సోదరులారా! ఆలోచించేకొద్దీ మీపై ప్రేమ ఎక్కువవుతోంది. మీరు యోగ్యులు, పవిత్రులు, సాధువర్తనులు. తరతరాలుగా మీరు ఇక్కట్లపాలవుతున్నారు. ఈ మాయామయ భౌతిక ప్రపంచం అటువంటిది. దానిని పట్టించుకోకండి. నిరంతర కృషిచెద్దాం! చివరికి ఆత్మ జయించి తీరుతుంది. దేశాన్ని నిందించవద్దు. నిర్విరామంగా శ్రమించి అలసటపొంది, కాలవైపరిత్యంచేత క్రుంగిపోయిన మన పవిత్ర భారతదేశ వ్యవస్థలను నిందించవద్దు, శపించవద్దు.

మన సమాజంలో లోపాలున్న మాట నిజమే! కానీ, ఇతర సమాజాలలో కూడా లోపాలున్నాయి. మనదేశం ఒకప్పుడు వితంతువుల కన్నీటి ధారలతో తడిసిపోయింది; వాశ్చాత్య దేశాలలో, అవివాహిత యువతుల నిట్టూర్చులతో గాలి సుళ్ళు తిరిగిపోతోంది. ఇక్కడ దారిద్ర్యం జాతి వినాశహేతువుగా ఉంది; అక్కడ భోగలాలసత్వంలోని వెక్కసవాటు జాతి వినాశకారణంగా ఉంది! ఇక్కద, తిండిలేక ప్రజలు ఆత్మహత్య చేసుకొంటున్నారు. అక్కడ తింది ఎక్కువై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా, అంతటా కీడుంది.

ప్రతి సంఘంలోనూ లోపాలుంటాయని అందరికీ తెలుసు. ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. చదువు సంధ్యలు లేని లోకసంచారి అయిన పరదేశి ఇక్కడికి వచ్చి భారతదేశంలోని ఘోరదురాచారాలను గూర్చి గొప్ప గొప్ప పండితోపన్యాసాలను కురిపించగలడు. మన సంఘంలో దోషాలున్నాయని మనం ఒప్పుకుంటూనె ఉన్నాం. దోషాన్ని ప్రతివాడూ చూపగలడు. కానీ ఆ దోషాన్ని పరిహరించే మార్గాన్ని చూపెవాడు మానవాళికి స్నెహితుడు.

నీటిలో మునిగిపోతున్న ఒక పిల్లవాడికి దారిన పోతున్న ఒక వేదాంతి ఉపన్యాసమియ్యసాగాడట! అందుకు పిల్లవాడు “ముందు నన్ను నీళ్ళలో నుంది బయటకు లాగు” అని అరిచాడట. అట్లె “మెము ఉపన్యాసాలు కావలసినన్ని విన్నాం. సంఘాలు కావలసినన్ని ఉన్నాయి. పత్రికలూ కావలసినన్ని ఉన్నాయి. మాకు చెయి అందించి, పైకిలాగే పురుషులెక్కడున్నారు? నిజంగా మమ్మల్ని ప్రేమించెవాళ్ళిక్కడున్నారు? మాపై సానుభూతి చూపె దయామయులెక్కడున్నారు” అని మన ప్రజలు ఘోషిస్తున్నారు. అవును, ఇప్పుడు మనకు కావలసింది ప్రజలను డ్రేమించి, వారి కవ్టాలను తీర్చ అనుష్థానపరులెగానీ, వాచా వేదాంతులు కాదు!