యువజనులారా!
నా ఆశలన్నీ మీ మీదే. మీరు, మీ జాతి పిలుపును ఆలకిసారా? నా మాటలను నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికీ భావికాలంలో మహాదశ ప్రాప్పించి తీరుతుంది. నాకు చిన్నప్పుడెలాంటి విశ్వాసముందేదో, దాన్ని నెనిప్పుడు ఆచరణలో చూపుతున్నాను. అలాంటి దృఢ విశ్వాసం మీమీద మీకుందా? ఆ శాశ్వతమైన శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉందని విశ్వసించండి. మీరు భారతదేశాన్నంతా పునరుజ్జీవింపజేయగలరనే ఆత్మవిశ్వానాన్ని కలిగి ఉండంది.యౌవనోత్సాహం పరవళ్ళు తొక్కుతున్నప్పుడే మీ భవిష్యత్తును నిద్దెశించుకోండి. వృద్ధాప్యం మీదపడి జవసత్వాలుడిగిన తరువాత మీరు చేయగలిగిందేమీ ఉండదు.ప్రపంచంలో ఉన్న ప్రతిదేశానికి మనం వెళ్ళనున్నాం. ప్రపంచంలోని ప్రతిజాతిని ఉద్ధరించడానికి ఉపకరించే అనేక శక్తులతో కలిసి మన బోధలు అచిరకాలంలోనే పనిచేయనున్నాయి. భారతదేశంలో, విదెశాలలో కూడా ప్రతిజాతి జీవనంలో మన ముద్రపడవలసి ఉంది. ఈ కార్యసిద్ధిని సాధించడం కోసమై మనం పనిచెయాలి!

“బుషులు నిందించసీ, స్తుతించనీ; భాగ్యదేవత రానీ లేదా తన తోవన తానుపోన్సీ; నెడే మరణం సంభవించనీ లేదా నూరేళ్ళ తర్వాత రానీ; సత్యమార్గం నుండి ఒక అంగుళమైనా వైదొలగనివాడె నిజంగా స్థిరచిత్తుదైన పురుషుడు” అని భర్తృహరి చెబుతున్నాడు. అలాంటి సుస్థిరత్వం మీలో ఉందా? అలాంటి సుస్థిరత్వం మీలో ఉంటే మీలోని ప్రతిఒక్కరూ అద్భుతకార్యాలు చేయగలరు. మీరు వార్తాపత్రికలలో వ్యాసాలు వ్రాయనక్షల్లదు, ఉపన్యానాలిస్తూ అక్కడక్కడా తిరుగవలసిన అవసరం లేదు. మీ ముఖమే దేదిప్యమానంగా తేజరిల్లుతుంది. మీరు మారుమూల గుహలలో నివసిస్తున్నప్పటికి మీ సంకల్పాలు రాతిగోడలను ఛెదించుకొని పోయి శతాబ్దాల పర్యంతం లోకమంతా స్పందిస్తూ ఉంటాయి. అవి ఎవరి మేధస్సులోనో నాటుకొని అక్కడి నుండి మరలా పనిచేస్తూ ఉంటాయి. సంకల్పశక్తి అలాంటిది. బుజుత్వ మహిమ అలా ఉంటుంది. నిష్కల్మష దీక్షకు అలాంటి శక్తి ఉంటుంది.

పురోగమించండి! యుగయుగాల సంఘర్షణ ఫలితంగా వ్యక్తిత్వం రూపొందుతుంది. అధైర్యపడొద్దు. సత్యవాక్యం ఎన్నటికీ వమ్ముకాదు; నివురుకప్పిన నిప్పులా దిర్హకాలం అది మరుగునపడి ఉండొచ్చు. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు బహిర్గతం కాకతప్పదు. సత్యం వినాశం లేనిది ధర్మం వినాశం లేనిది పవిత్రత వినాశం లేనిది; అందుచెత ఒక నిష్మపటవర్తనుణ్ణి నాకు ఇవ్వండి, వందలాదిమంది వెన్నెముకలేనివారు అక్కరలేదు. నాయనా! ధిరుడవై నిలబడు. అన్యుల సహాయాన్ని ఆశించవద్దు.