‘విగ్రహారాధన దోషం’ అని చెప్పడం, ఈ రోజులలో అలవాటైపోయింది. ప్రతివాడు ఆలోచనలెకుండా ఆ మాటలను ఒప్పుకొంటున్నాడు. నేనూ ఒకప్పుడు అలాగే భావించాను. అందుకు ప్రాయళ్చిత్తంగా విగ్రహారాధన మూలంగా సర్వమూ సాధించిన ఒక మహాపురుషుని పాదాలను ఆశ్రయించి పాఠం నేర్చుకోవలసి వచ్చింది. శ్రీరామకృష్ణ పరమహంసను ఉదహరిస్తున్నాను. విగ్రహారాధన మూలంగా అలాంటి రామకృష్ణ పరమహంసలు సిద్ధించి. ఉండగా, మీకిప్పుడు కావలసింది ఈ సంస్కర్తల సిద్ధాంతాలా? లేక పవిత్రమైన విగ్రహాలా?

విగ్రహారాధన మూలంగా రామకృష్ణ పరమహంసలు ఉత్పన్నమయి ఉండగా మీకు ఇంకా అనెక విగ్రహాలతోను, సంస్కర్తలతోను పనేముంది? విగ్రహారాధన ద్వారా చాలామంది రామకృష్ణ పరమహంసలను మీరు. ఉత్పత్తి చెయ్యగలిగితే ఇంకా వెయ్యి. విగ్రహాలను తీసుకోండి. భగవంతుడు మీకు చురుకుదనం ఇవ్వుగాక!

మీకు సాధ్యమైన ఏ విధానం చేతనైనా సరే అటువంటి మహాపురుషుల్ని సృష్టించండి. ఐనా, విగ్రహారాధన  దోషమంటున్నారు, ఎందువల్ల? ఎందువల్లో ఎవరికీ తెలీదు! కొన్ని శతాబ్దాలకు పూర్వం యూదు జాతీయుడొకడు విగ్రహారాధనను ఖండించడం వల్లనా? అతడు ఆరాధ్య విగ్రహాన్ని తప్ప తక్కిన వారి విగ్రహాలన్నింటినీ దూషించాడట! దేవునికి ఒక మనోహరరూపాన్నిగానీ, చక్కని చిహ్నాన్నిగానీ కల్పించడం మహాదోషమనీ, పాపమనీ అతడన్నాడు. ఒక పెట్టె ఆకారంగా తయారుచేసి, దానిపైన రెండు ప్రక్కల ఇద్దరు దేవదూతలు కూర్చొన్నట్లు, వానిపై ఒక మబ్బు తేలియాడు తున్నట్టు చిత్రరూపకల్పన చేసి చూపితే, అది పవిత్రమైన వాటికన్నా పవిత్రమైనదట! దేవుడు పావురం రూపంలో వస్తే పవిత్రమట. కానీ ఆ దేవుడే గోరూపంలో వస్తే ఊహూ… పనికిరాదు. అది మూఢత్వం అని నిందించాలి. లోకం పోకడ ఇలా ఉంది. కాబట్టే ‘మనుష్యులెంతటి మూర్చలు?’ అని ఒక కవివరుడన్నాడు. ఎదుటివాని దృష్టితో ఏ విషయాన్నైనా చూడగలగడం మహాదుర్లభం. అదే మానవ జాతికి కలిగిన అనర్థం. అదే ద్వేషాలకు, అసూయలకు,  వాదులాటలకు, పోరాటాలకు మూలకారణం.

నా ఆశయం నిర్మాణమే తప్పు, నిర్మూలనం కాదు. ఇప్పుడున్న ఆచారాల నుండి క్రౌత్తవి రూపుదిద్దుకోవాలి. ప్రతిదాన్లో వర్టిల్లేశక్తి అపారంగా ఉంటుందని నా విశ్వాసం. ప్రతి అణువులో మొత్తం విశ్వశక్తి ఇమిడి ఉంది. హిందూజాతి చరిత్రలో ఎప్పుడూ నిర్మూలించే యత్నం జరగలేదు; దానిది నిర్మాణాత్మకమె!