్యయనం చేసి, ఆయన వారికి పూర్తిగా అర్ధ్థమయివోయినట్లు దాస్తున్నారు. మనం ఇలాంటి మహాపురుషులను మన అల్ప మధతో పరిశీలించి పూర్తిగా అర్లం చేసేసుకున్నాం అనుకుంటే అది పొరపాటు. ఈ విషయంలో మనం కొంచెం వినమంగా ఉండాలి. ఇక వివేకానంద మరణం గురించి రకరకాల అపోహలు ఇప్పుడు ప్రజల్లో ఉన్నాయి. చివరి రోజులను ఆయన ఎలా గడిపారు? దేహత్యాగం చేసిన ఆ రోజు ఆయన దినచర్య ఎలా ఉన్నది.. అన్ని విషయాలూ రామకృష్ణ మిషన్‌ ప్రచురించిన వివేకానంద జీవిత చరిత్రలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అపోహలకు కారణం – సంచలనాలను సృష్టించి తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్న ఆధునిక ప్రసారమాధ్యమాలే అని గ్రహించాలి.

‘నరేన్‌కు (వివేకానంద) తానెవరో (పూర్వజన్మలో) తెలిసిన మరుక్షణమే ఈ ప్రపంచం నుంచి నిషమిన్తాడు’ అని శ్రీరామకృష్ణ పరమహంస ముందుగానే చెప్పారు. కదా! ఆయనకు గత జీవిత స్మృతికి విస్మృతిని కలిగించమంటూ జగన్నాతను ప్రార్ధించారు. ఒకసారి అద్వైతానుభూతిని రుచి. చూపించి, జగన్మాత కార్యం అయ్యేవరకు ఆ అనుభూతికి తాళం వేసి, పని ముగిసిన వెంటనే తాళం తెరవబడుతుంది అని ముందే ఆ గురుదేవులు తన శిష్యుడికి చెప్పారు. నరేంద్రుని శ్వాస వేగంగా ఉండడం చూసి ‘నరేన్‌ ఎక్కువ కాలం జీవించడు’ అని కూడా చెప్పారు. అంతేకాదు ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవ  మొనర్చుకున్న వివేకానంద లాంటి మహాపురుషులకు దేహం ఒక మహాీబంధంగా పరిణమిస్తుంది. కాబట్టి మనం ఇలాంటి కారణజన్ముల జీవనరహస్యాన్ని మన బుద్ధితో తెలుసుకోవాలనుకోవదడం సాహసమే అవుతుంది.

వికాస్: అవును. ఆయన నిత్యసిద్ధుడని రామకృష్ణులు పేర్కొన్నారు. అలాంటి నిత్య సిద్ధులకు మరణమెక్కడిది! ఎన్ని రోజులు దేహాన్ని ధరించాలన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు. మహాభారతంలో భీష్మ పితామహుడు ఇచ్చా మృత్యువును స్వీకరించాడని చదివావు కదా! కాళ్ళీర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర తరువాత స్వామీజీ పూర్తిగా అంతర్ముఖుడై, శివుడు తనకు ఇచ్చామృత్యువును ప్రసాదించాడని చెపుతారు. అలానే ‘నేను నలభయ్యో పడిలో పదను’ అని చాలామంది శిష్యులతో చెప్పారు. ‘నేను సామాను సర్దుకుంటున్నాను. ప్రపంచం నుంచి నిష్టమించే సమయం ఆసన్నమైంది’ అని తీవ్రమైన కార్యం మధ్యలో ఉన్నప్పుడే పలుకుతారు. ఇక ఎక్కువ రోజులు తాను ఉండబోవడం లేదని స్వామీజీకి తెలుసు కాబట్టి విశ్రాంతికి సమయం ఇవ్వలేదు.

ఐనా ఇవన్నీ పారమార్థిక జీవితానికి సంబంధించిన విషయాలు. రాత్రీ పగలు ప్రాపంచిక విషయాలలో మునిగి, మనస్సును ఒక బురద గుంట చేసుకున్న అల్పజ్జులకు ఇవన్నీ వట్టి నమ్మకాలుగా కనబదతాయి.

శరీరత్యాగానికి ఒకరోజు ముందు తన శిష్యురాలు సోదరి నివేదిత భోజనం చేసిన తర్వాత ఆమెకు చేయి. కడుగు కోవడానికి స్వామీజీ నీళ్ళందించారు. ‘గురువు తనకు సేవచేయడ మేమిటి? తాను గురువుకు సేవ చేసుకోవాలి కాని’ అని ఆమె అన్నప్పుడు ‘జీసస్‌ తన శిష్యుల పాదాలు కడిగారు’ అని బదులిచ్చారు. స్వామీజీ. “అది జీసస్‌ తుదిరోజు..” అంటూ మనసులో అనుకొంది నివేదిత. కానీ ఆ తదుపరి రోజీ స్వామీజీకి కడపటి రోజు కాబోతున్నదని గ్రహించుకోలేకపోయింది. క్యాలెండర్‌ తెప్పించుకొని దేహత్యాగానికి తేదీని నిర్ణయించుకున్నారు స్వామీజీ. జీవనమరణాల్లోనూ అసమాన్య ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేరునగధీరుడు స్వామీజీ.

వినీత్‌: అవును మరి! అంత యుక్తవయస్సులో దేహాన్ని త్యజించడం ధీరులకూ, కారణజన్ములకూ మాత్రమే నాధ్యపడు తుంది. నిజంగా స్వామీజీది సాహసోపేత మరణం. వివేకానంద జన్మంచి 150 సంవత్సరాలు అయింది. కానీ మనం ఇంకొక వివేకానందను తయారు చేయలేకపోయాం. ఆయన రచనలను చదివి స్ఫూర్తి పొందినవారు ఆయన లాగా ఎందుకు లోకాన్ని ప్రభావితం చేయలేకపోతున్నారని కొంతమంది ఆవేదన. మన మధ్యలో వివేకానంద ఉంటే మన మనస్సులకు పట్టిన మకిలిని కడిగివేసేవాడు. ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కొందరి భావన. ఈ ప్రశ్నకు నీ ప్రత్యుత్తరం ఏమిటి మిత్రమా?

వికాస్: వివేకానందను తయారు చేయడమా? అలాంటి దైవాంశ సంభూతులు కాలావసరాలకు అనుగుణంగా భూమిపై అవతరిస్తారు. వారి అవతరణను మనం నిర్దేశించగలమా? ఐనా ఇంకొక వివేకానంద ఎందుకు? ఈ వివేకానందను అర్ధం చేసుకుంటే చాలు. ఆయన 1,500 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని ఇచ్చాను అన్నారు. అంటే ఇంకొక 1,400 సంవత్సరాల వరకు మనకు మరొక వివేకానందుడు రాడు.

లోకాన్ని ప్రభావితం చేయడమంటే ఏమిటి? ఉపన్యాసాలిస్తేనే లోకాన్ని ప్రభావితం చేసినట్లా? జీవితంలో ఆదర్శాలను ఆచరించి చూపాలి. శ్రీరామకృష్ణులకు వివేకానందుడితో పాటు ఇంకా పదిహేనుమంది సన్వ్యాస శిష్యులు ఉందేవారు. వారెవరూ ప్రపంచానికి అంత పరిచయం కాలేదు. ప్రవచనాలు, ప్రసంగాలు ఇవ్వలేదు. కానీ స్వామి బ్రహ్మానంద లాంటి వారు తన కన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత భూమికలను నిర్వహించి ఉన్నారని స్వామీజీ మెచ్చుకొని, తనదంతా పఫ్లాట్‌ఫార్స్‌ వర్క్‌ అంటారు. “మహామనీషు అందరూ మౌనులుగా, ప్రశాంతులుగా, అజ్ఞాతులుగా ఉంటారు. వారు సత్త్వస్వరూపులు. సర్వేశ్వరుడికి అత్యంత సన్నిహితులై ఉండడం వల్ల కార్యనిరతులు కాలేరు, పోరాదలేరు, పాటుపడలేరు, పెనుగులాడలేరు, బోధించలేరు. ఎంత గొప్పవారైనా సదా కార్యశీలురుగా ఉందేవారిలో ఏదో కొద్దిగా అజ్ఞానం ఇంకా నిలిచే ఉంటుంది, మన స్వభావంలో కొంత మాలిన్యం ఉంటేగానీ కర్మ చేయలేం” – జీవితమంతా అవిశ్రాంతంగా పరిశ్రమించి, తన వాగ్గాటితో, మేధతో, ప్రచండ ప్రసంగ పరంపర విన్యాసంతో ప్రపంచ ప్రజానీకాన్ని సమ్మోహితుల్ని చేసిన వివేకానంద వాక్కులివి!

వినీత్‌; వేకువజామున పూవుపై పడి, ఆ పూవు వికసించడానికి దోహదపడే హిమబిందువులా, సదా మన కార్యాన్ని ప్రశాంతంగా, నిర్మలంగా, నిస్సంగ బుద్ధితో చేయదమే స్వామీజీకి మనం సమర్పించగలిగే నిజమైన నివాళి. వివేకానందుడే యువతకు ఇప్పుడు నాయకుడు. ఈ ప్రవక్తను, దార్భనికుడిని, కర్మయోగిని, దేశభక్తుడిని, వేదాంత సింహాన్ని ఆదర్శంగా తీసుకొని జీవనపథంలో ముందుకు పయనించడానికి యువతరం సిద్ధమవుతున్నదంటె మనం మన కామెద్స్‌కు అభినందనలు తెలియజేయాలి.

మాష్టారు: వినీత్‌, వికాస్‌! మానవత్వమే మహా మతంగా బోధించి మహిలో మహిత కీర్తిని గడించుకున్న మహనీయమూర్తి స్వామి వివేకానంద జీవిత-సందేశాలను మీ జీవన నావకు దిక్సూచిగా చేసుకున్నారు. మీ ఇద్దరికీ నా అభినందనలు, ఆశీర్వాదాలు.

వినిత్‌, వికాస్ (ఏకకంఠంతో) : కృతజ్ఞతలు మాష్టారూ! స్వామి వివేకానందను మాకు పరిచయం చేసినందుకు జీవితాంతం మీకు బుణపడి ఉంటాం.