సమాజంపై చికాగో ప్రసంగాల ప్రభావం:

స్వామి వివేకానందుని చికాగో ఉపన్యానాలు సమాజాన్నెంతగా ప్రభావితం చేశాయి? సమాజంలో ఏ కొంత పరిణతి అయినా కలిగిందా? అని ప్రశ్నించుకుంటే మనకు లబించే సమాధానాలు ఇవి;

  1. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతిపై అంత వరకూ ఉన్న అనాదరణ, అపోహలు తొలగి పోయాయి. సొటి దేశాలలో భారతదేశానికి విశిష్ట స్థానం కలిగింది.
  2. భారతదేశం ఆధ్యాత్మికంగా ఇంతటి సుసంపన్న దేశమా? అని పాశ్చాత్యులంతా నివ్వెరపోయారు.
  3. భారతదేశం తనకు తాను విధించుకున్న అద్దుగోడలను అధిగమించి, ఒంటరితనాన్ని విడిచి ప్రపంచ దేశాలకు తన ఉనికిని చాటుకోవడానికి ఈ సభలు దోహదం చేశాయి.
  4. అంతవరకూ అంతః కలవాలతో సతమతమవుతున్న హిందూ మతానికి ఒక సమగ్రస్వరూపాన్ని ప్రసాదించాయి.
  5. మతమనే మాటకు గౌరవ ప్రదమైన స్థానాన్ని కల్పించి, మత సమన్వయానికి పఠిష్టమైన పునాదులు వేయడం జరిగింది.
  6. మతమంటే ఆధ్యాత్మిక అనుభూతి అని, మనిషిలో గర్దితంగా ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయడమే మతమని చేసిన నిర్వచనం పాశ్చాత్యుల మతాబభిప్రాయాలపై నూతన వెలుగును ప్రసరించింది.

మన మధ్య విభిదాలెందుకు?: వేలాది సంవత్సరాల నుంది మానవజాతిని పీడిస్తున్న మత విభేదాలనూ, వాటి వల్ల సంభవించే అరాచకాలనూ నిర్మూలించాలంటే వాటి మూల కారణాన్ని తెలుసుకోవాలి. ‘మన మధ్య విభేదాలెందుకు?’ అన్న తమ రెండో ప్రసంగంలో – తన నుయ్యే సర్వస్వమనీ, సముద్రం కన్నా తన నుయ్యె పెద్దదనీ భావించే నూతి కప్పలా, ప్రతి ఒక్కరూ తమ మతమే సర్వస్వమూ, అన్ని మతాల కన్నా తమ మతమే గొప్పది అన్న భావంతో ఇతర మతాలను కించపరచి, తూలనాడడం సమంజసం కాదు. ప్రతీ మతం వారూ తమ తమ సంకుచిత భావాలను వీడి, తమ చిన్న నూతి నుండి బయటకు వచ్చినప్పుడే విశాల ప్రపంచం మనదవుతుంది. మనస్సు విశాలత నొంది, సమ్యగవగాహనకూ, పరస్పర స్నేహ సహకారాలకూ దారి తీస్తుంది. అప్పుడే ప్రజలంతా ఆనందంగా, శాంతియుతంగా కలిసి మనుగడ సాగించగలరు అని స్వామి వివేకానంద పేర్కొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం: సనాతన ధర్మ ప్రకాశిని Paper on Hinduism స్వామీజీ చేసిన మూడో ప్రసంగం. హిందూ మతపు వివిధ సంప్రదాయాలలో ఉన్న విభిన్న భావాలను సమన్వయ పరచి సమగ్ర హిందూ మత స్వరూపాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా, వివిధ రకాల పుష్పాలతో చేసిన అందమైన పుష్పగుచ్చంలా తయారుచెసి అందించారు స్వామీజీ. ‘అతి ప్రాచీన మతమైనప్పటికీ, హిందూమతం దినదినాభివృద్ధి చెందుతూ పటిష్టమవడానికి ముఖ్య కారణాలు’ – ఆ మతంలో ఉండే విశ్వజనీనత, ఇతరుల భావాలను తనలో కలుపుకొనే బెదార్యం, ఇతర మతాల్లోని మంచిని గ్రహించి జీర్ణించుకునే శక్తి!

భిన్నత్వంలో ఏకత్వం హిందూమత ప్రత్యేకత. ‘పాపి’ అన్న పదానికి తావే లేదు. ‘అమృతస్య పుత్రాః’ – ‘మీరంతా అమృత పుత్రులు’ అని వేదాలు ఘోషిస్తున్నాయి. హిందూ మత విశ్వజనీనతకు మూల సూత్రాలు, హిందూ మతానికి సుస్థిర పునాదులైన సిద్ధాంతాలు ఇవీ – ‘ప్రతీ ఒక్కరూ దైవ స్వరూపులే; జీవిత పరమావధీ పరమశాంతి ప్రదాయకమైన న మోక్షమే’ అని పలికారు.

కాలే కడుపుకు కావలసింది: ఇక నాలుగో ప్రసంగం. “Religion-not the crying need of India” ‘భారతీయులకు తక్షణం కావలసినది మతం కాదు’ అన్న అంశం. ‘అన్నమో రామచంద్రా!’ అని అలమటించే నిరుపేదలకు కావలసింది పట్టెడన్నం మాత్రమే! క్రైస్తవ దేశాలు ఈ బీదలకు మతబోధలు చేసి, మత మార్చిళ్ళకు ప్రోత్సహిస్తున్న సమయం అది. స్వామిజీ ఆగ్రహంతో కాక, ఆవేదనతో చేసిన ప్రసంగమిది.

స్వామీజీ ప్రసంగం విన్న తరువాత ఒక విదేశీ క్రైస్తవుడు చేసిన వ్యాఖ్య ఇది; “వీరినా మనం మూర్తులుగా పరిగణిస్తున్నది? ఇలాంటి విజ్ఞులకూ, ఉత్తమ సంస్కృతికీ ఆలవాలమైన దేశానికా మనం మత బోధకులను పంపించడం? వారి మతాచార్యులు మన దేశం వచ్చి మనకు ప్రబోధించడం సమంజసం.”

ఇక, స్వామి వివేకానంద తమ అయిదో ప్రసంగంలో బుద్దుని గురించి, బుద్ధుని అవతార విశిష్టత గురించి తెలుపుతూ ప్రస్తుత సమాజానికి బుద్ధుని హృదయం – శంకరుని మేధ అత్యంత ఆవశ్యకాలని తెలివారు.

సమన్వయం – సామరస్యం: విశ్వమత మహాసభల చివరి సమావేశం 1893 సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగింది. ఆరవద్దీ, ఆఖరుదీ అయిన తన ప్రసంగాన్ని స్వామి వివేకానంద చాలా సంగ్రహంగా చేసినప్పటికీ, ఆయన తొలి ప్రసంగంలో లాగానే అదే విశాల భావాలు, విశ్వజనీనత ఉట్టిపద్దాయి. ‘ఇతర మతాల్ని అణగద్రాక్కి ఏ ఒక్క మతమూ పైకెదగలేదనీ, ఇతర మతాల వినాశనాన్ని కోరే ఏ మతమూ బ్రతికి బట్టకట్టలే’దనీ నిర్దంద్వంగా నొక్కి చెప్పారు వివేకానంద.

ఏ ఒక్కరూ తమ తమ మతాలను మార్చుకోనక్కరలేదనీ, ఇతర మతాల్లోని మంచిని గ్రహించి, ఎవరి మతాన్ని వారు చిత్తశుద్ధితో అవలంబిస్తే గమ్యాన్ని చేరవచ్చుననీ బోధించారు.

పవిత్రత, పరిశుద్ధత అనేవి ఏ ఒక్కరి సొంతమూ కాదనీ, ప్రతీ మతమూ ఆధ్యాత్మిక ఉన్నతి నొందిన మహాత్ములను తయారు చేసిందనీ నిష్కర్షగా చెప్పారు వివేకానంద. పరస్పర సహకారంతో, ఇతర మతాలలోని మంచిని గ్రహించి, ఆకళింపు చేసుకొని సమత, సమభావాలతో శాంతియుతంగా కలిసి జీవించడమెలా? అన్నదే విశ్వమత మహాసభలలో వారి అంతిమ ప్రసంగ సారాంశం.

వివేకానందునికోసమే విశ్వమత మహాసభలు నిర్వహించారా? లేక విశ్వమత మహాసభల కోసమే వివేకానందుడు వెలిశాడా? అన్నంత వైభవంగా జరిగాయి ఆ సభలు.

సంకట కాలంలో సంస్మరణీయుడు: ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రపంచ దేశాల మధ్య, మనుష్యుల మధ్య భౌతికంగా దూరాలు తగ్గుతున్నాా హృదయాల మధ్య అగాధాలు పెరుగుతున్నాయి. సుఖ సాధనాలు పెరుగుతున్నా సుఖ శాంతులు కరవవుతున్నాయి. ఇది ప్రస్తుత సమాజ దయనీయ దుఖ్ధితి. వివిధ ఆదర్శాలు, భావాల మధ్య ఉన్న విభేదాలే ప్రపంచ విచ్చిన్నతకూ, అశాంతికీ ముఖ్య కారణాలుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల నుండి మనం బయట పడాలంటే వివేకానందుడు ఒసగిన విశ్వజనీనమైన సమత, సమన్వయ, సామరస్య భావాలు, సర్వమానవ సౌభ్రాత్భత్వమే శరణ్యం. ఈ సంకటకాలంలో వివేకానందుని సందేశం అవశ్యం స్మరణీయం.

ముగింపు: గతానికి చెందిన చారిత్రక వ్యక్తి కాదు వివేకానంద స్వామి. నేటికీ మానవాళి సర్వోన్ముఖ సౌభాగ్యానికీ చైతన్యంతో, సజీవంగా కృషి చేస్తూ ఉన్న ఒక అదృశ్య శక్తి ఆయన. ‘జీర్ణస్థితికి చేరిన వస్తంలా నెను ఈ శరిరాన్ని వదిలి పెట్టినా, ఎల్లెదలా మానవాళిని ఉత్తేజపరుస్తూ, వారంతా తాము భగవంతుని స్వరూపాలమే అని తెలుసుకునేంత వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను’ అని ఆయనే స్వయంగా పేర్కొన్నారు.

భారతజాతి గర్వించదగ్గ విశిష్ట వ్యక్తులలో వివేకానంద స్వామి అగ్రగణ్యులు. స్వామీజీ ఒసగిన ఈ అమూల్య సందేశాల స్ఫూర్తిని ఆకళింపు చేసుకొని, మన జీవితాలలో వాటిని చిత్తశుద్ధితో ఆచరించడమే మన కర్తవ్యం. ఇదే మనం వివేకానందునికి అర్పించే ఘన నివాళి!