స్వామి వివేకానంద చికాగో విశ్వమత మహాసభల్లో పాల్గొని 125 వసంతాలు నిండిన సందర్భంగా రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌ కేంద్రాలు సెప్టెంబర్‌ 2018 నుండి సెప్టెంబర్‌ 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా స్మారకోత్సవాలను నిర్వహించనున్నాయి. చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకొని ‘శ్రీరామకృష్ణ ప్రభ’ 2018 సెప్టెంబర్‌ సంచిక నుండి 2019 సెప్టెంబర్‌ సంచిక వరకు ప్రత్యేక వ్యాసాలను అందిస్తుంది.

మానవుని ఉన్నత తత్వమైన భగవంతుని లేక సర్వోతృష్ట సత్యాన్ని సాక్షాత్మరించుకునేందుకు దోహద పడటమే ‘మతం’ యొక్క నిజమైన ప్రయోజనం. న్వామి వివకానంద ఈ విషయాన్ని ఈ విధంగా నొక్కి వక్కాణించారు: “ప్రతిజీవిలోనూ దివ్యత్వం నిగూఢంగా ఉంది. అంతరంగంలో గల ఆ దివ్యత్వాన్ని బహిర్ల్దతం చేయడమే అసలు లక్ష్యం. దానిని పని ద్వారానో, ఆరాధన ద్వారానో, మనోనియంత్రణ ద్వారానో లేక వేదాంత తత్త్వం ద్వారానో – విటిలో ఏదో ఒక మార్దం ద్వారానో లేక అంతకంటే ఎక్కువ వాటితోనో, లేక అన్నిటినీ కలిపిగానీ అవలంబించి ముక్తిని పొందాలి. సిద్ధాంతాలు, పిడివాదాలు, కర్మకాండలు, ఆచారాలు, గ్రంథాలు, దేవాలయాలు లేక రూపాలు – ఇవన్ని అప్రధాన విషయాలే!”

మతం ఒక నాంఘిక ఆచారమా? ; మతం యొక్క ముఖ్యలక్ష్యాన్ని మరచి దానిని కేవలం ఒక సాంఘిక ఆచారంగా కుదించటం వలన అసలు సమస్య ఉత్పన్న మవుతుంది. “మీరు యూదువంళశీయులా రాజా” అని ‘పిలేట్‌’ జీసస్‌ని అడిగినప్పుడు ఆయన “నా రాజ్యం ఈ ప్రపంచానికి చెందినది కాదు” అని సమాధానమిచ్చారు. కానీ ఈ రోజులలో మతం ఎక్కువగా ఈ ప్రపంచానికి చెందినదే అయివుందిగానీ స్వర్దలోకపు రాజ్యానికి చెంది ఉండడం లేదు. సాంఘిక వర్గాలు, బృందాలు కొన్నిమత ఆచారాలను దీర్ణకాలం పాటు అవలంబించినప్పుడు వాటితో రాజకీయాలు అనుబంధం అయి వాటిలో రాజకీయం ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ విధంగా మతానికి రాజకీయ రంగుపులుముకోవడం ఆరంభమవుతుంది.

మతం తప్పేమీ లేదు : మతంలో రాజకీయ ప్రవేశం గురించి వారిస్తూ స్వామీజీ ఇలా అన్నారు : “మతానికి ఆపాదించబడిన  క్రూరత్వానికీ, దోషానికి మతం ఏవిధంగానూ కారణంకాదు. అందులో మతం తప్పేమీ లేదు. ఏ మతమూ మానవులను హింసించలేదు. ఏ మతమూ మంత్రగత్తెలనూ, మాంటత్రికులనూ కాల్చలేదు; ఏ మతమూ ఇటువంటి క్రూరమైన పనులను చేయనేలేదు. ఐతే మరది ఇటువంటి హింనాత్మక చర్యలకు జనులను ప్రోత్సహించినదెవరు? రాజకియాలే! అంతేగానీ మతం ఎన్నడూ కాదు. రాజకీయం మతం రంగు పులుముకుంటే అది ఎవరి తప్పు?”

చరిత్రలో తిరుగులేని సత్యమేమంటే మతం రాజకీయ వేషం దాలిస్తే అప్పుడది సంకుచితత్వం, మూర్థత్వంతో నిండిపోయి, ద్వేషానికీ, భయానికి, హింసకూ దారితీస్తుంది. చరిత్రలో అగుపించే క్రైస్తవుల, మహమ్మదీయుల మత దండయాత్రలు ఈ విషయానికి సంబంధించిన బాహ్య లక్షణాలే! మతం ఒక వర్తానికి రాజకీయ గుర్తింపు నిస్తుందనటంలో సందేహమేమీ  లేదు. కానీ ఆ గుర్తింపుతో ఆ వర్దంవారు ఇతర మతాల వాదిని ద్వేషించనవసరం లేదు. ఒకవేళ అటువంటి వర్షంవారు ఇతర మతాలవారందరూ నరకానికి వెళతారని విశ్వసించినా, ఇతర మతాల అనుయాయులందరినీ నాశనం చేయాలని వారు కంకణం కట్టుకోవలసిన అవసరం లేదు. ఈ విషయం తార్మికంగా ఆలోచించే వారికెవరికైనా అర్ధమవుతుంది. ఎందుకంటే ఎటూ వారు నరకానికే కదా వెళతారు. అటువంటప్పుడు తాము ద్వేషించే వారి గురించి ఆలోచించి, తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు?

రాజకీయ రంగుదాల్చిన మతం : మతమౌధ్యం, స్వమత దురభిమానం అశాస్త్రీయం, అతార్మికమూ మాత్రమేగాక మూర్థత్వం అని కూడా చెప్పవచ్చు. కానీ శాస్త్రవిజ్ఞానం అత్యున్నత స్థాయిలో ఉన్న ఈరోజులలో కూడా మత దురభీమానాగ్ని జ్వాలలు స్వార్ధపూరిత రాజకీయాలనే గాలులతో మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయి. ఆవిధంగా నిజమైన మతం లేక స్వామీజీ బోధించిన – ఈ ప్రపంచపు ఏకత్వాన్ని చాటిచెప్పే వేదాంతం స్థానాన్ని ‘రాజకీయరంగు దాల్పిన మతం’ భర్తీ చేసింది. వేదాంతం స్థానంలో ఇది వచ్చి చేరింది. తత్ఫలితంగా మానవాళి సంకుచితమైన బృందాలుగా విడిపోయి ఒకరితో ఒకరు పోరాటం కొనసాగిస్తున్నారు. దీని ప్రభావం వలన ఐకమత్యమే లక్ష్యంగాగల నిజమైన మతం క్రూరత్వమే తన లక్ష్యంగా మార్చుకొని, మానవాళినంతటినీ పోరాటాలు సలిపే వర్ణాలుగా విభజించింది. ఈ విషయంలో స్వామీజీ ఇలా అన్నారు ; “ప్రపంచంలో మతం గురించి పనిచేసిన వారందరూ నిజంగా రాజకీయ కార్యకర్తలే! మానవాళి చరిత్రే అది! వారందరూ సత్యంవైపు పయనించడానికి చాలా అరుదుగా ప్రయత్నించారు. వారెల్లప్పుడూ సంఘాన్నె భగవంతునిగా పూజించారు. సామాన్య జనులు ఎక్కువగా విశ్వసించే మూధాచారాలనూ, బలహీనతలనూ పోషించడానికే కృషి చేశారు. ప్రకృతిని జయించడానికి ప్రయత్నించకుండా దానిలోనే ఒదిగిపోయారు తప్ప ఇంకేమీ చేయలేదు.”

మతాన్ని రాజకీయాల నుండి వేరుపరచాలి :

ఇప్పుడు మానవాళినంతటినీ వారివారి మతవిశ్వాసాల ప్రకారం విభజించడం అసలు అవసరమా? అదిగాక వివిధ వర్గాలలో సర్వనాధారణంగా ఉండే వేరే అంశమేమీ లేదా? మత కలహాలు వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ మతపురోభివృద్ధికి తోద్పదతాయా? అవి సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయా? ఇటువంటి సందేహాలనేకం ఉత్పన్నమవుతాయి.

సరియైన విద్య, హేతుబద్ధ దృష్టి ద్వారా మతాన్ని రాజకీయాలనుండి వేరుచేయాలని సూచన లభిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి.  మతమేమో అలౌకిక ప్రపంచానికి చెందినది. కుంచించుకుపోతున్న ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడైనా, ఏదైనా సంఘటన – మంచిదిగాని చెడుదిగానీ జరిగితే, అది ప్రపంచంలోని మిగిలిన వాటిపై ప్రభావాన్ని చూపిస్తుందనెది కాదనలేని సత్యం. కాబట్టి మన మధ్యనున్న విభేదాలపై దృష్టిపెట్టకుండా, ఎక్కడ ఐక్యతను పొంద గలమో కనుగొనాలి. మనందరికీ ఐక్యతా అంశమేదో పరిశీలించాలి.

‘యత్ర విశ్వం భవత్వేకనీదమ్‌’ అని బుగ్వేదంలోని మహానారాయణోపనిషత్తులో తెలుపబడిన విధంగా ‘ఈ విశ్వమంతా ఒకటిగా అవ్వాలి’. అందుచేత వ్యక్తికి గానీ, సంఘానికిగానీ సర్వమత సమన్వయం జీవిత సత్యంగా రూపొందాలంటే, నివారణాచర్యల గురించి ఆలోచించాలి.

(వచ్చే సంచికలో ‘స్వామ్‌జీ కలలుగన్న విశ్వజనీనమతం’)

(*పరమపూజ్య స్వామి స్మరణానందజీ మహరాజ్‌ ప్రస్తుత రామకృష్ణ సంఘ సర్వాధ్యక్షులు)

తెలుగు సేత : డాక్టర్‌ పన్నాల శ్యామసుందరమూర్తి