ఆనందం పొందాలనే కాంక్షను, సమాజం కోసం సంపూర్ణంగా విడచిపెట్టన నాడు నువ్వే బుద్ధుడవు కాగలవు. నువ్వు విముక్తుడవు కాగలవు.

నేను తత్త్వవిచారకుణ్ణి కాను, వేదాంతిని కాను, సన్వ్యాసిని కూడా కాను. నేను నిరుపేదను. కనుక నేను నిరుపేదలను ప్రేమిస్తాను. శాశ్వతంగా దారిద్ర్యంలో, అజ్ఞానంలో క్రుంగిపోయిన కోట్ల మంది ప్రీ, పురుషుల కోసం ఎవరు బాధపడతారు? నిరుపదల కోసం ఎవరి హృదయమైతే రక్వాశువులను కారుస్తుందో అతడినే నేను మహాత్ముడంటాను. దీనులే మీ దైవం కానివ్వండి. వారిని గురించే యోచించండి, వారి కోసం కృషి చేయండి, నిర్విరామంగా వారి కోసం ప్రార్థనలు చేయండి. దైవం మీకు దారి చూపుతాడు.

మొట్టమొదట, గుండెలోతుల నుండి వేదన చెందండి. మీరు బాధపడతారా? దేవతలకు, తపోధనులకు వారసులైన తద్వంశీకులు లక్షలాది మంది పశుప్రాయులై పోయినారన్న భావం మీలో కలుగుతున్నదా? లక్షలాది ప్రజలు ఈనాడు పస్తులుంటున్నారనీ నీకు తోస్తున్నదా? ఇది నీలో అశాంతిని రేపుతున్నదా? ఇది నీకు నిద్రపట్టనీయ కుండా బాధిస్తున్నదా? ఇది నీ రక్తంలోకి, నరాలలోకి వ్రాకిబోయి, హృదయ స్పందనలో ఐక్యమై పోయిందా? నీ మనస్సును ఉన్మాద స్థితిలోకి తీసుకొని పోయిందా?

నీ పేరు, ప్రతిష్ట, భార్యాబిడ్డలూ, ఆస్పివాస్తులూ, చివరకు నీ దేహంతో సహా ప్రతి ఒక్కటీ మర్చిపోయావా? పేదప్రజల బాధలను నివారించ డానికి ఏదైనా ఆచరణీయమైన పరిష్కారం కనుగొన్నావా? వారిని నిందించకుండా ఏదైనా సాయం చేయబోతున్నావా? వారి బాధోపశమనానికి ఏదైనా మార్గాన్ని కనుగొన్నావా? ఈ జివన్మరణం నుండి బయటపడవెసె పద్ధతి తెలిసికొన్నావా?

మేరువంత ఎత్తైన అడ్డంకులను అధిగమించే సంకల్పబలం ఉన్నదా? యావత్‌ ప్రపంచమూ నీ కెదురు నిలబడినప్పటికి నీకు మంచిదని తోచిన పని చేయడానికి సాహసిస్తావా? ఇంకా ముందడుగు వేస్తూ ఆశయ కృషిని నిలకడగా కొనసాగిస్తూ నీ ధ్యయం వైపు పయనిస్తావా? నీలో అంతటి నిశ్చలబుద్ధి ఉన్నదా? ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే అద్భుతాలు సాధించగలవు.