నిజమైన మతం: ‘పుజ్వన్వ ఫలమిచ్చంతి వుజ్యం న కుర్వంతి మానవాః – నేటి మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారు. కానీ పుణ్యకర్మలను మాత్రం ఆచరించరు’. ఈనాటి మనుషుల ప్రత్యేకత ఇది. ‘ఏ పని చేయాలో అది చేయరు; ఏ పని చేయకూడదో అది చేస్తారు’. ఇది మంద బుద్దుల లక్షణం. ఉదాహరణకు మతవ్యవస్థనె తీసుకుందాం. అన్ని మతాలూ శాంతినీ, సకల మానవ కల్యాణాన్నీ సర్వదా కాంక్షిస్తున్నా వాస్తవంలో అవి ఎడారిలోని ఎండమావులే! ఆచరణ లేని పలుకులు జీవం లేని కళేబరాలు. కనుక ఏదైనా సాధించాలంటే మనస్సు-మాట ఒక్కటై, చిత్తశుద్ధితో ఆచరించాలి. ఇదే విజయ రహస్యం.

మనమందరం మన మన మతాలను ప్రెమిస్తాం. అది సహజం. మన మతంపై మనకున్న భక్తి నిష్టలు ఇతర మతాలపై ద్వేషభావాన్ని పెంచేవిగా ఉండకూడదు. స్వమత అభిమానం, పరమత ద్వేషానికి దారి తీయరాదు. మత ఛాందసత్వం అంటే ఇదే! “We have religion enough to hate each other, but not enough to love each other” అన్నట్లు మనలోని ద్వేషాన్ని అధిగమింపజేసి, ప్రేమను పెంచేదే నిజమైన మతం. మతాలు వెరైనా దాని నాచరించే మనిషి ఆ మనిషి మనస్సు, ఆ మనస్సులోని మంచితనం ముఖ్యం.

మతమన్నది మన కళ్ళకు మసక పొరలు కాకూడదు. విశాల దృక్పథాన్ని ప్రనాదించాలి. ప్రస్తుతం సమాజ సుస్థిర మనుగడకూ, ప్రగతికి అవరోధాలుగా నిలిచే దుష్టశక్తులు, స్వప్రయోజన నాధనకూ, స్వలాభాలకూ, స్వార్ధానికీ లోబడి, మత సిద్దాంతాలక వక్రభాష్యం చెప్పి ప్రజలను పెదదారులు పట్టిస్తున్నాయి. ప్రపంచ సమైక్యతకు గొడ్డలి పెట్టులా తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్తమాన సమాజానికి అమెరికాలోని చికాగో విశ్వమత మహాసభలలో వివెకానంద న్వామీ ఇచ్చిన దివ్య సందేశం స్ఫూర్తిదాయకం, శిరోధార్యం.

చికాగో విశ్వమతసభలు: కొలంబస్‌ అమెరికా దేశాన్ని కనుగొని 400 సంవత్సరాలు నిందిన సందర్భంగా ‘కొలంబియన్‌ ప్రదర్శన’ నిర్వహింపబడింది. ఆ ఉత్సవాలలోని అంతర్భాగమే ఈ విశ్వమత మహాసభలు. ఈ సభలు ప్రపంచ దేశాల చరిత్రలో మరపురాని ఘట్టం. ప్రపంచ సాంస్కృతిక – ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్మరణీయమైన రోజు 1893 సెప్టెంబర్‌ 11. మతాల మధ్య పరస్పర అవగాహనకూ, సర్వమత సమన్వయానికీ, సామరస్యానికీ చక్కటి నిర్వచనం ప్రపంచ దేశాలకు అందించి సమగ సమాఖ్యగా పేరొందిన చికాగో విశ్వమత మహాసభలకు శుభారంభం జరిగింది ఆ రోజునే. ఒక సాధారణ హిందూ సన్వ్యాసి సనాతన ధర్మ ప్రతినిధిగా పాల్గొని, వినూత్న శోభను చేకూర్చి, విశ్వవిఖ్యాత వివేకానందునిగా వన్నెకెక్కినదీ ఈ సభలోనే. ‘నిర్వాహకులు ఆశించిన దాని కన్నా నేటి ఈ సభలు విజయవంతంగా రాణించాయంటే దానికి ముఖ్య కారకుడు వివేకానంద స్వామియొ’ అనీ ‘నిస్సందేహంగా ఆ సభలను ఆకట్టుకొని అశేష సభికుల మన్ననలు పొందిన వారిలో స్వామీజీయె ప్రథముడనీ’ అమెరికా దేశపు వార్తా పత్రికలు అప్పట్లోనే వేనోళ్ళ కొనియాడాయి. ఈ సభలు ముగిసేనాటికి మతసామరన్యానికి సుస్థిర పునాదులు వేయ దమె కాక, ప్రపంచ దేశాలలో మత అవగాహనకు సరికొత్త రూపురేఖలు దిద్దబడ్డాయి. మత దురభిమానమే సమాజ శ్రేయస్సుకు అద్దుగోడ అని చాటి, మత సమన్వయ, సామ రస్యాలకు రూపకల్పన చేయడంలో సభ్యసమాజం చూపిన చొరవ ఫలితమె ఈ విశ్వమత మహాసభలు అని గమనించాలి.

ప్రథమ  సమావెశం: ప్రారంభ సమావేశంలో స్వాగతోపన్యాసానికి ప్రతిస్పందిస్తూ వివిధ మతాల ప్రతినిధులు ప్రసంగిస్తున్నారు. నాటి సభాధ్యక్షులు వివేకానంద స్వామిని మాట్లాడమని కోరుతున్నప్పుడల్లా ‘ఇప్పుడు కాదు, తరువాత’ అని దాటవెస్తున్నారు. అసలు ఈయన ప్రసంగించ గలరా? అన్న సందేహం నిర్వాహకులకు రాకపోలేదు! చివరకు ఆనాటి మధ్యాహ్నం సభ ముగియబోయే సమయానికి న్వామి వివేకానంద ఉపన్యసించడానికి ఉద్యుక్తులయ్యారు. వారి తాలిపలుకులే యావన్మంది సఖీకులనూ సమ్మోహితులను చేశాయి. ‘అమెరికా సోదర సోదరీమణులారా!’ అన్నముచ్చటైన ఈ మూడు మాటలు సభికుల హృదయాంత రాళాలను తాకాయి. పూర్తిగా రెండు నిమిషాలు కరతాళ ధ్వనులతో సభ మారుమ్రోగింది.

వివేకానందుడు పలికినవి వట్టి మాటలా? కావు. సర్వాత్మభావంతో, హృదయాంతరంగం నుండి నిండు మనస్సుతో అన్న మాటలవి. యుగయుగాల భారతీయ సంస్కృతినీ, ఆత్మీయతనూ రంగరించుకున్న ఈ మూడు మాటలూ ఆ దేశ ప్రజల హృదయాలను చూరగొనగా – వారంతా వివేకానందునికి బ్రహ్మరథం పట్టారు. రాబోయె వైశ్వీకరణ (globalization)కు దృఢమైన చక్కటి పునాది స్వామీజీ చికాగో ప్రసంగాలు.

మొత్తం 17 రోజులు జరిగిన ఈ సభలలో 15 ప్రసంగాలు చేశారు – స్వామి వివెకానంద. ప్రధాన సభావెదిక నుండి ఇచ్చిన ప్రసంగాలు ఆరు. ఇన్నిసార్లు ప్రసంగించే అవకాశం ఒక్క వివేకానందునికే కల్పించారు! ఈ ఆరు ప్రసంగాలలో అయిదు సంగ్రహంగా నాగినవి, ఒక ప్రసంగం Paper on Hinduism హిందూ మత విశ్వజనీనతను వెల్లడిచేసే సనాతన ధర్మ ప్రకాశిని. ఈ ఆరూ అతి ముఖ్యమైనవి. వీటిని అతి సంగ్రహంగా కొంత పరిశీలిద్దాం.

సభలో రెండు నిమిషాల కరతాళ ధ్వనుల అనంతరం అమెరికా దేశానికీ, ఆ సభా నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు స్వామీజీ. భారత దేశం నుండి కొందరు వ్యక్తులు హిందూ మతంలోని కొన్ని సాంప్రదాయాలకు మాత్రమె ప్రాతినిధ్యం వహించగా, వివేకానంద స్వామి సమగ్ర హిందూమత వ్యవస్థకూ, సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

వివిధ దేశాల నుండి, మతాల నుండి వచ్చిన బాధితులకూ, శరణార్భులకూ భారతదేశం ఆశ్రయమిచ్చిన చరిత్రాత్మక సత్యాలను వివరించి, తద్వారా హిందూమతం ఆచరణాత్మకంగా ప్రపంచ దేశాలకు మత సహనమే కాక, అన్ని మతాల వారినీ సాదరంగా ఆహ్వానించి తనలో ఇముడ్చుకునే బెదార్యాన్ని చూపిన విధానాన్ని సోదాహరణంగా వివరించారు స్వామి వివేకానంద. భారతీయుల విశ్వజనీనతనూ, హృదయ వైశాల్యాన్నీ భావ జెదార్యాన్నీ తెలిపే ఈ రెండు సంస్కృత శ్లోకాలనూ సందర్భోచితంగా వివరించారు ఆ సభలో స్వామీజీ!

త్రయీ సాంఖ్యంయోగః పశుపతిమతం వైష్టవమితి
ప్రభిన్నె
ప్రస్థానె పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్రాత్‌ బుజుకుటిల నానాపథ జుషాం
నృణామెకో
గమ్యస్త్వ మసి పయసా మర్దవ ఇవ

‘నదులు వెరు వెరు చోట్ల పుట్టినా ఏ మార్గాన్ని అనుసరించినా, కడకు సముద్రంలో కలిసినట్లె, జనులు వారి వారి అఖభీరుచులకు అనుగుణంగా వివిధ మతాలను అవలంబించినప్పటికీ – ఓ ప్రభో! చివరకు వారంతా చేరుకునేది నీ దరికే!’ అని పై శ్లోకానికి భావం. ఎంతటి ఉదాత్త భావం ఇది.

ఇలాంటిదే ఈ గీతా వాక్యం:

యే యథామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం
మమ వర్త్మ్నాను వర్తంతే మనువ్వాః వార్థ సర్వశః

‘ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో, వారిని ఆ విధంగానే అనుగ్రహిన్తాను. అర్జునా! అన్ని విధాలా మనుష్యులు నా మార్గాన్నె అనుసరించి, నన్నె చేరుకుంటున్నారు’ అని ఈ శ్లోకానికి అర్ధం.

తరువాత మత దురభిమానం, మతం పేరిట జరిగే హింసా ప్రవృత్తి ప్రపంచపు శోచనీయ స్టితిని చూసి ఆవేదన వ్యక్తపరచారు ఆ ప్రసంగంలోనె స్వామీజీ. ఇక…

విషాద నిశీధిలో కాంతిరేఖల్లా విశ్వమత మహాసభలు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ ప్రపంచ ప్రజలను ఒక్కటిగా కలపడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడుతూ, సభారంభాన్ని తెలియజేస్తూ ఆ ఉదయం మ్రోగిన జేగంటలు మత ఛాందసత్వానికి, మతం పేరిట జరిగే హింనాత్మక చర్యలకూ, మనుషుల మధ్య ఉందే విద్వేషాలకూ చావు గంటలు కావాలనీ, అందరూ కలిసి ఈ దుష్టశక్తులను అణచి వేయాలనీ స్వామి వివేకానంద ఆశను వ్యక్తపరచారు ఈ తొలి ప్రసంగంలో.

(వచ్చే నంచికలో… విశ్వమత మవోనభల్లో న్వామి వివేకానందుని మిగతా ఐదు వ్రనసంగాల సారాంశం.)