‘ప్రపంచంలో ఏ దేశానికీ లేని యువశక్తి కేవలం భారతదేశానికే ఉంది. అది మనకు గొప్ప వరం. కానీ, ఆ వరమే మన దేశానికి శాపంగా పరిణమిస్తోంది’  అని మేధావి వర్గ్షమంతా, మథనపడుతూ ఉంది. నిజానికి యువతరం మన దేశానికి వరమా? లేక శాపమా? పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే యువశక్తి హద్దులు దాటితే వినాశనాన్ని సృష్టిస్తుంది. అదే యువశక్తిని మార్చనిర్దేశం చేసి, సన్మార్గంలో పయనింపజేస్తే పురోగమనానికి మవుతుంది.

‘యువతరం – సినిమా, టీవీ, సెల్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌. మొదలైన ఆదునిక ఆకర్షణల మోజులో పడి పెడదోవ పడుతోంది. దురలవాట్ల సునామీలో కొట్టుకుపోతోంది’ అని యువతరాన్ని విమర్శించేవాళ్ళేగానీ, వారిని సంస్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఆలోచించేవారు అరుదు.

తప్పుపట్టడం కాదు, ఒప్పేమిటో చెప్పు! చేతికి దొరికిన కాగితాన్నల్లా చింపేయడం ఓ నాలుగేళ్ళ పిల్లవాడికి అలవాటు. కరెన్సీ నోటు చేతిలో పడినా అదే తీరు. తల్లితండ్రులు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా అతడి అలవాటు మాత్రం మారలేదు. పిల్లవాడి వింత చేష్టను మానిపించలేని తల్లితండ్రులు, ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి విషయం చెవ్వారు.

మానసిక వైద్య నిపుణుడు ఆ పిల్లవాణ్ణి గదిలోకి తీసుకువెళ్ళి, ఓ ఐదు నిమిషాల తరువాత తిరిగి తీసుకువచ్చాడు. అబ్బాయి తల్లితండ్రులతో ఆ వైద్యుడు “ఇప్పుడు మీ అబ్బాయికి కరెన్సీనోటు ఇవ్వండి” అని చెప్పాడు. ఐదు వందల రూపాయల నోటును ఆ అబ్బాయి చేతిలో పెట్టారు. ఆ అబ్బాయి ఆ నోటును చింపకుండా తిరిగి తల్లితండ్రులకు ఇచ్చేశాడు. “ఎన్నో రోజులుగా మేము మాన్సించలేని అలవాటును మీరెలా మాన్సించగలిగారు?” అని తల్లితండ్రులు ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు వైద్యుడు “మీరు ఇన్నాళ్ళూ కాగితాన్ని చింపొద్దు అని మాత్రమె చెప్పారు. కాని నేను కాగితాన్ని ఎందుకు చింపకూడదో చెప్పాను. ఈ కాగితం (కరెన్సీ నోటు)తో దుస్తులు, చాక్లెట్‌లు, ఆటవస్తువులు కొనుక్కో వచ్చని చెప్పాను” అని సమాధానమిచ్చాడు.

అందువల్ల తప్పు చేశారంటూ పిల్లల్ని నిందించడంతో సరిపెట్టకుండా, వారికి ఉన్నత విలువలను బోధించాలి. అందుకే పిల్లల్ని ‘మీరు. చెడ్డవారు, ఎందుకూ పనికిరారు’ అని నిందించవద్దు. ‘మీరు మంచివారు, ఇంకా మంచివారిగా తయారుకావాలి’ అని ప్రోత్సహించాలి. వారిలో సకారాత్మక, స్ఫూర్తిదాయక ఉన్నత భావాలను పెంపొందింపజేయాలి” అని అంటారు స్వామి వివేకానంద.

వెలుగుబాట వైపు యువ సారథులు: ‘మంచిమాటలు చెబితే నేటితరం పిల్లలు వింటారా?’ అని నిరుత్సాహాన్ని వ్యక్తపరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ అపోహ నిజం కాదు. యువతకు సన్మార్గంలో నడవాలనీ, తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనీ ఆసక్తి, తపనా, ఉత్సాహం ఉన్నాయి. అందుకు నిదర్శనంగా స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని సుమాలు పదహారు నలల న రాష్ట వ్యాప్తంగా కొనసాగిన ‘వివేకానంద రథయాత్ర’ సభల్గ్‌ వాల్తొన్న కొన్నింటిని ఇక్కడ తెలియజస్తున్నాం:

ఒక ఊరిలో రోడ్డు పక్కన ఉన్న సంచార పుస్తేక విక్రయశాలద్ద చ్రాలా మంది వివేకానంద పుస్తకాలు కొనుక్కుంటున్నారు. అదే దోవలో వెళుతున్న ఒక కళాశాల విద్యార్థి అక్కడ ఆగి చాలాసేపు ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతణ్జి చూసిన ఓ కార్యకర్త  “ఏమిటి అంత దీర్హంగా లోచిస్తున్నావు?” అని అడిగాడు. అందుకు ఆ విద్యార్థి “నా దగ్గరున్న ఇరవై రూపాయలతో సినిమా చూడడానికి వెళ్ళాలా? లేక వివేకానంద పుస్తకాలు కొనుక్కోనాలా? అని అలోచిస్తున్నాను” అన్నాడు.

అప్పుడు ఆ కార్యకర్త “సినిమా రేపైనా చూకోచ్చు నువ్వ ఒక్కసారి ‘భారతజాతికి నా హెతవు’ అనే స్వామి వివేకానంద పుస్తకాన్ని చదువు” అని సలహా ఇచ్చాడు. అతడు చెప్పిన ప్రకారం ఆ విద్యార్ధి పుస్తకాన్ని కొనుక్కొని ఇంటికి వెళ్ళి, చదివిన తరువాత మళ్ళీ అక్కడకు వచ్చి ఇంకో వంద రూపాయలతో స్వామి వివేకానంద జీవిత చరిత్ర, మరికొన్ని పుస్తకాలను కొని, ‘ఈ రోజు మీ సలహా పాటించి ఉండకపోతే ఎంతో విలువైన సందేశాన్ని కోల్పోయి ఉండేవాణ్ణి’ అంటూ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపాడు.

ఒక నగరంలో పాఠశాల విద్యార్థులను ఉద్దేశిస్తూ ఓ స్వామీజీ, ‘మీరంతా వివేకానంద సూక్తిని రోజుకు ఒక్కటైనా పఠించండి. అప్పుడు మీలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి’ అని సూచించారు. ఆ సభలో 8వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి, స్వామీజీ సూచన ప్రకారం రోజూ వివేకానంద సూక్తులను పఠించడం మొదలుపెట్టింది. అప్పటి వరకూ అల్లరి చిల్లరగా తిరిగిన ఆ అమ్మాయి. ఉదయాన్నె లేచి దైవ ప్రార్ధన చేస్తోంది. శ్రద్ధగా చదువుకుంటోంది. అమ్మాయిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పును గమనించిన ఆమె తల్లితండ్రులు ‘నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది?’ అని అడిగారు. అందుకు ‘స్వామి వివేకానంద బోధలే నాలో పరివర్తనకు కారణం. మీరు నాకు స్వామీజీ గురించి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు?’ అంటూ తల్లితండ్రులను ప్రశ్నించింది ఆ చిన్నారి.

ఒక గ్రామంలో జరిగిన విద్యార్థుల సదస్సులో 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. తరగతి గదిలో 45 నిమిషాల పాటు కూడా నిశ్శబ్దంగా ఉండలేని విద్యార్థులు ఆ సభలో సుమారు మూడు గంటల వాటు స్వామి వివేకానంద బోధించిన ఆత్మవిశ్వాసం, మనోనిగ్రహం, కార్యదీక్ష ఆత్మస్థెర్యం, సేవ, త్యాగాల గురించి వింటూ తన్మయులైపోయారు. ఆ సభ చివరిలో విద్యార్థినీ విద్యార్థులు తమ స్పందన తెలియజేశారు. అందులో ఒక వికలాంగ విద్యార్థి మాట్లాడుతూ, “స్వామి వివేకానంద స్ఫూర్తితో జీవితంలో దేనినైనా సాధించవచ్చు అన్న సంకల్పబలం నాలో పెరిగింది. స్వామీజీ సందేశాన్ని మాకు పరిచయం చేయకపోవడం వల్లనే పెడదోవ పడుతున్నాం. స్వామీజీ సందేశాన్ని చదివినవారిలో ఎలాంటి బలహీనతలనైనా ఎదుర్మ్కోగలశక్తి కలుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం” అని చెమ్మగిల్లిన కళ్ళతో నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

మనోరుగ్మతలకు మందు; “మనోరుగ్మతలకు స్వామీజీ సందేశం ఓ దివ్య బెషధం. ఆయన బోధలు చదివినవారిలో నిరాశా నిస్టృహలు తొలగి ఆత్మస్థెర్యం పెంపొందుతుంది” అని స్వామీజీ సందేశానికి ఉన్న శక్తిని పండిట్‌ నెహ్రూ శ్లాఘించారు.

ఒక పట్టణంలో రథయాత్రలో పాల్గొన్న ఒక విద్యార్థి, ఓ స్వామీజీతో “స్వామీజీ! నేను స్వామి వివేకానంద సాహిత్యాన్ని చాలా చదివాను. స్వామీజీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు కొత్త పుస్తకాలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగాడు. ఆ విద్యార్థితో స్వామీజీ, ‘స్వామీజీ సాహిత్యాన్ని చాలా చదివావు కదా! స్వామీజీ సందేశ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పు’ అని అన్నారు. ‘స్వామి వివేకానంద బోధనలు చదివితే పక్షవాతం వచ్చినవారిలోనైనా పరుగెత్తగణలనన్న ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మానసిక వైకల్యం తొలగి వోతుంది’ అని పెల్లుబికిన ఉత్సాహంతో బదులిచ్చాడు.

ఒక విద్యార్ధుల సభలో ఓ మంత్రి గారు పాల్గొన్నారు. ఆ సభలో ఓ స్వామీజీ, పిల్లలతో వివేకానంద సూక్తులను చెప్పించారు. వివేకానందుల జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘట నలను వివరించారు. ఆ తరువాత మంత్రిగారు మాట్లాడుతూ, ”మానసిక బలహీనతలను పారద్రోలే స్వామీజీ దివ్యసందేశాన్ని ఆన్వాదించిన మీరందరూ నిజంగా ధన్యులు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు స్వామీజీ గురించి వినే భాగ్యం నాకు కలగనందుకు బాధపడుతున్నాను. జీవితంలో నేను ఏం కోల్పోయానో ఇప్పుడు అర్దమైంది. కాబట్టి ఇక నుంది స్వామీజీ సాహిత్యాన్ని చదువుతాను” అని ఆర్రమైన హృదయంతో చెప్పిన మాటలు విద్యార్థుల మనస్సులను కదలించాయి.

యువతరానికి మార్గదర్శి… యువ నాయకుడు:
ప్రపంచంలో స్వామి వివేకానందకున్న యువ అనుచరులు, అనుయాయులు మరెవరికీ లేరు. ఎందుకంటే స్వామీజీ భారతీయ యువతరానికి ఇచ్చినంత స్ఫూర్తిని మరెవ్వరూ ఇవ్వలేదు. యువతరం ఉన్నతి గురించి స్వామీజీ తపించినంతగా ఎవరూ తపించలేదు. యువతరంపై ఆయనకున్న విశ్వాసం మరెవరికీ లేదు. అందుకే, “నా ఆశలన్నీ యువతరం పైనే, ఆధునిక తరం పైనే! సింహాల్లా పోరాడి వారి సమస్యలను వారే పరిష్కరించు కోగలుగుతారు” అని స్వామీజీ అన్న మాటలే యువతరంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శనం.

యువతరానికి స్ప్ఫూర్తిప్రదాత, ప్రేరణదాత స్వామీజీయే అని ముక్తకంఠంతో చాటిన మహాత్ముల్లో కొందరి అభిప్రాయాలు:

“స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా విద్యార్థుల్ని ప్రభావితం చేసినట్లు దేశంలో ఏ ఇతర నాయకులూ చేయలేదు. ఆయన బోధలు చదివితే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందుతాయి.”

– నేతాజీ నుభాష్‌ చంద్రబోస్‌

“నా విద్యార్ది దశలో స్వామి వివేకానంద బోధలు చదివి ఎంతో స్పూర్తి పొందాను. ఆయన బోధలు నా జీవిత దృక్పథాన్నే మార్దేశాయి.”

– లాల్‌ బహదూర్‌ శాస్త్రి

“స్వామీజీ బోధనలు స్కృశిస్తేనే చాలు నా దేహం విద్యుద్దాతం తగిలినట్లుగా ప్రకంపిస్తుంది. ఆయన బోధలు మనలో నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేస్తాయి.”

– రోమారోలా

“శక్తికి కేంద్రమైన స్వామి వివేకానంద నుండి భారత యువత స్పూర్తిని పొంది, ఉన్నతి సాధించాలని ఆశిస్తున్నాను.”

– జవహర్‌ లాల్‌ నెహ్రూ

యువతకు మార్గదర్శి యువ నాయక వివేకానందే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జన్మదినమైన (ఆంగ్ల తేదీ ప్రకారం) జనవరి 12వ తేదీని  ‘జాతీయ యువజన దినోత్సవం’గా 1985లో ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ఆ తేదీన యువజన దినోత్సవం జరుపుకొంటున్నాం.

ఏ దేశంలోనూ లేనంతటి యువశక్తి మన దేశంలో ఉంది కాబట్టే ఆ యువశక్తిని జాగృతం చేయడానికి స్వామి వివేకానంద భారతదేశంలో ఆవిర్భవించారు.

ఇప్పుడు తల్లితండ్రులూ, ఉపాధ్యాయులూ, విద్యావేత్తలూ, ఉన్నతాధికారులూ, నాయకులూ చేయాల్సింది ఏమిటంటే “ఎటో వెళ్ళిపోతోంది యువత” అని కలతచెందకుండా స్వామీజీ భావాల్ని భావిపౌరులకు అందేలా కృషిచేయాలి. అప్పుడు యువత మన దేశానికి సిసలైన వరంగా పరిణమిస్తుంది.