సంగ్గా 150 సంవత్సరాల క్రితం ఉత్తరాయణ పుణ్య కాలంలో మకర సంక్రాంతి మహా పర్వదినాన జనవరి 12న ఒక పురుషశ్రేష్టుడు జన్మించారు. ఆయన ముఫ్పై సంవత్సరాల వయస్సులో సమాజ పటిష్టతకూ, వ్యక్తుల శ్రేయస్సుకూ కావాల్సిన అత్యవసర, ఆచరణీయ సందేశాన్ని ఇచ్చారు. అంతే కాదు! రాగల 1500 సంవత్సరాలకు అన్వయించుకోదగిన ఒక అపూర్వ సందేశాన్ని అందించారు. దేశాత్మ బోధనతో దేశభక్తిని ప్రబోధించి దేశభక్తులకే దేశభక్తుడిగాా స్వీయమోక్షం కోసం కాక సర్వజనుల హితమే తన కర్తవ్యంగా భావించిన సర్వజన రక్షకుడిగా? తన దేశ బెన్నత్యాన్నీ సంస్కృతినీ, సనాతన ధర్మం గొప్పదనాన్నీ ఖండ ఖండాంతరాలలో వ్యాప్తి చేసిన సనాతన ధర్మ ప్రతినిధిగా భారతదేశ యువతరం ఆత్మన్యూనతా భావాలను రూపుమాపి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్సి. దిశా నిర్దేశం. చేసిన యువనాయకుడిగా; భారతదేశం, ప్రపంచ దేశాలను తన ఆధ్యాత్మికతతో జయిస్తుందని భవిష్యద్వాణిని వినిపించిన ఒక ఆధ్యాత్మికవేత్తగా; వ్యక్తిని సౌశీల్యవంతుడైన మనిషిగా చేసేదే. విద్య అని నూతన నిర్వచనమిచ్చిన విద్యావేత్తగా భాసిల్లిన మహనీయుడే స్వామి వివేకానంద.

ఆయన సమాజ పటిష్టత, వ్యక్తి శ్రేయస్సే ధ్యేయంగా తరగని ఉత్సాహంతో తన కార్యాన్ని నిర్వర్తించారు. స్వామీజీ స్వార్థాన్ని విశ్వాత్మలో లయించారు. తదనుగుణంగా భారతదేశాన్ని ప్రేమించారు. దానితో మమేకమయ్యారు. దానికి ఏ విధంగా పటిష్టత చేకూర్చాలో క్షణక్షణం ఆలోచించారు. ఒక తల్లి తన బిడ్డల మనోభావాలను ఎంత సునిశితంగా పరికించగలదో అంత సునిశితంగా భారతదేశంలోని ప్రజల స్థితిగతులనూ, మూఢ నమ్మకాలనూ, పేదరికాన్నీ చూసి కన్నీరు జీ, మున్నీరుగా విలపించారు. ఒక్క మాటలో చెప్పా లంటే వివేకానందుడే భారతదేశం…. వివేకానందుదడే భరత మాత! భరతమాత సేవలో తరించడం కోసం తాను మళ్ళీ జన్మించడానికి సైతం వెనుకాడలేదు. 1900వ సంవత్సరంలో ఆయన రెండోసారి పాశ్చాత్య పర్యటనకు వెళ్ళినప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా శిష్యురాలితో తీవ్రంగా ఆలోచిస్తూ “సను మళ్ళీ జన్మించాలి” అన్నారు. “ఎందుకు స్వామీజీ” అని శిష్యురాలు ప్రశ్నించగా ఆయన గంభీర వదనంతో ‘I have fallen in love with human beings’ ‘నేను మానవాళి ప్రేమలో పడ్డాను’ అన్నారు. బహుశా మానవాళి పట్ల వారికున్న పేమ, ఆయన భారతదేశంలో పరివ్రాజకుడిగా పర్యటిస్తున్నప్పుడు వారి హృదయసాగరంలో తీవ్రమైన భావతరంగ సంచలనాన్ని రేపింది. మనస్సులోని క్షోభను అరికట్టలేక సముద్ర తరంగాలను లంఘించి, కన్యాకుమారి శిలపై కూర్చొని, “భారత ధర్మాన్ని ఉద్ధరించలేని, జనసామాన్యాన్ని ఉద్ధరించలేని ఈ దోషాన్ని సనాతన ధర్మానికి ఆపాదించడమా?” అని మూడు అహోరాత్రాలు ధ్యానించి, ముఖ్యంగా మూడు విషయాలను ఆచరణలోకి తేవడానికి పూనుకొన్నారు.

  • భారత ధర్మం అంటే ఏమిటో తెలియజేయడం.
  • త్యాగం, సేవ అనే జాతీయ ఆదర్శాల ఆచరణ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం.
  • వ్యక్తులు బాగుపడే శక్తులను గురించి తెలియజేయడం.
  • భారత ధర్మం అంటే ఆధ్యాత్మికత, మతంగా చెబుతారు. కానీ కొంచెం విశాలంగా ఆలోచించినట్లయితే ధర్మం అనే పదం సంస్కృతంలో ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది. ‘ధర్మో ధారయతే ప్రజాః’ – ప్రజలను ధర్మబద్ధంగా జీవించే విధంగా నడిపించేదే ధర్మం. ఒక ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కాక వ్యక్తిగా తనూ, తనతో పాటు ఉన్న జన సామాన్యాన్ని సహితం ధర్మబద్ధంగా జీవించేలా తోద్చదేదే ధర్మం. లేకపోతే అది ధర్మమే కాదు.

పాశ్చాత్య ధర్మం కేవలం స్వప్రయోజన హక్కుల కోసం పాటు పడడం. కానీ భారత ధర్మం తాను, తనతో పాటు ఉన్న వ్యక్తులు, తాను ఉన్న సమాజ అభివృద్ధికై ఆలోచించడం. మన ధర్మం కేవలం దేవుడి సాన్నిధ్యంలో ఉన్నంత వరకే పరిమితమై, ఆ దేవుడి ప్రతిరూపాలైన వ్యక్తులు, వ్యక్తులతో కూడిన సమాజం గురించి పట్టింపు లేకపోతే అది ధర్మం కాదు. అందుచేత స్వామి వివేకానంద పరోపకారం చేయడమే జీవితం అంటారు. ఇతరులకు మంచిని చేయనివాడు మృతునితో సమానం. సమాజానికి మంచి చేయాలన్న భావన స్వార్ధాన్ని వీడినప్పుడే వస్తుంది. నిస్వార్థ ఆలోచనలో ఆనందాన్ని చవిచూసే సహనం లేక ర జీవులుగా ఉండడానికే ఇష్టపడి ఇతరులనూ, సమాజాన్నీ దోచుకొనే పరిస్థితి ప్రస్తుత సమాజంలో సర్వసాధారణం అయిపోయింది.

కోల్‌కతాలో ప్లేగు వ్యాధి విలయతాండవానికి అసంఖ్యాక జనులు మరణిస్తున్నప్పుడు, దాని సత్వర నివారణ చర్యల కోసం తన గురుదేవులైన శ్రీరామకృష్ణుల పేరిట మఠం స్థాపించడానికి కొన్న భూమిని సైతం విక్రయించడానికి స్వామి వివేకానంద సిద్ధమయ్యారు. “నేను నా తోటివారి కొద్దిపాటి కన్నీళ్ళు తుడవడానికి ఎన్ని జన్మలెత్తడానికైనా సిద్ధం. నరకానికి పోవడానికైనా సిద్ధం” అంటారు స్వామి వివేకానంద. ప్రతి భారతీయుడూ భారత ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే సమాజం పటిష్టమవుతుందని స్వామీజీ గాఢంగా విశ్వసించారు.

*ఇక స్వామీజీ భారతీయులను రెండు విషయాలపై చైతన్య వంతులను చేయాలని సంకల్పించారు. అవి త్యాగం, సేవ. వేద కాలం నుండి భారతీయ సంతతికి త్యాగమే జీవితానికి భూషణం. ‘త్యాగే నైకే అవృతత్వ మానశుః’ – త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వానికి చేరుకోగలమని మన బుషులు నొక్కి వక్కాణించారు. ఈ పంథానే అనుసరించి భారతీయులను చైతన్యవంతులను చేస్తే, పేదవారికి సహాయం చేయడానికి ధనికులు ముందుకు వస్తారు. రాజకీయ నాయకులు నిద్ర లేకుండా దేశ ప్రజల క్షేమం కోసం ఆలోచించినప్పటికీ, ఆర్థిక శాస్త్రవేత్తలు జనసామాన్య ఉద్ధరణకు కొత్త సిద్ధాంతాలు కనిపెట్టినప్పటికీ, త్యాగ భావన లేనప్పుడు పేదవారు ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతారు. త్యాగం చేయడం ద్వారా మనమేదో కోల్పోతామన్న భావనను విడిచిపెట్టి అది మనల్ని అత్యంత ఉన్నత స్థితికి చేరుస్తుందన్న భావనతో చేయాలి.

అందుకే స్వామి వివేకానంద ‘మహాత్యాగాల వల్లనే మహత్మార్యాలు నెరవేరుతాయి’ అంటారు. ఏకాత్మవాదాన్ని పునాదిగా వేసి స్వామీజీ సమాజ ధర్మాన్ని ప్రతిపాదన చేశారు. సమాజంలో వ్యక్తులందరూ ఈశ్వర స్వరూపులే అన్న భావంతో సేవ చేయాలి. మాతృసేవ, పితృసేవ, అతిథిసేవతో పాటు స్వామీజీ దరిద్రనారాయణ సేవ, దేశసేవను ప్రబోధించి దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. స్వామీజీ భావాలకు ఆకర్షితులై మహాత్మాగాంధీ, నేతాజీ లాంటి నాయకులు ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఒకసారి అమెరికా శిష్యురాలు మెక్స్తౌడ్‌ ‘మీ కోసం ఏమి చేయాలో చెప్పండి’ అన్నప్పుడు, స్వామీజీ వెంటనే ‘భారతదేశాన్ని ప్రేమించు’ అన్నారు. స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఇలా అంటారు: ‘ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే మానవ వికాసానికి భారతదేశం చేసినంత కృషి ప్రపంచంలో మరే దేశమూ చేయలేదు. నా దేశానికి ఇంత గొప్పతనం ఉంది కాబట్టే నేను నా దేశాన్ని ప్రేమిస్తాను’ అన్నారు. ‘ఎప్పుడైతే ఒక జాతి తన ఆదర్శాలను మరిచిపోతుందో, అప్పుడది తన పటిష్ట స్థితి నుంచి పతన స్థితికి జారిపోతుంది. అలాంట ప్పుడు తిరిగి ఆ ఆదర్శాల ఆచరణ కోసం జాతి నడుం బిగించాల’ని స్వామీజీ ఉద్బోధ చేశారు.

ఇక భారతజాతి జీవననాడి అయిన ఆధ్యాత్మికత వైపు స్వామీజీ దృష్టి మరల్చారు. ఆధ్యాత్మికతే మన జీవరక్తం. ఆధ్యాత్మికతే పునాది. ఆధ్యాత్మికతే వెన్నెముక. సర్వస్వం ఆధ్యాత్మికతే. అది స్వచ్చంగా ప్రవహిస్తున్నంత కాలం, బలంగా, పవిత్రంగా పరవళ్ళు తొక్కుతున్నంత కాలం అన్నీ సక్రమంగా ఉంటాయి. ఆ జీవరక్తం పవిత్రంగా ఉంటే రాజకీయమైన, సామాజికమైన, ఇతర భౌతికమైన లోటుపాట్లు ఎన్ని ఉన్నా సరే అన్నీ చక్కబడతాయి అంటారు స్వామి వివేకానంద. ఎందుకంటే, ఆయన పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత వారి జీవన విధానంతో, భారతీయుల జీవన విధానాన్ని పోల్చిచూసి, భారత జాతి జీవనమనే ఈ మహాసౌధం ఆధ్యాత్మికత అనే పునాదిపై నిర్మితమై భాసిల్లుతోందని స్వామీజీ గాంచారు. ప్రస్తుత సమాజంలో ఈ విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ఇకమీదట జాతి ఆధ్యాత్మికంగా బలోపేతం అవడానికి ప్రయత్నించకపోతే ఇక్కట్లను కొని తెచ్చుకొన్నట్లే! వ్యక్తులు బాగుపడడానికి కావాల్సిన శక్తి ఆధ్యాత్మిక శక్తే అనీ, అది ‘తనను తాను మహోన్నత మనిషిగా మలచుకోవడం, మంచి పనులు చేయడమే’ –  ‘The gist of whole religion is to be good and to do good’  అనీ అన్నారు స్వామీజీ.

ఇక స్వామీజీ ప్రస్తుత విద్యావిధానంలోని లోపాలను తెలియజేశారు. విద్య అంటే కేవలం అజీర్ణమైన భావాలను బుర్రలోకి ఎక్కించడం కాదు; జీవితానికీ, ప్రవర్తనకూ అక్కరకు వచ్చే భావాలను అందించే విధంగా విద్యాబోధన జరగాలని స్వామీజీ తెలియజేశారు. సత్ర్రవర్తన రావాలి; మనోదారుధ్యం పెరగాలి; వివేకం విస్తరించాలి. అలాంటి విద్యను సమాజం అందించాలి. ఈ విధంగా విద్యాబోధన జరిగినప్పుడు వ్యక్తులు బాగుపడి మనుషులుగా మారతారని స్వామి వివేకానంద ఆశించారు. విద్యా విధానం ఈ విధంగా జరిగిననాడు మళ్ళీ ఒక గాంధీ మహాత్ముడిని, ఒక నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ని, ఒక స్వామి వివేకానందుణ్ణి తయారు చేయగలం.

పైన వివరించిన మూడు విషయాలను మనం గుర్తించి ఆచరణలోకి తేగలిగిన నాడు స్వామి వివేకానంద మన మధ్యన మళ్ళీ జన్మించినట్లే! ఎందుకంటే, ఎవరి సందేశంతో స్ఫూర్తి పొంది అసంఖ్యాక జనులు జీవిస్తారో (జీవితంలో వెలుగు బాటలో నడుస్తారో) వారు మన మధ్యన జీవిస్తున్నట్లే! ఒకవేళ వారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి సందేశం నిరంతరం మనలో స్ఫూర్తిని నింపుతుంది. ఆ స్ఫూర్తి ద్వారా సమాజ పటిష్టత, వ్యక్తుల శ్రేయస్సు వృద్ధి చెందుతున్నాయంటే, వారు మళ్ళీ జన్మించినట్లే! ఎందుకంటే వారు అశరీరవాణి కదా!

ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ, నీవు కూడా నా లాగ అవగలవు. – స్వామి వివేకానంద