సీతామాత జీవితచరితలోని ఒక సంఘటనను చెబుతాను. అది ఈ దేశ వనితలకు అనువైనది. రాజ్యం నుండి బహిష్మరింపబడిన తన భర్తతో పాటు సీత అడవికి వెళుతుంది. వాళ్ళిద్దరూ ఒక యోగినిని చూడడానికి వెళతారు. సీత ఆ తపస్వినికి నమస్కరించింది. సీతను ఆశీర్వదిస్తూ ఆ తపస్విని ఇలా అంది; “ఇంత నౌందర్యవంతమైన శదీరం లభించడం చాలా అదృష్టం, నీకది లభించింది. యోగ్యుడైన భర్త లభించడం చాలా అదృష్టం, నీకు యోగ్యుడైన భర్త లభించాడు. అలాంటి భర్తకు విధేయురాలవై ఉందదడం అదృష్టం. నువ్వు అతనికి విధేయురాలిగా ఉన్నావు. నువ్వ ఆనందంగా ఉన్నావనుకుంటాను”.

అందుకు సీత ఇలా బదులిచ్చింది; “అమ్మా! భగవంతుడు నాకు ఈ అందమైన శరీరాన్నిచ్చి నందుకు, భక్తితత్పరుడైన భర్తనిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనితనికి విధెయురాలినా, అతను నాకు విధెయుడా అది మాత్రం నాకు తెలియదు. రాముడు అగ్నిసాక్షిగా వాణ్శిగహణం చేసినప్పుడు అగ్నిహోత్రుని ప్రతివింబమా లేక భగవంతుడు నాకు అలా కనిపించెటట్లు చేశాడా తెలియదు. కానీ నేనతనికి చెందిన దానిని, అతను నాకు చెందినవాదని. తెలుసుకున్నాను. ఈ విషయం నాకు బాగా గుర్తుంది. మేమిద్దరం ఒకరికొకరం సరిగ్గా అమరినవాళ్ళం అని తెలుసుకున్నాను.”

సీతాదేవి జీవితం అనుపమానమైనది. ఈ సీత జీవితం నుందే స్త్రీత్వ పరిపూర్ణతను నిర్ణయించే భారతాదర్శాలన్నీ పుట్టుకు వచ్చాయి. అనేకవేల సంవత్సరాల నుండి ఆర్యావర్తం ఆమూలా గ్రం సర్వత్రా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి శిశువుచేత పైతం ఆమె పూజలందుకొంటూ ఉంది. ఈ అద్భుతమైన సీతాసాధ్వి పవిత్రతలలోకెల్ల పవిత్రమై, సహనానికి ప్రతిరూపమై, నిరంతరం కష్టాలనుభవిస్తూ ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. కొంచెం కూడా విసుగుచెందకుండా ఆమె జీవన దుఃఖసముద్రాన్ని ఓపికతో ఈదింది. పతివ్రతయె, పవిత్రంగా మానవులకు, దేవతలకు పరమాదర్శమై ఆమె ప్రకాశిస్తోంది. ఆ మహాసాధ్వి సీత మన జాతికి అధిష్థానదెవతగా ఎప్పుడూ సుస్థిరంగా నిలిచి ఉంటుంది.

పిల్లలందరూ, ముఖ్యంగా బాలికలు సీతను ఆరాధిన్తారు. పవిత్రురాలు, భక్తురాలు, ఎన్ని కష్టాలనైనా సహనంతో ఓర్చుకునే సీతను పోలి ఉండటంకంటే భారతీయ మహిళ కోరదగ్గ ఉన్నతి మరొకటి లేదు. ఈ గుణగణాలను పరిశీలించినప్పుడు పాశ్వాత్యుల ఆదర్శంకంటె భారతీయుల ఆదర్శం ఎంత భిన్నమైనదో మీకు స్పష్టమౌతుంది. జాతికంతకూ సహనానికి మారుపేరు సీత.

‘చేతల్లో శక్తి చూపించండి’ అంటారు పాశ్చాత్యులు. ‘కష్టాలను భరించగల శక్తి చూపించండి’ అని భారతీయులంటారు. ఎనలేని కష్టాలను భరించే. శక్తికి సజీవరూపం మహాసాధ్వి సీత. భారతీయ వనితకు సీత మహోన్నత ఆదర్శం.