ప్రపంచమంతా పర్యటించిన తర్వాత ఇతర దేశ ప్రజలతో పోలిస్తే మన దేశ ప్రజలు గాధతమస్సులో మునిగి ఉన్నట్లు నాకనిపించింది. బాహ్యంలో సత్వగుణం కనిపిస్తుంది కానీ అంతరంలో కేవలం రాయిరప్పుల్లాగ జడత్వస్థితిలో ఉన్నారు. అటువంటి వారివల్ల లోకంలో ఏ పని జరుగుతుంది? ఎంతకాలం ఇలాంటి జదులు, సోమరులు, ఇంద్రియలోలురు ఈ లోకంలో బ్రతికి బట్టకడతారు? ఇక మనవాళ్ళు గుండెల్లో రక్తం గడ్డకట్టి, నరాల్లో ప్రసారం అయ్యె శక్తికూడా లేకుండా పక్షవాతంతో చచ్చుపడిపోయినట్లున్నారు.

ప్రజలలో రజోగుణాన్ని పెంపొందించి వారిని కార్యోన్ముఖుల్ని చేయాలి. శరీరంలో బలం. గుండెల్లో ఉత్సాహం, బుద్ధిలో స్వతంత్ర ఆలోచన లేకుండా – ఈ మట్టిగడ్డలు ఏం చేయగలవు? ప్రోత్సాహాన్ని కలిగించి, వాళ్ళను సజీవ చైతన్యమూర్తులుగా తయారుచేయాలనేది నా జీవితాశయం! ఈ పనికే నా జీవితాన్ని అంకితం చేశాను. వేదమంత్రాలలో ఉండే అమోఘశక్తివల్ల వాళ్ళను మేల్కొల్పుతాను. ‘లేవండి! మేల్మోండి’ అనే అభయ సందేశాన్ని చాటడానికే నేను జన్మించాను.

దేశం నలుమూలలకు, గ్రామ గ్రామాలకు మీరంతా వెళ్ళిరండి. వాళ్ళందరిలోనూ అనంతమైన శక్తి ఉందని, వాళ్ళు అమృతమైన ఆనందానికి భాగన్వాములని వారికి బోధించండి. ఆ విధంగా వారిలో నిద్రాణమైవున్న కార్యతత్పరతను మేల్కొల్పండి.

ముందు క్షైత్రాన్ని సిద్ధం చేయండి. కాలక్రమంలో ఈ లోకంలో మతం మీద ఉపన్వాసాలివ్వడానికి వేలాది వివేకానందలు జన్నిన్తారు. దాని గురించి చింతించవద్దు. అనాథశరణాలయాలు, క్షామనివారణ కార్యక్రమాలు నెనెందుకు ప్రారంభిస్తున్నానో తెలియడం లేదా? ఆంగ్రవనిత సోదరి నివేదిత భారతీయుల్ని సేవించడానికి పాకీపనులు కూడా చేయడం కనబడడం లేదా? భారతీయులైన మీరు మీ దేశ సోదరులను ఆ విధంగా సేవించలెరా? మీరంతా ఎక్కడెక్కడ మహమ్మారి క్షామం విజృంభిస్తూ ఉందో అక్కడకు వెళ్ళండి. రోగగ్రస్తుల బాధల్ని ఉపశమింపజేయండి. ఒకవేళ ఆ ప్రయత్నంలో మీరు చచ్చినా చావవచ్చు. దానివల్ల వచ్చి నష్టమెమీ లేదు. ప్రతిరోజూ మీలాంటి వాళ్ళెంతోమంది పురుగుల్లా పుట్టి మరణిస్తున్నారు. దానివల్ల ప్రపంచానికి ఒరిగే దేముంది? ఒక ఉత్తమ ఆదర్శం కలిగివుండండి, జీవితంలో ఒక ఉన్నత ఆశయంతో మరణించడం మెలు. ఈ ఆదర్శాన్ని ఇంటింటా, వాడవాడలా బోధించాలి. దానివల్ల మీకే మేలు కలుగుతుంది. అంతేకాక దేశానికి కూడా మంచి చేసినవాళ్ళవుతారు.

నా ఆశలన్ని మీ మీదే ఉన్నాయి. మీరు సోమరులుగా కాలం గడపడం నాకు బాధ కలిగిస్తున్నది. సత్సంకల్పంతో కార్యశూరులుకండి! కార్యదీక్షబూనండి! ఆలస్యం చేయవద్దు. రోజురోజుకు మృత్యువు సమీపిస్తుంది. అన్నీ సకాలంలో జరిగిపోతాయని సోమరులై కూర్చోవద్దు. ఆ విధంగా ఏపనీ నెరవేరదని గుర్తుంచుకోండి!