ఈ భారతజాతి యొక్క భౌతిక, పారమార్ధిక విద్యలను మన వశంలో ఉంచుకోవాలి! అంటే మీకు అర్ధమైందా? మీరు దాన్ని గురించే కలలు కనాలి! దాన్ని గురించే ముచ్చటించాలి! దాన్ని గురించే పాటుపడాలి! అంతవరకు ఈ జాతికి మోక్షం లేదు. ఇప్పుడు మీరు నేర్చుకొంటున్న విద్యలో కొన్ని మంచి లక్షణాలున్నాయి. కానీ, దానివల్ల కలిగే మహానర్ధాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. నేటి విద్య వ్యక్తిత్వాన్ని నిర్మించే విద్యకాదు. ఇది పూర్తిగా నిషేధరూపమైన విద్యగా మాత్రమే ఉంది. నిషధ రూప విద్య మరణం కన్నా నికృష్టమైనది!

నేటి విద్యావిధానం దాదాపు లోపభూయిష్టమైనదె. ఎందుకంటె అది గుమస్తాలను తయారుచేసెది మాత్రమే, అంతకంటే మరేమీ కాదు. అది అంతమాత్రమే అయితే మన అదృష్టానికి ఎంతో సంతోషించేవాళ్ళే. కానీ, మనవాళ్ళకు భగవద్దిత ప్రక్షిప్రమట! వేదాలు జానపదగేయాలట! మన వాళ్ళు ఇతరదేశాలలోని ప్రతి వస్తువును గూర్చి, ప్రతిజాతిని గూర్చి, ప్రతివిషయాన్ని గురించి తెలుసుకోవడానికి కుతూహలపడుతున్నారు. కాస్‌ వాళ్ళు తమ ఏడుతరాల తాతముతాతల పేర్లు మాత్రం చెప్పలేరు.

విద్యకు వ్యక్తిత్వాభివృద్ధె లక్ష్యంగా ఉండాలి. అయితే వ్యక్తిత్వాన్ని అభీవ్చుద్ధి చేయడానికి బదులుగా, మనం పైపై మెరుగులను దిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. పైన పటారం లోన లొటారం వల్ల లాభమేమిటి?

మన బాలురు అభ్యసిస్తున్న విద్య వ్యతిరేకమైనది. బడిపిల్లవాడు నేర్చుకొనెదేది లేదు. వాడిలో స్వతస్సిద్దంగా ఉన్న ప్రతీది నశించిపోయింది. వేదవేదాంతాల్లో ప్రముఖంగా ఉద్దాషించబడె శ్రద్ధ, యముడి ముందు నిలబడి ప్రశ్నించే ధైర్యం నచికేతుడికి ఇచ్చిన శ్రద్ధ, ఈ జగత్తును నడుపుతూన్న శ్రద్ధ – అలాంటి శ్రద్ధ అంతరిస్తుంది. అజ్ఞుడు, శ్రద్ధారహితుడు, సంశయాత్ముడు నళశిసాడు. కాబట్టి మనం వినాశనానికి అత్యంత సమీపంలో ఉన్నాం. అందుకు విరుగుడు అంతశ్ళక్తిని బహిర్గ్ణతపరచే విద్యను వ్యాప్తి చేయడమే!

మొట్టమొదట ఆత్మబోధ. ఆత్మబోధ అనగానే జడలు కట్టన శిరోజాలు, దందకమండలాలు, కొండగుహలు తలపుకు వస్తాయి. కాని నెను చెప్పదలచినది అదికాదు. స్వేచ్చ, నిస్పంగం, త్వాగం ఆ ఇవన్నీ అత్యున్నత ఆదర్హాలు. ఈ ఆదర్శాలను ఏ కొంచమైనా ఆచరించగలిగినా మహా భయం (జనన మరణ భయం) నుండి కాపాడబడతాం. ఆత్మలో అనంతశక్తి దాగివుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్న ఆత్మ ఒక్కటే. వ్యక్తీకరణలో మాత్రమే భేదం. ద్వైతిగానీ, విశిష్టాద్వైతి గానీ, అద్వైతిగాసీ, శైవుడుగాసీ, వైష్ణవుడుగానీ, శాక్తేయుడుగానీ, బౌద్ధజైనాదులుగాని భారతదేశంలో జన్మించిన సకల వర్ద్ణాలవారు ఈ విషయంలో ఏకాఖిప్రాయులై ఉన్నారు. బ్రహ్మాది గడ్డిపోచ పర్యంతం వ్యక్తంగానో, నిగూఢంగానో ఉన్న శక్తి ఒక్కటె. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఈ ఆత్మశక్తిని బహిర్ణతపరచడమె ఇప్పుడు మనం చేయాల్సిన పని.

మన పూర్వికులు మనకోసం వదిలి వెళ్ళిన ఆలోచనలను పుస్తకాల్లో చదవండి. ఆ రచయితలు గొప్పు ప్రతిభాశాలురుగా కనిపించరు. ఐనా వారి కాలంలో వారు ప్రతిభాశాలురి! వాళ్ళంతటి మహానుభావులు కావడానికి కారణమేమిటి? వాళ్ళు అనుభూతి చెందిన భావనలు కావు; వారు రాసిన పుస్తకాలు కావు; వారు చేసిన ఉపన్యాసాలు అంతకంటే కావు. అది వీటన్నిటికీ అతీతమైనది, అదే వారి ‘వ్యక్తిత్వం’. నేనిదివరకు చెప్పినట్లు మనిషి వ్యక్తిత్వము మూడింట రెండు వంతులు ఉంటే అతని తెలివితేటలు, మాటలు మూడింట ఒక భాగం ఉంటాయి. నిజమైన మనిషి అంటే వ్యక్తిత్వమే. ఆ వ్యక్తిత్వాన్ని వృద్ది చేసేదే నిజమైన విద్య,