తృప్తి అనేది హార్దికం: ఆర్థిక వనరులు మాత్రమె మనిషికి సుఖశాంతులనిస్తాయన్నది ఒట్టి భ్రమ. ‘ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా ఒక కుగ్రామంలో కుమ్మరించినా ప్రజలు ఉద్ధరింప బదరి’ని ఘంటాపథంగా చాటి చెప్పి ‘స్వయంకృషితో ఎవరికి వాళ్ళు నిలదొక్కుకున్నప్పుడే; నీతి నిజాయతీలతో బ్రతకగలిగి నప్పుడే సుఖశాంతులు సంభవమి’ని స్వామీజీ వక్కాణించారు.

ధనం మనిషికి సుఖశాంతులివ్వలేదు. తృప్తి ద్వారా వాటిని పొందగలం. తృప్తి అనేది హార్దికం. త్యాగమనే ఒక్క తాత్త్విక చింతనతో హృదయ పరివర్తన కలిగి, ధనతృష్టను విడిచి ఇతరుల సేవలో తరించిన వారెందరు లేరు సమాజంలో?

మానవ వికాసమే సమాజ వికాసం: ధనికుల హృదయాలు బీదల కవాలకు స్పందించాలన్నాా బీదలు, బడుగు వర్గాలు ఆత్మవిశ్వాసంతో గౌరవప్రదంగా సమాజంలో జీవనం గడపాలన్నా స్వామీజీ సందేశం చదివి, ఆచరించాలి. ఈ ప్రక్రియ ద్వారా మనిషి నిన్వార్ధత, సామాజిక స్పృహ, సమతా నామరస్య భావాలు అలవరచుకుంటాదు. అప్పుడే సమసమాజం సంభవం. అందుకనే స్వామీజీ రాజకీయ స్వాతంత్ర్యానికి ప్రాధాన్యతనీయక మనిషి నిర్మాణానికీ, మనిషిని నిర్మించే నాణ్యమైన విద్యా విధానానికీ ప్రాధాన్యమిచ్చారు. మానవ వికాసంలోనే సమాజ వికాసం గాంచిన క్రాంతి దర్శి స్వామి వివేకానంద.

నిజమైన విద్య: భావి సమాజం ఎలా ఉండాలో అటువంటి శిక్షణ విద్య ద్వారా నేటి విద్యార్థులకు ఇవ్వవలసిన అవసర ముంది. పరంపరాగతంగా వస్తున్న సంస్కృతిని భావితరాల కందించేదే నిజమైన విద్య.

“సామాన్య మనిషిని జీవన సమరానికి సన్నద్ధం చేయలేనిదీ, నైతిక బలం ఇవ్వలేనిదీ, సింహసదృశమైన పరాక్రమం నేర్పలేనిదీ ‘విద్య’ అనే పదానికి తగునా? అన్న స్వామీజీ ప్రశ్న ప్రస్తుత విద్యా వ్యవస్థకే ఒక సవాలు. శీలాన్ని శీలాన్ని కలిగిన మనిషిని, అటువంటి బాధ్యతాయుత మనుష్యులు గల జాతిని నిర్మించ వలసిన బాధ్యత విద్యావ్యవస్థది అన్న విషయాన్ని మరువ కూడదు. ‘వజతుల్యమైన జీవిత సమస్యల వలయాన్ని ఛేదించే శక్తి ఒక్క శీల సంపదకే ఉంది’ అని శీలనిర్మాణ ఆవశ్యకతను గుర్తు చేశారు స్వామీజీ. ఇంకా “శీలాన్ని నిర్మించే మానసిక, నైతిక శక్తిని ప్రసాదించే; స్వయంకృషిపై ఆధారపదేలా చేసే విద్య మనకు అవసరమ”ని కూడా తెలియజేశారు.

విద్య-ఆధ్యాత్మికభావాలు: మన జాతి జీవనాడి ఆధ్యాత్మికత అని కనుగొన్న వైద్యవరేణ్యుడు స్వామీజీ. విద్యా వ్యవస్థలో, సమాజంలో దాని ఆవశ్యకతను గుర్తిస్తూ ‘ఆధ్యాత్మిక చింతనను మానవ సముదాయం నుండి తొలగిస్తే మనకు మిగిలేది మానవ రూపంలో ఉన్న పశువుల మందలే’ అని హెచ్చరించారు. కనుక విద్యా వ్యవస్థ ద్వారా మన సంస్కృతీ సంపదైన ఆధ్యాత్మిక భావాలను అందరికి అందించకపోతే మనం తయారు చేసేది నర రూప రాక్షసులనే అన్న విషయం సత్యదూరం కాదు. ‘ఆధ్యాత్మిక భావాలే విద్యావ్యవస్థకు పట్టుగొమ్మలు’ అని గాఢంగా విశ్వసించారు స్వామీజీ.

ఇచ్చి పుచ్చుకోవాలి: వెలుగునిచ్చే దీపం క్రిందే చీకటి. పాశ్చాత్య భౌతిక నాగరకతా వ్యామోహం నుండి విడివడి భారతదేశం సురక్షితంగా, స్థిరంగా, శాశ్వతంగా మనగలగాలంటే మన జాతి ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవించి, పరిరక్రించుకొని, లబ్ధి పొందవలసిన బాధ్యత ప్రతి భారతీయునిదీ అని హెచ్చరించారు. అంతేకాదు, భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతి ప్రపంచ దేశాలకు వెలుగునివ్వాలన్నది స్వామీజీ ఆకాంక్ష పశ్చిమ దేశాలకు వెళ్ళి వేదాంత విజయ పతాకాన్ని ఎగురవేసిందందుకే!

భోగభాగ్యాలలో తులతూగుతూ, ప్రాపంచిక వ్యామోహంలో మగ్గుతున్న వారిని స్వామీజీ ఈ విధంగా హెచ్చరించారు: ‘మీరు మందు పాతరపై కూర్చున్నారు. ఒక్క నిప్పురవ్వతో అది ఏ క్షణాన్నైనా రగుల్మొని భగ్గుమనొచ్చు. మీరు గాని వచ్చి 50 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక పునాదులు ఏర్పరచుకోలేకపోతే- వినాశనం తప్పుదు’ అని కూడా చెవ్వ్పారు. అటువంటి వారికి భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతిని అందించాలనీ – అజ్ఞానం, దారిద్రాలతో సతమతమవుతున్న భారతదేశాన్ని పాశ్చాత్యుల వైజ్ఞానిక, సాంకేతిక సహాయంతో సుభిక్షం చేయాలన్నదే స్వామీజీ ధ్యేయం. వారి కార్యకలాపాలన్నింటికీ ఈ ధ్యేయమే ఆలంబనం. భారతదేశం ఆర్థికంగా నిరుపేద. పశ్చిమ దేశాలు ఆధ్యాత్మికంగా నిరుపేదలు. కనుక దేశాల మధ్య అన్యోన్య విశ్వాసం, సహాయ సహకారాలు, గౌరవ మర్యాదలూ పెంపొందాలంటే వారికున్న సంపదలను ఇచ్చి పుచ్చుకోవడం అనివార్యమనీ; మానవజాతి మనుగడకూ, సమతెాల్యానికీ, విశ్వశాంతికీ ప్రధాన సూత్రమనీ స్వామీజీ ప్రతిపాదించారు.

అందరికీ సమాన అవకాశాలు: రక్తప్రసారం శరీర మంతా సమంగా ప్రసరించినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది ప్రవహించని అంగం నిర్వీర్యమైపోతుంది. అలాగే సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ఆధ్యాత్మిక సంస్కృతి, భౌతిక సంపదలు, స్వేచ్చా స్వతంత్రాలూ అందం. సమానంగా అందాలి. అలా జరగని నాడు సమాజంలో అసమానతలు, వర్దభేదాలు, అసంతృప్తి, అశాంతి తాండవిస్తాయి. ‘ఆకాశంలో పక్షి స్వేచ్చగా ఎగరడానికి రెండు దృధమైన రెక్కలు ఎలా అవసరమో అలాగే సమాజాభివృద్ధికి దీనజన, ప్రీజనోద్దరణ జరగాల’ని సూచించారు స్వామీజీ. ‘మూర్ధదెవోభవ, దరిద్రదెవోభవ’ అన్న నినాదంతో అణగదొక్కబడిన వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సమాజంలో సగౌరవంగా జీవించేలాగ, మరియు ధనికులు, బవీదలను గౌరవించి సేవలందించడానికి చక్కని సదవకాశాన్ని కల్పించి సమసమాజ నిర్మాణానికి పిలుపునిచ్చారు.

స్వచ్చమైన మత నిర్వచనం: ‘అజ్ఞానులు ఎవరిని మనిషిగా చూస్తారో, ఆ మనిషే నా ఆరాధ్య దైవం’ అన్న స్వామి వివేకానందుడు అద్వితీయ మానవతావాది. మనిషిని మనిషిగా కాక భగవంతునిగా సేవించి ఆరాధించాలన్నదే వారి సేవాతత్త్వంలోని ప్రధాన సూత్రం. మతం పేరిట చలామణి అవుతున్న మూఢనమ్మకాలు, ఛాందనాలను, వికారాలను దుయ్యబడుతూ ‘నీలో హృదయ పవిత్రత లేనంత వరకూ, స్వార్థం గూడుకట్టుకొని ఉన్నంత వరకూ – ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నీ నీ శరీరం మీద పూసుకున్నా, ఎన్ని తీర్థాలలో మునిగినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా, కోటి దేవుళ్ళకు మ్రొక్కినా ప్రయోజనం శూన్యం’ అని స్వచ్చమైన మతానికి నిర్వచనం చెప్పారు స్వామీజీ.

బాంబుల సంస్కృతి; మతం పేరిట జరిగిన మారణహోమం, ప్రవహించిన రక్తపాతం శోచనీయమైన చారిత్రాత్మక సత్యం. మత దురభిమానం, మత ఛాందసం దీనికి మూలకారణాలు. మతాలు అనేవి మనుషుల మధ్య అద్దుగోడలుగా ఎదిగాయి. మనుషుల మధ్య, మనస్సుల మధ్య సమన్వయం ఏర్పడితే ఒక్క మత సమన్వయమేమిటి, విరోధ భావాలు ప్రతిపాదించే అన్ని సిద్ధాంతాల మధ్య సమన్వయం కుదురుతుంది. ఈ సమన్వయ సమాహారమే చికాగో సర్వమత మహాసభల్లో స్వామి వివేకానంద ఉపన్యాసాల పరంపర. అమెరికాకు బయలుదేరే ముందు ‘ఒక శక్తివంతమైన బాంబులా సమాజంపై పదనంత వరకూ తిరిగిరాను’ అని స్వామీజీ అన్నారు. చికాగో సభల్లో ఆయన ఒక శక్తివంతమైన బాంబును పేల్పారు – అయితే, అది విధ్వంసకారి కాదు – అన్ని సిద్ధాంతాలనూ సమన్వయపరిచే, అందరినీ కలిపే వేదాంత బాంబు! ఆ బాంబు పేలింది 1893 సెప్టెంబర్‌ 11వ తేదీన. అది మానవజాతి చెవులకు సోకలేదా? పెడచెవిన పెట్టిందా? విన్నా విస్మరించిందా? విస్మరించిన ఫలితమే మరో మారణహోమం- అదె సెప్టెంబర్‌ 11వ తేదీన, అదే అమెరికాలో ప్రపంచ వాణిజ్యమందలి విధ్వంసం – కానీ సంవత్సరం వెరు – ఇది 2001. ఇది మాత్రమె కాదు- మతఛాందసం పేరున బాంబుల సంస్కృతిలో బిక్కుబిక్కుమని భయభ్రాంతులతో  జీవిస్తూవున్నాయి. ప్రపంచ దేశాలు. విశ్వశాంతికి స్వామి వివేకానంద ఇచ్చిన మహత్తర సందేశమే ఆ విశ్వమత మహాసభలు – చికాగో నగర ఉపన్యాసాలు. వీటిని ప్రతి ఒక్కరూ చదివి, జీర్ణించుకుని, స్వామీజీ బాటలో నడవాలి. అదే విశ్వశాంతికి పూలబాట – రాచబాట.

ఉజ్వల భారతం: ప్రపంచ ప్రఖ్యాత నోబుల్‌ చరిత్రకారుడు ఆర్నాల్డ్‌ టాయిన్‌బీని ప్రస్తుత సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఏమిటని ప్రశ్నించగా – ‘సాంకేతిక, వైజ్ఞానిక రంగం’ అని బదులిచ్చారు. మరి వంద ఏళ్ళ తరువాతో అని అడిగితే – ‘ప్రాచ్యదేశాల భావజాలం ప్రపంచాన్ని శాసిస్తుంది’ని చెవ్పారు. మరి 300 సంవత్సరాల తరువాతి మాటేమిటి అని అడిగితే ‘భారతీయ ఆధ్యాత్మిక తరంగాలు ప్రపంచాన్ని ముంచెత్తుతాయి!’ అని జవాబు ఇచ్చారు. ‘చూడండి! భారతదేశపు ప్రతి నాడిలో, ప్రతి జీవిలో వివేకానందుడున్నాడి’ని అరవిందులు ఘోషించారు. ‘ఉజ్వల భారతం ఉద్భవించనున్నది’ అని స్వామీజీ దర్శించారు. వైశ్వీకరణ (Globalization)లో భారతదేశం అద్భుతమైన, బృహత్తరమైన పాత్రను వహించాలంటె – స్వామీజీ కన్న కలలు నిజం కావాలంటే, భారతీయులందరూ కలిసి ఉద్యమించి, స్వామీజీ బాటలో నడిచిననాడే అది సాధ్యమవుతుంది. లెండి! మేల్కొండి!. సర్వేజనాస్సుఖినోభవంతు?

(తేది 23-1-2013 న ఆకాశవాణి, విజయవాద కేంద్రం ద్వారా వ్రసారమైన వ్రసంగం)